Hanu-Man in 3D: బ్లాక్‌బస్టర్ హనుమాన్ మళ్లీ వస్తోంది.. 3డీలో రీరిలీజ్ చేస్తున్నామన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ-hanuman re releasing in 3d version in india reveals director prasanth varma hanuman re release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanu-man In 3d: బ్లాక్‌బస్టర్ హనుమాన్ మళ్లీ వస్తోంది.. 3డీలో రీరిలీజ్ చేస్తున్నామన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Hanu-Man in 3D: బ్లాక్‌బస్టర్ హనుమాన్ మళ్లీ వస్తోంది.. 3డీలో రీరిలీజ్ చేస్తున్నామన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Hari Prasad S HT Telugu
Aug 20, 2024 06:36 PM IST

Hanu-Man in 3D: హనుమాన్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. అయితే ఈసారి 3డీ వెర్షన్ లో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూసే అవకాశం కలగనుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా.. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.

బ్లాక్‌బస్టర్ హనుమాన్ మళ్లీ వస్తోంది.. 3డీలో రీరిలీజ్ చేస్తున్నామన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
బ్లాక్‌బస్టర్ హనుమాన్ మళ్లీ వస్తోంది.. 3డీలో రీరిలీజ్ చేస్తున్నామన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Hanu-Man in 3D: సంక్రాంతి సందర్భంగా రిలీజై.. 90 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన హనుమాన్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. అయితే ఈసారి 3డీ వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ మూవీ జపాన్ లో రిలీజ్ కానుంది. అక్టోబర్ లో ఆ దేశంలో మూవీని రిలీజ్ చేయనున్నామని, అయితే అంతకంటే ముందు ఇండియాలోనూ 3డీలో మరోసారి హనుమాన్ ను రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.

హనుమాన్ 3డీ రీరిలీజ్

తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ సంక్రాంతికి రిలీజై ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను అక్టోబర్ లో జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. అదే సమయంలో ఇండియాలోనూ 3డీ వెర్షన్ రీరిలీజ్ చేయాలనుకుంటున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పాడు.

"మేము హనుమాన్ ను ఇప్పుడు 3డీలోకి మార్చాం. అంతర్జాతీయ వెర్షన్లన్నీ 3డీలోనూ రిలీజ్ అవుతాయి. అయితే జపాన్ లో రిలీజ్ సమయంలోనే ఇండియాలోనూ పలు ఎంపిక చేసిన థియేటర్లలో హనుమాన్ 3డీ వెర్షన్ రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని ప్రశాంత్ వర్మ తెలిపాడు.

జపాన్‌లో సౌత్ సినిమాల హవాపై..

చాలా ఏళ్లుగా జపాన్ లో సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు రజనీకాంత్ సినిమాలకే పరిమితం కాగా.. ఈ మధ్య కాలంలో ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ సినిమాలు కూడా ఆ దేశంలో రికార్డులు క్రియేట్ చేశాయి. దీనిపై ప్రశాంత్ వర్మ స్పందించాడు.

"నార్త్ లో చాలా కాలంగా పాశ్చాత్య ప్రభావం చాలా ఉంది. సౌత్ తో పోలిస్తే గత పదేళ్లుగా వాళ్లు పాశ్చాత్య సినిమాలను ఎక్కువగా ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే సౌత్ సినిమాలు ఇప్పటికే జపాన్, కొరియాలకు దగ్గరగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషన్ల విషయంలో. మంచి కంటెంట్ ఉంటే జపాన్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు" అని ప్రశాంత్ వర్మ అన్నాడు.

హనుమాన్ మూవీని జపనీస్ లోకి డబ్ చేయడం లేదని, జపనీస్ సబ్ టైటిల్స్ తోనే రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది రిలీజైన తెలుగు సినిమాల్లో కల్కి 2898 ఏడీ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా హనుమాన్ నిలిచింది. నిజానికి ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమా కావడం విశేషం. ఇప్పుడు 3డీలోనూ అలరించడానికి సిద్ధమవుతోంది.

Whats_app_banner