Samantha: సమంతని వదలని అక్టోబరు సెంటిమెంట్.. ఏడేళ్లుగా ఏదో ఒక వివాదం!-actress samantha ruth prabhu hits back at telangana minister konda surekha for comments on her divorce ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samantha: సమంతని వదలని అక్టోబరు సెంటిమెంట్.. ఏడేళ్లుగా ఏదో ఒక వివాదం!

Samantha: సమంతని వదలని అక్టోబరు సెంటిమెంట్.. ఏడేళ్లుగా ఏదో ఒక వివాదం!

Oct 03, 2024, 01:00 PM IST Galeti Rajendra
Oct 03, 2024, 01:00 PM , IST

Konda Surekha Comments on Samantha: సమంత, నాగ చైతన్య విడాకుల ఇష్యూని మాజీ మంత్రి కేటీఆర్‌కి ముడిపెడుతూ వివాదాస్పద కామెంట్స్ చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే సమంత గతంలోనూ ఇదే తరహాలో అక్టోబరు నెలలోనే వివాదాలను ఎదుర్కొంది. అవి ఏంటంటే? 

సీనియర్ హీరోయిన్ సమంతని గత కొన్నేళ్లుగా వివాదాలు వీడటం లేదు. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. సమంత, నాగచైతన్య విడాకులకి కేటీఆర్ కారణమంటూ కామెంట్స్ చేయడం దుమారం రేపింది. అయితే తన విడాకుల విషయంలో ఎవరి ప్రమోయం లేదని సమంత క్లారిటీ ఇచ్చింది. 

(1 / 10)

2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, వివాదాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక దశలో ప్రశాంతత కోసం సద్గురు ఆశ్రమంలో కొన్ని రోజులు గడిపింది. 

(2 / 10)

విడాకుల తర్వాత ఏడాది వ్యవధిలోనే సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధి బారినపడినట్లు ప్రకటించింది. ఆ మయోసైటిస్ నుంచి కోలుకోవడానికి సమంత చాలా రోజుల పాటు సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది.ి. 

(3 / 10)

మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత వరుస సినిమాలు చేసింది. అందులో కొన్ని హిట్ అవగా.. మరికొన్ని డిజాస్టర్‌గా మిగిలాయి. అయినప్పటికీ ఐఫా ఉత్సవం 2024లో ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డును సమంత సొంతం చేసుకోగలిగింది. 

(4 / 10)

ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకోగా.. సమంతని మళ్లీ నెటిజన్లు తెరపైకి తీసుకొచ్చారు. వారి విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. సమంతని ట్రోల్ చేశారు. కానీ.. సమంత మౌనంగా ఉండిపోయింది. 

(5 / 10)

మయోసైటిస్ తర్వాత సమంత హెల్త్‌తో పాటు ఫిట్‌నెస్ కూడా కాస్త దెబ్బతింది. దాంతో గత కొన్ని రోజులుగా సౌత్ సినిమాలకి దూరంగా ఉంటున్న సమంత ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు జిమ్‌లో శ్రమిస్తోంది. ఈ మేరకు రెగ్యులర్‌గా వర్కవుట్ ఫొటోలు, వీడియోలను ఈ ముద్దుగుమ్మ షేర్ చేస్తోంది.

(6 / 10)

సమంతని గత ఏడేళ్ల నుంచి అక్టోబరు సెంటిమెంట్ వెంటాడుతోంది. నాగచైతన్యనని 2017 అక్టోబరులో సమంత పెళ్లి చేసుకోగా.. ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంది కూడా 2022 అక్టోబరు నెలలోనే కావడం గమనార్హం. 

(7 / 10)

2022న అక్టోబరు నెలలోనే సమంత మయోసైటిస్ బారినపడినట్లు ప్రకటించింది. అయితే యశోదా సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె అనారోగ్యం నాటకం ఆడుతోందని అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు సమంత గురించి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద మాటలు కూడా అక్టోబరులోనే కావడం గమనార్హం. అది కూడా సమంత, నాగచైతన్య విడిపోయిన అక్టోబరు 2వ తేదీనాడే కావడం యాదృశ్చికం. 

(8 / 10)

కేటీఆర్‌తో ముడిపెడుతూ సమంత గురించి కొండా సురేఖ జుగుప్సాసకరమైన వ్యాఖ్యలు చేసినా.. సమంత హుందాగానే స్పందించింది. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా అంటూ రాసుకొచ్చింది. 

(9 / 10)

కేటీఆర్‌తో ముడిపెడుతూ సమంత గురించి కొండా సురేఖ జుగుప్సాసకరమైన వ్యాఖ్యలు చేసినా.. సమంత హుందాగానే స్పందించింది. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా అంటూ రాసుకొచ్చింది. (Instagram)

ఇన్నాళ్లు హీరోయిన్‌గా చేసిన సమంత.. ఈ ఏడాది నుంచి ప్రొడ్యూసర్‌గా మారి సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. తన  కొత్త ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్​ నుంచి  మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియేంటెడ్‌ మూవీని సమంత నిర్మిస్తోంది. ఇందులో సమంతానే లీడ్ రోల్ పోషిస్తోంది.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు