Action Thriller OTT: ఈ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ తెలుగులోకి వచ్చింది -ఏ ఓటీటీలో చూడాలంటే?
Action Thriller OTT: ఈ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన భీమా మూవీ తెలుగులో రిలీజైంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దునియా విజయ్ హీరోగా నటిస్తూ భీమా మూవీకి దర్శకత్వం వహించాడు.
Action Thriller OTT: కన్నడ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భీమా తెలుగులోకి వచ్చింది. శుక్రవారం నుంచి భీమా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చినట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.
హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ...
భీమా మూవీలో కన్నడ సీనియర్ హీరో దునియా విజయ్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు స్వయంగా అతడే దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. దాదాపు 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన భీమా మూవీ 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు రెండింతల ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది.
2024 ఏడాదిలో కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా భీమా రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో మొదటిరోజే ఈ మూవీ పది కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నది. ఈ ఏడాది కన్నడంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా భీమా నిలిచింది.
డైరెక్టర్‌గా సెకండ్ మూవీ...
డైరెక్టర్‌గా భీమా దునియా విజయ్‌కి సెకండ్ మూవీ. సలగ మూవీతో డైరెక్టర్‌గా మారాడు దునియా విజయ్. భీమా మూవీలో సలగ పాత్రను క్లైమాక్స్‌లో చూపించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌చేశాడు దునియా విజయ్. భీమా మూవీకి దునియా విజయ్ మాస్ యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. భీమా మూవీలో అశ్విని, ప్రియ శంతమరాసన్, అచ్యుత్‌కుమార్, కళ్యాణి రాజు, డ్రాగన్ మంజు కీలక పాత్రల్లో నటించారు
భీమా కథ ఇదే...
భీమా (దునియా విజయ్)ఓ అనాథ. రామన్న అతడిని పెంచి పెద్దచేస్తాడు. బైక్ మెకానిక్‌గా సాధారణ జీవితం గడుపుతోన్న భీమా అనుకోకుండా డ్రగ్ మాఫియాపై పోరాటానికి దిగుతాడు. బ్లాక్ డ్రాగన్ మంజా అనే రౌడీని ఎదురిస్తాడు. డ్రాగన్ మంజా వెనుక మినిస్టర్లు ఉన్నారనే నిజం భీమాకు తెలుస్తుంది.
రౌడీలు, పోలీసులతో పాటు పొలిటికల్ లీడర్స్‌కు భీమా శత్రువుగా మారతాడు. వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భీమాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? జైలులో ఉన్న సలగకు, భీమాకు ఉన్న సంబంధం ఏమిటి? డ్రగ్ మాఫియాను భీమా అంతం చేశాడా? భీమాకు అండగా నిలిచి అశ్వినితో పాటు ఇన్స్‌పెక్టర్ గిరిజ ఎవరన్నదే ఈ మూవీ కథ.
మూడేళ్లు గ్యాప్...
భీమా కంటే ముందు దాదాపు మూడేళ్ల కన్నడ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చాడు దునియా విజయ్. 2021లో రిలీజైన సలగ తర్వాత మళ్లీ భీమాతోనే ఆడియెన్స్‌ను పలకరించాడు. ఈ ఏడాది రిలీజైన కొట్టే సినిమాలో దునియా విజయ్ గెస్ట్ పాత్రలో నటించాడు. బాలకృష్ణ హీరోగా గత ఏడాది సంక్రాంతికి రిలీజైన వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు దునియా విజయ్. ఈ యాక్షన్ మూవీలో మెయిన్ విలన్‌గా దునియా విజయ్ కనిపించాడు.
కూతురు హీరోయిన్‌గా...
ఇటీవలే డైరెక్టర్‌గా మూడో మూవీని అనౌన్స్‌చేశాడు దునియా విజయ్. సిటీ లైట్స్ పేరుతో లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. సిటీ లైట్స్ సినిమాతో తన కూతురు మోనిషా విజయ్ కుమార్‌ను హీరోయిన్‌గా సాండల్‌వుడ్‌కు దునియా విజయ్ పరిచయం చేయబోతున్నాడు.