Kalki 2898 AD Box Office: ఒక్కరోజులో 3.33 శాతం తగ్గిన కల్కి 2898 ఏడీ కలెక్షన్స్- మరి లాభాలు ఎన్ని కోట్లో తెలుసా?
Kalki 2898 AD 23 Days Worldwide Collection: నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమా 23 రోజులకు చేరుకుంది. అయితే ఒక్క రోజులో మాత్రం 3.33 శాతం కలెక్షన్స్ తగ్గాయి. ఇలా కల్కి సినిమాకు 23 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతనే లెక్కల్లోకి వెళితే..
Kalki 2898 AD Box Office Collection: భైరవగా ప్రభాస్ నటించిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 27న విడుదలై ఇప్పటికీ 23 రోజులు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఎక్కడా తగ్గకుండా సత్తా చాటుతూనే ఉంది.
3.33 శాతం తగ్గుదల
బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటానీ రూక్సీగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో 23వ రోజున రూ. 2.9 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అయితే ఇవి 22వ రోజు వచ్చిన రూ. 3 కోట్ల కలెక్షన్స్‌కు లక్ష రూపాయల వరకు తక్కువగా ఉన్నాయి. దీంతో 3.33 శాతం కలెక్షన్స్ 23వ రోజున తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
భాషల వారీగా కలెక్షన్స్
ఇక ఆ వచ్చిన 2.9 కోట్ల కలెక్షన్లలో వాటాలా వారీగా చూస్తే.. తెలుగు వెర్షన్ నుంచి కోటి రూపాయలు, హిందీ బెల్ట్ నుంచి రూ. 1.55 కోట్లు, కన్నడకు 3 లక్షలు, మలయాళం నుంచి రూ. 12 లక్షలుగా నమోదు అయ్యాయి. ఇక ఓవరాల్‌గా ఇండియాలో 23 రోజుల్లో కల్కి సినిమాకు రూ. 602.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
హిందీలోనే ఎక్కువగా
వాటిలో రూ. 272.6 కోట్లు తెలుగు వెర్షన్ నుంచి వసూలు అయ్యాయి. అలాగే హిందీ నుంచి రూ. 262.45 కోట్లు, తమిళం నుంచి రూ. 34.25 కోట్లు, కర్ణాటక నుంచి 5.26 కోట్లు, మలయాళం నుంచి 22.79 కోట్లుగా ఉన్నాయి. అయితే, 23 రోజుల్లో చూసుకుంటే హిందీ కంటే తెలుగు వెర్షన్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ, ఒక్క 23వ రోజు కలెక్షన్స్ చూస్తే తెలుగు కంటే హిందీ వెర్షన్‌కే (రూ. 1.55 కోట్లు) ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
ఇక కేవలం తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీలో 23వ రోజున కల్కి 2898 ఏడీ సినిమాకు రూ. 50 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. అలా ఇక్కడ 23 రోజుల్లో రూ. 178.60 కోట్ల షేర్, రూ. 279.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. కాగా వరల్డ్ వైడ్‌గా కల్కి సినిమాకు 23 డేస్‌లో రూ. 509.95 కోట్ల షేర్, రూ. 997.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పలు ట్రేడ్ వర్గాల సంస్థలు చెబుతున్నాయి. కానీ, కల్కి వెయ్యి కోట్ల గ్రాస్ ఎప్పుడో దాటేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
కల్కి 2898 ఏడీ ప్రాఫిట్స్
ఏది ఏమైనా రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసి ఇప్పటివరకు రూ. 137.95 కోట్ల లాభాలు అర్జించింది కల్కి మూవీ.
టాపిక్