Kalki 2898 AD sequel: కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో ప్రభాస్ పాత్ర చనిపోతుందట: టీవీ కృష్ణుడు ఏం చెప్పాడంటే?
Kalki 2898 AD sequel: కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీవీ మహాభారతం సీరియల్ కృష్ణుడు నితీష్ భరద్వాజ్. ఈ మూవీ గురించి అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Kalki 2898 AD sequel: టీవీ షో మహాభారతం (1988)లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన నటుడు నితీష్ భరద్వాజ్.. నాగ్ అశ్విన్ మూవీ కల్కి 2898 ఏడీ గురించి మాట్లాడాడు. సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుందని అతడు అంచనా వేయడం విశేషం. న్యూస్ 18 తో మాట్లాడుతూ.. దర్శకుడు మహాభారత పాత్రలను తెలివిగా ఉపయోగించుకున్నాడని, కల్కి భవిష్యత్తు పుట్టుకను ప్రశంసించాడు. హిందీ చిత్ర నిర్మాతలు దక్షిణాదిని చూసి నేర్చుకోవాలని ఆయన అనడం గమనార్హం.
వాళ్లను చూసి నేర్చుకోండి
హిందీ చిత్ర నిర్మాతలు దక్షిణాదిని చూసి నేర్చుకోవాలి అని నితీష్ అన్నాడు. "మహాభారత పాత్రలను తెలివిగా ఉపయోగించుకున్నాడు. మహావిష్ణు చివరి అవతారం కల్కి భవిష్యత్తు పుట్టుక గురించి కూడా. హిందీ చిత్ర నిర్మాతలు దక్షిణాదిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వారు మన పురాణాలు, ఇతిహాసాలను చాలా లోతుగా చూపిస్తున్నారు.
నిస్సందేహంగా, కల్కికి మ్యాడ్ మ్యాక్స్ సినిమాల నుండి స్ఫూర్తి పొందినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, ఇది భిన్నంగా అనిపించింది. ఎందుకంటే, అసలు కథ కంటే ఈ సెట్స్, ప్రొడక్షన్ డిజైన్ అనేవి తక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అశ్విన్ ఈ రెండింటిని చాలా బాగా మిక్స్ చేశాడు" అని నితీష్ స్పష్టం చేశాడు.
కల్కి 2898 ఏడీ సీక్వెల్‌పై నితీష్ ఏమన్నాడంటే..
కల్కి 2898 ఏడీ సీక్వెల్ కథాంశం గురించి నితీష్ తన ఫీలింగ్ ను పంచుకున్నాడు. "ప్రభాస్ అలియాస్ కర్ణుడు సీక్వెల్లో చనిపోతాడు. అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్), కృష్ణుడు విమోచన మార్గాన్ని చూపినప్పటికీ అతనిది విలన్ పాత్ర. ఇక సీక్వెల్లో కృష్ణుడి పాత్ర ముఖాన్ని దాచాల్సిన అవసరం నాగ్ అశ్విన్ కు లేదని, తాను దానికి అందుబాటులో ఉంటానని చెప్పాడు.
కృష్ణ పాత్ర గురించి నాగ్ ఏమన్నారంటే..
రీసెంట్ గా పింక్ విల్లాతో మాట్లాడిన నాగ్ అశ్విన్.. కృష్ణ క్యాస్టింగ్ పై క్లారిటీ ఇచ్చాడు. "అతన్ని ఎల్లప్పుడూ ఒక గుర్తింపు లేకుండా, రూపరహితంగా ఉంచాలనే ఆలోచన ఉంది. లేదంటే మనిషిగానో, నటుడిగానో మారిపోతాడు. అతన్ని నల్లటి చర్మంతో, సిల్హౌట్ గా, ఒక మిస్టీరియస్ ఫిగర్ లా ఉంచాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది" అని ఆయన అన్నాడు.
ఇక మహాభారతం సీరియల్ గురించి చెప్పాలంటే.. బీఆర్ చోప్రా నిర్మించగా, ఆయన కుమారుడు రవి చోప్రా దర్శకత్వం వహించాడు. మహాభారతం ఇతిహాసం ఆధారంగా 94 ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్ 1988 నుంచి 1990 వరకు దూరదర్శన్ లో తొలిసారిగా ప్రసారమైంది. ఈ షోలో గిరిజా శంకర్, గూఫీ పెయింటల్, గజేంద్ర చౌహాన్, పంకజ్ ధీర్, ముఖేష్ ఖన్నా, రూపా గంగూలీ తదితరులు నటించారు.
కల్కి 2898 గురించి ఏడీ
నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ రూ.600 కోట్ల బడ్జెట్ తో ఇండియాలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, ప్రభాస్, దిశా పటానీ, శోభన తదితరులు నటించారు.
టాపిక్