Hanuman Day 25 Collection: 300 కోట్లకుపైగా కొల్లగొట్టిన హనుమాన్ మూవీ.. లాభాలు ఎంతంటే?
Hanuman 25 Days Collection: తెలుగులో తొలిసారిగా సూపర్ హీరో మూవీగా వచ్చిన హనుమాన్ సినిమా ఇప్పటికీ థియేటర్లలో అదరగొడుతోంది. హనుమాన్ మూవీకి 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వచ్చినట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Hanuman Day 25 Worldwide Collection: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాకు బీభత్సమైన స్పందన వచ్చింది.. ఇంకా వస్తూనే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విడుదలైన హనుమాన్ చిత్రంలో హీరోగా చేసిన తేజ సజ్జకు హీరోయిన్‌గా అమృత అయ్యర్ నటించింది. ఇందులో మీనాక్షిగా అమృత అయ్యర్ ఆకట్టుకుంది.
25 రోజులు పూర్తి
తేజ సజ్జ, అమృత అయ్యర్‌తోపాటు వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. హనుమాన్ మూవీలో విలన్ మైఖేల్‌గా వినయ్ రాయ్ చేస్తే.. హీరోకు అక్కగా, అంజమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే హనుమాన్ మూవీ మూవీ తాజాగా 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో నెల పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ మూవీ 25 రోజుల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ బయట పెట్టారు.
హనుమాన్ 25 డేస్ కలెక్షన్స్
హనుమాన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తాజాగా మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్‌మెంట్స్ తన అధికారిక ఎక్స్ (పాత ట్విటర్) అకౌంట్ నుంచి పోస్ట్ చేసింది. "సంక్రాంతి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 25 రోజుల్లో హనుమాన్ అత్యద్భుతంగా 300 కోట్లకుపైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి అన్ని సెంటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది" అని ప్రైమ్ షో ఎంటర్టైన్‌మెంట్స్ రాసుకొచ్చింది.
ఒక్కరోజే అన్ని కోట్లు
ఇదిలా ఉంటే హనుమాన్ మూవీకి 24 రోజుల్లో ఏపీ తెలంగాణంలో రూ. 86.30 కోట్ల షేర్, రూ. 141 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే కర్ణాటకలో రూ. 12.10 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 24.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.65 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటివరకు 24 రోజుల్లో హనుమాన్ రూ. 150.70 కోట్ల షేర్, 281.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 25వ రోజుకు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లుగా మారింది. అంటే ఒక్క రోజే దాదాపుగా రూ. 18 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.
బ్రేక్ ఈవెన్-లాభాలు
హనుమాన్ మూవీకి రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా రూ. 30.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఎప్పుడో కంప్లీట్ చేసిన హనుమాన్ సినిమా ఇప్పటికీ రూ. 126 కోట్లకుపైగా లాభాలు చవిచూసింది. దీంతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా హనుమాన్‌కు వచ్చిన కలెక్షన్స్‌లో రూ. 2.6 కోట్లకుపైగా అయోధ్య రామ మందిరానికి విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యతోపాటు మిగతా ఆలయాలకు కూడా విరాళం ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు.
మరిన్ని సూపర్ హీరో మూవీస్
ఇదిలా ఉంటే హనుమాన్ మూవీ అంజనాద్రి అనే కాల్పనిక గ్రామంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా తెరకెక్కింది. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి సూపర్ హీరో సినిమాలు చేస్తానని ఇప్పటికే ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇందులో భాగంగానే త్వరలో అధీర, జై హనుమాన్ మూవీలు రానున్నాయి.