Kalvan OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ కల్వన్.. తెలుగులో కూడా..
Kalvan OTT Streaming: కల్వన్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేసింది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించారు. ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
Kalvan OTT: ఓ వైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటూనే.. హీరోగా సినిమాల్లోనూ వరుసగా నటిస్తున్నారు జీవీ ప్రకాశ్ కుమార్. ఆయన హీరోగా చేసిన కల్వన్ సినిమా ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ అడుగుపెట్టింది. పీవీ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా, ఈ కల్వన్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ వివరాలివే
కల్వన్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ నేడు (మే 14) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
థియేటర్లలో రిలీజైన సుమారు 40 రోజులకు కల్వన్ మూవీ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు మరో మూడు భాషల్లోనూ రావటంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
కల్వన్ మూవీలో జీవీ ప్రకాశ్ కుమార్ సరసన లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‍గా నటించారు. భారతీరాజా, ధీన, జ్ఞానసంబంధం, చేరన్ రాజ్, వినోద్ మున్నా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమారే పాటలకు స్వరాలు అందించారు. రేవా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
కల్వన్ చిత్రానికి పీవీ శంకర్ దర్శకత్వం వహించగా.. ఎక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఢిల్లీ బాబు నిర్మించారు. ఓ ఏనుగును బంధించేందుకు నలుగురు ప్రయత్నించడం, అందులో ఒకరు ఓ అమ్మాయితో ప్రేమలో పడడం చుట్టూ కల్వన్ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నా.. కథ, కథనం విషయంలో నిరాశపరిచిందనే రెస్పాన్స్ వచ్చింది. మిక్స్డ్ టాక్ రావటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు కూడా దక్కలేదు.
ఇటీవలే డియర్ మూవీ
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన డియర్ సినిమా కూడా ఏప్రిల్ 11నే థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో అతడికి జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించారు. ఈ మూవీ కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవటంతో థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. డియర్ సినిమా ఏప్రిల్ 28వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
డియర్ చిత్రాన్ని డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించారు. గురక మెయిన్ సబ్జెక్ట్‌గా ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రోహిణి, కాళీ వెంకట్, ఇళవరసు, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం కూడా కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి కూడా హీరో జీవీ ప్రకాశ్ కుమారే సంగీతం అందించారు. నట్‍మెగ్ ప్రొడక్షన్స్, రోమియో పిక్చర్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించారు.
జీవీ ప్రకాశ్ కుమార్ విడాకులు
జీవీ ప్రకాశ్ కుమార్ తాజాగా తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్నారు. 11 ఏళ్ల వివాహ బంధానికి తాము ముగింపు పలుకుతున్నామని తాజాగా వారిద్దరూ ప్రకటన చేశారు. ఇద్దరి మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, అందరూ తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ ఓ నోట్‍ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రకాశ్ కుమార్, సైంధవి. మొత్తంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి పెళ్లి బంధానికి 11ఏళ్లకు తెరపడింది.
జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చాలా బిజీగా ఉన్నారు. సుమారు 10 చిత్రాలు ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నాయి. తెలుగులో రాబిన్‍హుడ్, లక్కీ భాస్కర్ చిత్రాలకు మ్యూజిక్ ఇస్తున్నారు.