జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో
ముంబై: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
<p>జాన్వీ కపూర్</p> (HT_PRINT)
జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ మూవీ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుండి జాన్వి లుక్ బయటకొచ్చినప్పుడు సినిమాపై ఆసక్తిని పెంచింది. జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం నేరుగా OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
గుడ్ లక్ జెర్రీ చిత్రానికి సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించగా, ఆనంద్ ఎల్ రాయ్, సుభాష్కరన్ అలీరాజా ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రంలో జాన్వీతో పాటు దిబక్ డోబ్రియాల్, మీటా వశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గుడ్ లక్ జెర్రీ ఒక కామెడీ క్రైమ్ చిత్రం. ఈ చిత్రం 2018లో విడుదలైన తమిళ కొలమావు కోకిల చిత్రానికి హిందీ రీమేక్. ఆ చిత్రంలో నయనతార ప్రధాన పాత్ర పోషించింది.