Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. నరసింహకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్.. దీపతో మొండిగా వాదించిన శౌర్య-karthika deepam 2 serial today may 16th episode karthik warns narashimh to stay away from deepa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. నరసింహకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్.. దీపతో మొండిగా వాదించిన శౌర్య

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. నరసింహకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్.. దీపతో మొండిగా వాదించిన శౌర్య

Gunti Soundarya HT Telugu
May 16, 2024 07:35 AM IST

Karthika deepam 2 serial today may 16th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప జోలికి వస్తే ఇంకోసారి ఊరుకునేది లేదని నరసింహకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. పెద్ద స్కూల్ లో అడ్మిషన్ కోసం వెళ్ళిన దీపని ఇవ్వమని చెప్పి పంపించేస్తారు.

కార్తీకదీపం 2 సీరియల్ మే 16వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 16వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 16th episode: దీప శౌర్యని తీసుకుని స్కూల్ కి వస్తుంది. అక్కడే నరసింహ ఉంటాడు. ఇతను ఇక్కడ ఉన్నాడు ఏంటి నా మీద కోపంతో శౌర్యకి నేనే మీ నాన్న అని చెప్పినా చెప్తాడని అనుకుని నరసింహకి కనిపించకుండా వెళ్ళిపోతుంది.

శౌర్యని స్కూల్ కి తీసుకొచ్చిన దీప

స్కూల్ ప్రిన్సిపల్ ని దీప కలుస్తుంది. తనని చూసి ప్రస్తుతం ఆయాలు ఉన్నారు అవసరం అయితే ఫోన్ చేస్తానని అంటాడు. పాపని స్కూల్ లో చేర్పించడం కోసం వచ్చినట్టు దీప చెప్తుంది. చాలా తెలివైనది మీ బడిలో చేర్పించుకోండి ఎలాగైనా కష్టపడి స్కూల్ ఫీజు కడతానని అంటుంది.

నువ్వు ఏం చదువుకున్నావ్ అంటే ఐదో తరగతి అంటుంది. మీ ఆయన ఏం చేస్తాడని ప్రిన్సిపల్ అడుగుతాడు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మా స్కూల్ లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు బాగా చదువుకుని ఉండాలి. మీరు సరిగా చదువుకోకపోతే వాళ్ళని ఎలా చదివిస్తారని అడుగుతాడు.

కార్తీక్ కావాలి

శౌర్య చాలా తెలివైనది అన్నీ వచ్చని అంటుంది. స్కూల్ లో చేర్పించుకోవడం కుదరదని చెప్తాడు. దీప బాధగా బయటకు వచ్చేస్తుంది. శౌర్య దగ్గరకు వస్తే స్కూల్ తనకు బాగా నచ్చిందని వెంటనే చేరిపోదామని అంటుంది. ఈ స్కూల్ లో చేరడం లేదని దీప చెప్తుంది.

నిన్ను చేర్పించాలంటే నేను కూడా బాగా చదువుకుని ఉండాలంట. నిన్ను వేరే స్కూల్ లో చేర్పిస్తానని అంటుంది. వద్దు నాకు ఈ స్కూల్ బాగా నచ్చింది. కార్తీక్ ని రమ్మంటాను తను చేర్పిస్తాడు అని దీపతో శౌర్య గొడవ పడుతుంది. ఎందుకు నీకు కార్తీక్ అంటే కోపమని నిలదీస్తుంది.

నువ్వు కలెక్టర్ అవాలి

నాన్నని రమ్మను లేదంటే కార్తీక్ ని రమ్మను అని శౌర్య మొండిగా వాదిస్తుంది. ఇంటికి రానని చెప్పి అలుగుతుంది. ఏ స్కూల్ అయితే ఏంటి ఎక్కడైనా చదువే కదా అంటుంది. కానీ శౌర్య మాత్రం నాకు ఈ స్కూల్ నచ్చిందని అంటుంది. మా నాన్న నన్ను కలెక్టర్ అవ్వాలి అన్నాడు నేను కాలేకపోయాను నువ్వు అవాలి అంటుంది.

శౌర్యకి నచ్చజెప్పి దీప తనని తీసుకెళ్లిపోతుంది. రోడ్డు మీద నరసింహ కారుకు కార్తీక్ కారు అడ్డంగా వస్తుంది. నువ్వు నా జీవితానికే అనుకున్నా నా కారుకి కూడా అడ్డు వస్తున్నావ్ అంటాడు. మళ్ళీ దీప, కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడతాడు.

దీప మంచి కోరుకునే శ్రేయోభిలాషిని

నరసింహ మాటలకు కార్తీక్ కోపంగా వాడి కాలర్ పట్టుకుంటాడు. కొట్టుకోవడానికి నేను రెడీ నాకు పోవడానికి ఏం లేదు నీకు మాత్రం పరువు ఉందని నరసింహ బెదిరిస్తాడు. నీలాంటి వాడికి దీప పేరు ఎత్తే అర్హత లేదని కార్తీక్ అంటాడు. మరి నీకు ఉందా అంటే ఉంది నేను దీప మంచి కోరుకునే శ్రేయోభిలాషిని అంటాడు.

ఒక భర్త ఎలా ఉండాలనేదానికి ఉదాహరణ నా తండ్రి, ఎలా ఉండకూడదు అనే దానికి ఉదాహరణ నువ్వు. దీప తన బతుకు ఏదో తాను బతుకుతుంది. నువ్వు రెండో పెళ్లి చేసుకుని బాగానే ఉన్నావ్ కదా అలాగే ఉండు. మొన్న ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు నీ అంతు చూడాలని అనుకున్నాను.

స్ట్రాంగ్ వార్నింగ్

కానీ ఏం చేసినా తిరిగి ఆగేది దీప దగ్గర. అందుకే ఆగిపోయాను. ఇప్పటి వరకు తను పోగొట్టుకున్నది చాలు నువ్వు దీపని బాధపెట్టనంత వరకు నీ జోలికి రాకుండా ఉంటాను. బాధపెడితే నువ్వు బయట తిరగడానికి కూడా భయపడేలా చేస్తానని నరసింహకు కార్తీక్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

పాపని స్కూల్ లో చేర్పించావా అని కడియం దీపని అడుగుతాడు. పెద్ద స్కూల్ లో చేర్పించలేదు అందులో చేర్పించాలంటే బాగా చదువుకుని ఉండాలంట అని చెప్తుంది. మరి మీ ఆయన అని అంటాడు. కొన్ని కారణాల వల్ల భర్తకు దూరంగా ఉంటున్నానని దీప చెప్తుంది.

జ్యోత్స్న పారిజాతం మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పరధ్యానంగా గ్లాసు కింద పడేయబోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. జ్యోత్స్న ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్టు ఉందని సుమిత్ర అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ముగిసింది.