Guppedantha Manasu July 27th Episode: డీబీఎస్‌టీ కాలేజీలోకి రిషి రీఎంట్రీ - మహేంద్రనే తన తండ్రి అని మను డౌట్
Guppedantha Manasu July 27th Episode: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 27 ఎపిసోడ్‌లో తన కన్న తండ్రి మహేంద్ర అనే అనుమానం మనుకు వస్తుంది. అది నిజమా కాదా అని అనుపమను అడుగుతాడు. ఆమె మాత్రం సమాధానం చెప్పదు.
Guppedantha Manasu July 27th Episode: కాలేజీ ఎండీ సీట్ కోసం రంగాతో శైలేంద్ర డీల్ కుదుర్చుకుంటాడు. తనకు ఎండీ సీట్ ఇప్పిస్తే ఐదు కోట్లు ఇస్తానని రంగాకు ఆఫర్ ఇస్తాడు శైలేంద్ర. అతడి డీల్‌కు రంగా ఒప్పుకుంటాడు. మరోవైపు మహేంద్రను కలవడానికి అనుపమ, మను వస్తారు. ఏంటి దారి తప్పి వచ్చారా అంటూ వారిపై దేవయాని సెటైర్లు వేస్తుంది.
మా ఇంటికి ఎందుకొచ్చారు, ఏం పని మీద వచ్చారు...మీరు కలవాల్సిన వ్యక్తులు ఇక్కడ ఎవరున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మహేంద్రను కలవడానికి వచ్చామని అనుపమ బదులిస్తుంది. మహేంద్ర మిమ్మల్ని కలవడానికి ఇష్టపడటం లేదని, మీరు ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయినప్పటి నుంచి మహేంద్ర చిరాకుగా ఉంటున్నాడని అనుపమతో అంటుంది దేవయాని. మీరు వచ్చిన పని అయిపోయిందని వెళ్లిపొమ్మని అనుపమపై మాటల దాడి మొదలుపెడుతుంది.
మహేంద్ర ఆనందం...
అప్పుడే మహేంద్ర రూమ్ నుంచి బయటకొస్తాడు. అనుపమ, మనులను చూసి సంతోషపడతాడు. మహేంద్ర డల్‌గా కనిపిస్తాడు. మీ నుంచి వెళ్లిపోయినందుకు సారీ అంటూ మహేంద్రకు క్షమాపణలు చెబుతాడు మను. బంధువులే రాబందులులా పొడుచుకుతింటుంటే ఏ సంబంధం లేకపోయినా నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు అంటూ దేవయానికి చురక అంటిస్తాడు మహేంద్ర.
తాము పర్మినెంట్‌గా ఈ సిటీని వదిలేసి వెళ్లిపోతున్నట్లు మహేంద్రతో చెబుతుంది అనుపమ. వెళ్లేముందు ఓ సారి నీతో మాట్లాడి, నిన్ను కలవాలని వచ్చామని అంటుంది. నువ్వు ఇక్కడికి ఓ ప్రశ్నతో వచ్చావు. దానికి సమాధానం లేకుండానే వెళ్లిపోతావా అని మనును అడుగుతాడు మహేంద్ర. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తోందని మను బదులిస్తాడు.
దేవయాని జోక్యం...
తండ్రి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాడో, లేదంటే తండ్రి ఎవరో కన్ఫర్మేషన్ వచ్చిందో అంటూ మధ్యలో దేవయాని జోక్యం చేసుకుంటుంది. నాకు తెలిసింది చెప్పమంటావా అంటూ అనుపమను బ్లాక్‌మెయిల్ చేయబోతుంది దేవయాని. అయితే మీకు తెలిసింది ఇప్పుడే చెప్పండి అంటూ అనుపమ ఎదురుతిరుగుతుంది.
దాంతో తడబడిన దేవయాని నాన్న లేడు..ఇక రాడు అని మీకు చెప్పడానికి అనుపమ ఇబ్బంది పడుతుందని దేవయాని అంటుంది. మను నాన్న లేడని మీకు నేను చెప్పానా అంటూ దేవయానికి క్లాస్ ఇస్తుంది అనుపమ. దాంతో దేవయాని సెలైంట్ అయిపోతుంది.
మహేంద్ర ఆశీర్వాదం...
వెళ్లిపోతూ మహేంద్ర ఆశీర్వాదం తీసుకుంటాడు మను. రిషి దూరమైన సమయంలో లోకం శూన్యంగా మారింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో నువ్వు నాకు కొడుకులా అండగా నిలబడ్డావని మనుకు చెబుతాడు మహేంద్ర. నాకు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు...మీరు మాత్రం నన్ను కన్నబిడ్డలా చూసుకున్నారు.
ప్రతి విషయంలో తండ్రిలా నా వెన్నంటి ఉండి ముందుకు నడిపించారు అంటూ మను కూడా ఎమోషనల్ అవుతాడు. మీరు నాపై చూపించిన ప్రేమ వెల కట్టలేనిది, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని మను అంటాడు.
తండ్రి స్థానంలో మహేంద్ర...
తండ్రి స్థానంలో ఉండి నేను ఒకటి అడుగుతున్నాను చేస్తావా అని మనును అడుగుతాడు మహేంద్ర. అదేమిటని మను అడగ్గా...నువ్వు ఈ సిటీ వదిలిపెట్టి వెళ్లిపోనని నాకు మాటివ్వమని మహేంద్ర అంటాడు. నీకు ఇష్టం లేకపోయినా అమ్మ మాట కాదనలేక నువ్వు వెళ్లిపోతున్నావని నాకు తెలుసునని మనుతో చెబుతాడు మహేంద్ర.
మహేంద్ర లోపలికి వెళ్లగానే మీకు ఏ మాత్రం ఆత్మాభిమానం, పౌరుషం ఉన్నా జీవితంలో మళ్లీ మా ఇంట్లో అడుగుపెట్టొద్దని మను, అనుపమలను అవమానిస్తుంది దేవయాని. ఆమె మాటలకు మను కోపం పట్టలేకపోతాడు. కానీ అనుపమ అతడిని వారిస్తుంది.
డీల్ ఫిక్స్...
డీల్ ముగియగానే రంగాను తన ఇంటికి తీసుకెళ్లాలని శైలేంద్ర ఫిక్సవుతాడు. ఇప్పుడే వెళ్దామని తొందరపెడతాడు. ఇంటికి వెళ్లి ఓ సారి నానమ్మకు చెప్పి వస్తానని రంగా చెప్పిన శైలేంద్ర అందుకు ఒప్పుకోడు. శైలేంద్ర దగ్గర తీసుకున్న డబ్బును బుజ్జికి ఇచ్చి నానమ్మను హాస్సిటల్‌లో చూపించమని అంటాడు. ఆ తర్వాత బుజ్జికి రింగ్ ఇచ్చి ఇది వసుధారకు ఇవ్వమని అంటాడు. తాను, శైలేంద్ర కలిసి దిగిన ఫొటో చూపిస్తే వసుధారకు ఏం చేయాలో క్లారిటీ వస్తుందని అంటాడు.
శైలేంద్ర ఆనందం...
తన ప్లాన్ సక్సెస్ కావడంతో శైలేంద్ర ఆనందపడతాడు. రంగాను తీసుకొని సిటీకి వస్తున్నట్లు తల్లి దేవయానికి చెబుతాడు. రిషి అయితే డబ్బుకు లొంగిపోయేవాడు కాదని,రంగా కాబట్టే డబ్బు తీసుకొని మన డీల్‌కు ఒప్పుకున్నాడని శైలేంద్ర అంటాడు. రంగా...రిషి కాదని మహేంద్ర గుర్తుపట్టే అవకాశం ఉందని దేవయాని అనుమానపడుతుంది. అలా గుర్తుపట్టకుండా రంగాకు ట్రైనింగ్ ఇస్తానని శైలేంద్ర చెబుతాడు. రేపటి నుంచే రంగా రంగంలోకి దిగుతున్నాడని అంటాడు.
కన్న తండ్రి మహేంద్రనేనా...
మహేంద్రకు ఇచ్చిన మాట గురించి మను దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. నా కన్న తండ్రి మహేంద్రనేనా అని అనుపమను మను అడుగుతాడు. అనుపమ సమాధానం చెప్పకుండా తడబడిపోతుంది. నీకు ఎందుకు అలా అనిపించింది మనును ఎదురు ప్రశ్నిస్తుంది అనుపమ.
మహేంద్రను మొదటిసారి కలిసినప్పటి నుంచి ఏదో తెలియని ఎఫెక్షన్ఏర్పడిందని మను అంటాడు. నా మనసుకు బాగా దగ్గరయ్యాడు నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయత కురిపించాడు అంటూ మహేంద్రతో తనకు ఏర్పడిన అనుబంధం గురించి మను వివరిస్తాడు.
సమాధానం చెప్పని అనుపమ...
కొడుకు కోసం తండ్రి ఏం చేస్తాడో నా కోసం మహేంద్ర అవన్నీ చేస్తున్నాడని అనుపమతో అంటాడు మను. నేను మహేంద్రను తండ్రి ఎంతగా ఫీలయ్యానో...మహేంద్ర కూడా నన్ను కొడుకులానే భావిస్తున్నాడని మను అంటాడు. మహేంద్ర నిజంగా నా తండ్రి అవునో కాదో చెప్పాలని మను పట్టుపడతాడు. అనుపమ సమాధానం చెప్పకుండా సైలెంట్ అవుతుంది.
అసలు నువ్వు నా అమ్మవేనా కనీసం ఇదైనా చెప్పమని అనుపమను నిలదీస్తాడు మను. నిజంగా నువ్వు నా తల్లివి అయితే ఏదో ఒక రోజు నువ్వు నా బాధను అర్థం చేసుకునేదానివి, నీ కడుపు తీపి కదిలించేది అని మను ఎమోషనల్ అవుతాడు. అమ్మ గురించి పూర్తిగా అర్థం చేసుకున్న రోజు ఈ ప్రశ్న అడుగు అని మనుకు సమాధానం చెప్పకుండా అనుపమ వెళ్లిపోతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.