Varalaxmi Sarathkumar: లైఫ్‌లో అలా మొదటిసారి చేశాను, తప్పలేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్-varalaxmi sarathkumar about police character and smoking in kotabommali ps ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varalaxmi Sarathkumar: లైఫ్‌లో అలా మొదటిసారి చేశాను, తప్పలేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లైఫ్‌లో అలా మొదటిసారి చేశాను, తప్పలేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 19, 2023 11:09 AM IST

Varalaxmi Sarathkumar About Kotabommali PS: నాంది, క్రాక్‌లో జయమ్మగా, వీర సింహారెడ్డిలో బాలకృష్ణకు చెల్లెలిగా అలరించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. కోటబొమ్మాలి పీఎస్ సినిమా కోసం మొదటిసారి ఆ పని చేసినట్లు వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపింది.

కోట బొమ్మాళి పీఎస్ మూవీపై వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్
కోట బొమ్మాళి పీఎస్ మూవీపై వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్ రోల్స్ చేసిన సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈ సినిమాకు 'అర్జున ఫల్గుణ' డైరెక్టర్ తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తెలుగులో మొదటిసారి

"నా కెరీర్‌‌లో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్సే వస్తున్నాయి. తమిళంలో చాలా చేశాను కానీ, తెలుగు ఆడియెన్స్‌కు మాత్రం ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నా. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తుంది. వాటిలో పోలీస్ ఆఫీసర్‌‌గానే కనిపించాలి. అయితే ప్రతి స్క్రిప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నా" అని వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపింది.

ఎలక్షన్ టైమ్‌లో

"నేను కథే హీరోగా భావిస్తా. ఇందులో శ్రీకాంత్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, నేనొక పోలీస్ ఆఫీసర్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది. పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుందనేది ఈ మూవీ కాన్సెప్ట్. క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్ చేసేలా సినిమా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ టైమ్‌లో రావడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించేలా లైన్ కూడా ఉంటుంది" అని వరలక్ష్మి పేర్కొంది.

ఆ సీన్ ఎప్పుడు చేయలేదు

"‘నాయట్టు’కి రీమేక్ అయినా.. దానికి దీనికి చాలా మార్పులు చేశారు. ఇందులో నా క్యారెక్టర్ బాగా పెంచారు. ఈ చిత్రంలో నాకు స్మోకింగ్ చేయడం ఛాలెజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్ చేయలేదు. అందుకే ఛాలెజింగ్‌గా అనిపించింది. క్యారెక్టర్‌‌కి ఆ సీన్ కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది. యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ గురించి చూపించాం కానీ.. ఏ పార్టీకి సంబంధం ఉండదు" అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.

వరలక్ష్మి సినిమాలు

"లింగిడి లింగిడి పాటకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు తేజ మార్ని చాలా క్వాలిటీగా తీశారు. మంచి క్యారెక్టర్స్ చేయడమే నా గోల్. వరలక్ష్మీ చాలా డిఫరెంట్‌గా చేసిందని ప్రేక్షకులు అనుకోవాలనుకుంటా. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. నేను నటించిన హనుమాన్‌ సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్‌తో కలిసి మ్యాక్స్ చిత్రంలో నటిస్తున్నా. మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్‌మెంట్స్ వస్తాయి" అని వరలక్ష్మి తెలిపింది.

IPL_Entry_Point