Sudheer Babu: సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్.. హరోం హర నుంచి కొత్త సాంగ్ రిలీజ్-harom hara murugadi maaya song released on sudheer babu birthday special ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sudheer Babu: సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్.. హరోం హర నుంచి కొత్త సాంగ్ రిలీజ్

Sudheer Babu: సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్.. హరోం హర నుంచి కొత్త సాంగ్ రిలీజ్

Sanjiv Kumar HT Telugu
May 12, 2024 11:53 AM IST

Sudheer Babu Harom Hara Murugadi Maaya Song: సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరోం హర నుంచి కొత్త పాట మురుగడి మాయను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్.. హరోం హర నుంచి కొత్త సాంగ్ రిలీజ్
సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్.. హరోం హర నుంచి కొత్త సాంగ్ రిలీజ్

Sudheer Babu Harom Hara: హీరో సుధీర్ బాబుకు (Sudheer Babu Birthday Special) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర' మేకర్స్ మురుగడి మాయ (Murugadi Maaya Song) అనే కొత్త పాటను విడుదల చేశారు. టైటిల్ సూచించినట్లుగా, ప్రపంచంలో జరిగే ప్రతిచర్యకు కారణమైన మురుగన్ శక్తిని ఈ పాట నిర్వచిస్తుంది.

చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ మెస్మరైజింగ్ నెంబర్ సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపుతుంది. రఘు కుంచె ఆ పాటను అద్భుతంగా పాడారు. భరద్వాజ పాత్రుడు కుప్పం యాసలో ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. మొత్తం మీద ఈ మురుగడి మాయ అద్భుతమైన కంపోజిషన్, అర్థవంతమైన సాహిత్యం, ఆకట్టుకునే వోకల్స్‌తో ఇన్‌స్టాంట్ హిట్ అయ్యింది.

పాటలో సుధీర్ బాబు, సునీల్ బాండింగ్ మరింత ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది. కాగా ఎస్‌ఎస్‌సీ (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో మాళవిక శర్మ (Malavika Sharma) హీరోయిన్‌గా సుధీర్ బాబుకు జోడీగా నటిస్తోంది.

అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రవితేజ గిరిజాల అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna Birth Anniversary) జయంతి సందర్భంగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో కమెడియన్, యాక్టర్, హీరో సునీల్ (Sunil) కీలక పాత్ర పోషించనున్నాడు.

ఇదిలా ఉంటే, హిట్స్ ప్లాప్స్ అని తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సుధీర్ బాబు. గతేదాడి మామా మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఈ హీరో. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో త్రిపాత్రాభినయం చేసి అలరించాడు సుధీర్ బాబు. ఈ సినిమాకు నటుడు హర్ష వర్ధన్ దర్శకత్వం వహించారు.

ఏ మాయ చేశావే (Ye Maaya Chesave Movie) సినిమాలో గెస్ట్ అప్పిరీయన్స్ ఇచ్చిన సుధీర్ బాబు శివ మనసులో శృతి (ఎస్ఎమ్‌ఎస్) సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. కామెడీ హారర్ మూవీ ప్రేమకథా (Prema Katha Chitram) చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. అనేకరకమైన ప్రయోగాత్మక చిత్రాలు చేసిన సుధీర్ బాబు హిందీలో భాగీ (Baaghi Movie) సినిమాతో విలన్‌గా సైతం ఆకట్టుకున్నాడు.

భాగీ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ వర్షం (Varsham Movie) సినిమాకు హిందీ రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో హీరోగా టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటిస్తే హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) చేసింది. ప్రభాస్ (Prabhas) సాహో (Saaho Movie) సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్.

IPL_Entry_Point