Konda Surekha: ఇది సిగ్గు చేటు.. కొండా సురేఖ కామెంట్స్‌పై గళమెత్తుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. హనుమాన్ హీరో, రవితేజ కూడా..-konda surekha comments beyond shameful says ravi teja its unacceptable feels hanuman hero teja sajja ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Konda Surekha: ఇది సిగ్గు చేటు.. కొండా సురేఖ కామెంట్స్‌పై గళమెత్తుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. హనుమాన్ హీరో, రవితేజ కూడా..

Konda Surekha: ఇది సిగ్గు చేటు.. కొండా సురేఖ కామెంట్స్‌పై గళమెత్తుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. హనుమాన్ హీరో, రవితేజ కూడా..

Hari Prasad S HT Telugu
Oct 03, 2024 02:09 PM IST

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగార్జున, నాగ చైతన్య, సమంతపై చేసిన కామెంట్స్ పై సినిమా ఇండస్ట్రీ మొత్తం గళమెత్తుతోంది. తాజాగా హనుమాన్ హీరో తేజ సజ్జ, రవితేజ కూడా చాలా ఘాటుగా స్పందించారు.

ఇది సిగ్గు చేటు.. కొండా సురేఖ కామెంట్స్‌పై గళమెత్తుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. హనుమాన్ హీరో, రవితేజ కూడా..
ఇది సిగ్గు చేటు.. కొండా సురేఖ కామెంట్స్‌పై గళమెత్తుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. హనుమాన్ హీరో, రవితేజ కూడా..

Konda Surekha: మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వరుసగా ఒక్కో సెల్రబిటీ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది సిగ్గుచేటు అనడం కంటే కూడా దారుణమైన విషయమని రవితేజ ఘాటుగా ట్వీట్ చేశాడు. మూడు లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన రాజకీయ నాయకులు.. కోట్ల మంది మెచ్చే తమపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటంటూ హనుమాన్ హీరో తేజ సజ్జ మరింత తీవ్రంగా స్పందించాడు.

సిగ్గుచేటు అనడం కంటే దారుణం: రవితేజ

కొండా సురేఖ కామెంట్స్ పై రవితేజ ఎక్స్ అకౌంట్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. "ఓ మహిళా మంత్రి తన రాజకీయాల కోసం ఇలాంటి చిల్లర వ్యూహాలు, దిక్కుమాలిన ఆరోపణలు చేసి గౌరవనీయ వ్యక్తులను అవమానించడం చూసి నేను షాక్ తిన్నాను.

ఇది సిగ్గు చేటు అనడం కంటే కూడా దారుణం. మీ రాజకీయాల్లో ఏ ఇతర వ్యక్తులనూ, ముఖ్యంగా మహిళలను అసలు లాగొద్దు. నాయకులు సమాజంలో విలువలను పెంచేలా ఓ సానుకూల ఉదాహరణగా నిలవాలి తప్ప ఇలా వాటిని పాడు చేయొద్దు" అని రవితేజ తీవ్రంగా స్పందించాడు.

తేజ సజ్జ.. మరింత ఘాటుగా..

అటు హనుమాన్ హీరో తేజ సజ్జ కూడా ఎక్స్ ద్వారా మరింత ఘాటుగా స్పందించాడు. రాజకీయ నాయకులకు, ఆర్టిస్ట్ కు ఉన్న తేడాను చెబుతూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

"మూడు లక్షల ప్రజల ఓట్లు మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా మారుస్తాయి. 10 కోట్ల మంది నమ్మకాన్ని గెలుచుకుంటే నటులు అవుతారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఎవరినైనా ముఖ్యంగా మహిళలను అవమానపరచడం సహించరానిది. మా నటులపై మీకు అలాంటి అభిప్రాయం ఉందని తెలిసి చాలా బాధగా ఉంది. నటులుగా ఎన్నో సామాజిక సేవలకు ఎప్పుడూ ముందే ఉంటాం.

విరాళాలైనా, సేవలైనా, పన్నులైనా సరే. ఇన్ని చేస్తున్నా చివరికి ప్రజలను ఆకర్షించడానికి అనవసరంగా మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీ రాజకీయ అవసరాల కోసం వ్యక్తుల జీవితాలపై బురద జల్లుతున్నారు" అని తేజ సజ్జ ట్వీట్ చేశాడు.

గళమెత్తిన టాలీవుడ్

సమంత, నాగార్జున, నాగ చైతన్యలపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ కు వ్యతిరేకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం గళమెత్తింది. ఇప్పటికే ఆ ముగ్గురితోపాటు అమల అక్కినేని, చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రాంగోపాల్ వర్మ, ఖుష్బూ, మంచు లక్ష్మి, విశ్వక్సేన్ లాంటి వాళ్లు కొండా సురేఖను కడిగేస్తూ ట్వీట్లు చేశారు. అటు నాగార్జున కూడా ఆమెకు లీగల్ నోటీసులు పంపించడానికి సిద్ధమవుతున్నాడు.

స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల‌పై కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో క‌ల‌క‌లాన్ని రేపుతోన్నాయి. టాలీవుడ్ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వాఖ్య‌ల‌ను ఖండిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌పై జ‌రుగుతోన్న మాట‌ల దాడిని అడ్డుక‌ట్ట‌వేసేందుకు తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఓ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మీటింగ్‌క‌కు సినీ న‌టీన‌టుల‌తో పాటు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది.

Whats_app_banner