Janhvi Kapoor on Dating: నచ్చిన ప్రతి మగాడినీ పెళ్లి చేసుకోలేం కదా అని అమ్మతో అనేదాన్ని!-janhvi kapoors interesting comments on dating doing viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor On Dating: నచ్చిన ప్రతి మగాడినీ పెళ్లి చేసుకోలేం కదా అని అమ్మతో అనేదాన్ని!

Janhvi Kapoor on Dating: నచ్చిన ప్రతి మగాడినీ పెళ్లి చేసుకోలేం కదా అని అమ్మతో అనేదాన్ని!

HT Telugu Desk HT Telugu
Aug 18, 2022 11:08 AM IST

Janhvi Kapoor on Dating: డేటింగ్‌పై బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. దీనిపై తన పేరెంట్స్‌ బోనీ కపూర్‌, శ్రీదేవి తరచూ ఏమనేవాళ్లో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

<p>జాన్వీ కపూర్</p>
జాన్వీ కపూర్

బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది జాన్వీ కపూర్‌. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌, దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఆ తర్వాత తన అందం, నటనతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది. ఆమె ఈ మధ్యే డేటింగ్ కాన్సెప్ట్‌పై కాఫీ విత్‌ కరణ్‌ షోలో మాట్లాడిన సంగతి తెలుసు కదా. తాజాగా మరో ఇంటర్వ్యూలోనూ ఈ డేటింగ్‌ విషయంలో తన పేరెంట్స్‌ ఎలా ఆందోళన వ్యక్తం చేసేవారో చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నానని, సినిమాలపై దృష్టి సారించినట్లు చెప్పింది. ఈ మధ్యే ఆమె నటించిన గుడ్‌లక్ జెర్రీ మూవీ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఆమె తన నెక్ట్స్‌ మూవీ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహిలో రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి నటిస్తోంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేటింగ్‌ కాన్సెప్ట్‌పై జాన్వీ మాట్లాడింది.

"డేటింగ్‌ ఎప్పుడూ సమస్యగానే ఉండేది. నాకు ఎందుకో తెలియదు కానీ.. ఈ డేటింగ్‌ విషయంలో మామ్‌, డాడ్‌ ఎప్పుడూ కాస్త డ్రామాటిక్‌గానే ఉండేవారు. ఒకవేళ నీకెవరైనా అబ్బాయి నచ్చితే మా దగ్గరకు రా.. మేము పెళ్లి చేస్తాం అనేవాళ్లు. నాకు మాత్రం నచ్చిన ప్రతి మగాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అనిపించేది. మేము చిల్‌ చేసుకున్నా చాలు అనేదాన్ని. అమ్మ మాత్రం చిల్‌ అంటే ఏంటి అని అడిగేది. చిల్‌ కాన్సెప్ట్‌ను వాళ్లు అర్థం చేసుకునేవారు కాదు" అని జాన్వీ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతానికి తాను మాత్రం సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నా.. అప్పుడప్పుడూ లోన్లీగా అనిపిస్తుందని చెప్పింది. ఈ మధ్య కాలంలో ఆత్మీయత అనేది ఈజీగా దొరికేస్తుందని, ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటోందని ఆమె అనడం విశేషం. అందుకే ఇలా ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలంటేనే భయమేస్తోందని కూడా చెప్పింది. 2018 ధడక్‌ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కొన్నాళ్ల పాటు ఆ మూవీ హీరో ఇషాన్‌ ఖట్టర్‌తో డేటింగ్‌ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం