Kalki 2898 AD Box Office: కాస్తా తగ్గిన కల్కి 2898 ఏడీ కలెక్షన్స్.. కానీ, నార్త్ అమెరికాలో ఆ రికార్డ్!
Kalki 2898 AD 22 Days Worldwide Collection: ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ చిత్రం 22వ రోజు మరో మైలురాయిని అందుకుంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో కల్కి సినిమాకు 22 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే..
Kalki 2898 AD Box Office Collection: ప్రభాస్ నటించిన మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా కల్కి 2898 ఏడీకి 22వ రోజు కూడా వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే, 21 రోజుతో పోల్చుకుంటే 22వ రోజున కల్కి కలెక్షన్స్ సుమారు రూ. 5 కోట్ల వరకు తగ్గాయి. ఇండియాలో కల్కికి 21వ రోజు రూ. 7.2 కోట్లు కలెక్షన్స్ వస్తే.. 22వ రోజున రూ. 2.75 కోట్లు మాత్రమే వచ్చాయి.
భారత్‌లో 22వ రోజు కల్కి 2898 ఏడీకి వచ్చిన రూ. 2.75 నెట్ ఇండియా కలెక్షన్స్‌లో తెలుగు నుంచి రూ. 7 లక్షలు, తమిళం నుంచి లక్ష, హిందీ బెల్ట్ నుంచి రూ. 1.8 కోట్లు, మలయాళం నుంచి రూ. 12 లక్షలుగా ఉన్నాయి. ఇక ఇండియావైడ్‌గా 22 రోజుల్లో కల్కి సుమారు రూ. 600 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టింది.
వాటిలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 271.55 కోట్లు, తమిళం నుంచి 34.05 కోట్లు, హిందీ నుంచి రూ. 265.7 కోట్లు, కర్ణాటక నుంచి రూ. 5.23 కోట్లు, మలయాళం నుంచి 22.67 కోట్లుగా ఉన్నాయి. ఇక ఏపీ తెలంగాణలో కల్కి సినిమాకు రూ. 178.08 కోట్ల షేర్, రూ. 278.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. 22వ రోజున నార్త్ అమెరికాలో కల్కి సినిమా 18 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇదిలా ఉంటే, ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా కల్కి 2898 ఏడీ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు నార్త్ అమెరికాలో 18 మిలియన్ ప్లస్ డాలర్స్ కలెక్ట్ చేసి మరో మైలు రాయిని దాటేసింది. దాంతో నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రెండో భారతీయ సినిమాగా కల్కి అవతరించింది.
కాగా రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినీష్ చేసిన కల్కి 2898 ఏడీ సినిమాకు ఇప్పటివరకు రూ. 135.88 కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో ఇది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా 2024 ప్రథమార్ధంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని బాక్సాఫీస్ కలెక్షన్లు హృతిక్ రోషన్ ఫైటర్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ సంవత్సరంలో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
కల్కి 2898 ఏడీ సినిమా పెద్దగా పోటీ లేకుండా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఒక రెండు వారాల వరకు ఎలాంటి పాన్ ఇండియా సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత జూలై 12 శంకర్ ఇండియన్ 2 సినిమా రిలీజైంది. మొదట్లో ఈ మూవీ కల్కిపై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, దానికి భిన్నంగా భారతీయుడు 2 కంటే మించి కలెక్షన్లను అర్జించింది. కల్కి 2898 ఏడీ మూవీ.