HanuMan Telugu TV Premiere: హనుమాన్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే-hanuman telugu tv premiere date time teja sajja prasanth varma super hero movie to telecast on zee telugu on april 28 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Telugu Tv Premiere: హనుమాన్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

HanuMan Telugu TV Premiere: హనుమాన్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 17, 2024 02:50 PM IST

HanuMan Movie Telugu TV Premiere: సూపర్ హిట్ హనుమాన్ సినిమా టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు రెడీ అయింది. ఈ మూవీ టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలు బయటికి వచ్చాయి.

HanuMan Telugu TV Premiere: హనుమాన్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే
HanuMan Telugu TV Premiere: హనుమాన్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

HanuMan Telugu TV Premiere: సూపర్ హీరో మూవీ హనుమాన్ భారీస్థాయిలో హిట్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. ఈ మైథలాజికల్ సూపర్ హీరో చిత్రం తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకొని అద్భుత విజయం సాధించింది. ఓటీటీల్లోనూ ఈ మూవీ రికార్డులను తిరగరాసింది. అయితే, హనుమాన్ సినిమా తెలుగులో టీవీలో ప్రసారయ్యేందుకు రెడీ అయింది. ఈ మూవీ టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి.

టెలికాస్ట్ డేట్, టైమ్

హనుమాన్ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు నేడు అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా త్వరలో అంటూ చెబుతూ వస్తున్న ఆ ఛానెల్ ఇప్పుడు తేదీ, టైమ్‍ను వెల్లడించింది.

“క్యాలెండర్లలో డేట్ లాక్ చేసి పెట్టుకోండి. ఎపిక్ మూవీ హనుమాన్ వచ్చేస్తోంది. జీ తెలుగులో ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్” అని జీ తెలుగు నేడు ట్వీట్ చేసింది.

హనుమాన్ సినిమా హిందీ వెర్షన్.. కలర్స్ సినీ ప్లెక్స్‌ ఛానెల్‍లో మార్చి 16నే ప్రసారం అయింది. జీ తెలుగులో ఏప్రిల్ 28న తెలుగులో టెలికాస్ట్ కానుంది.

మూడు ఓటీటీల్లో..

హనుమాన్ చిత్రం ఏకంగా మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. హనుమాన్ సినిమా ఒరిజినల్ తెలుగులో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ జియో సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ చిత్ర తమిళం, మలయాళం, కన్నడ భాషల వెర్షన్లు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి.

టీఆర్పీతోనూ దుమ్మురేపుతుందా!

హనుమాన్ చిత్రం థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఓటీటీల్లోనూ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. జీ5 ఓటీటీలో హనుమాన్ తెలుగు వెర్షన్ రికార్డులు సృష్టించింది. చాలా వారాలుగా నేషనల్ వైడ్‍లో ట్రెండ్ అవుతూనే ఉంది. జియో సినిమాలోనూ ఈ మూవీ ట్రెండింగ్‍లో ఉంది. తెలుగులో ఏప్రిల్ 28న ఈ మూవీ జీ తెలుగు ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. దీంతో ఈ చిత్రం టీవీల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఈ చిత్రానికి భారీగా టీఆర్పీ రేటింగ్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

హనుమాన్ కలెక్షన్లు

హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.330 కోట్ల కలెక్షన్లను సాధించింది. రూ.40 కోట్లతో రూపొందిన ఈ మూవీ.. భారీగా వసూళ్లను రాబట్టుకుంది.

హనుమాన్ చిత్రంలో తేజ సజ్జాతో పాటు అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‍కుమార్, సముద్రఖని, వెన్నెల కిశోర్, రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. హనుమంతుడి స్ఫూర్తితో ఈ సూపర్ హీరో చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా.. నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి గౌరహరి, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.

హనుమాన్ చిత్రానికి సీక్వెల్‍గా జై హనుమాన్ మూవీ రానుంది. ఈ మూవీ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. 2025లో ఈ సినిమాను తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.