Maa Vaaru Mastaru July 1st Episode: విద్య ద‌గ్గ‌ర నోరుజారిన గ‌ణ‌ప‌తి - శ్రీనిధిని బ్లాక్‌మెయిల్ చేసిన సుబ్బు-maa vaaru mastaru july 1st episode maa vaaru mastaru today episode subbu blackmials to srinidhi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maa Vaaru Mastaru July 1st Episode: విద్య ద‌గ్గ‌ర నోరుజారిన గ‌ణ‌ప‌తి - శ్రీనిధిని బ్లాక్‌మెయిల్ చేసిన సుబ్బు

Maa Vaaru Mastaru July 1st Episode: విద్య ద‌గ్గ‌ర నోరుజారిన గ‌ణ‌ప‌తి - శ్రీనిధిని బ్లాక్‌మెయిల్ చేసిన సుబ్బు

HT Telugu Desk HT Telugu
Jul 01, 2023 01:44 PM IST

Maa Vaaru Mastaru July 1st Episode: గ‌ణ‌ప‌తితోనే విద్య పెళ్లిని జ‌రిపించాల‌ని పార్వ‌తి ప్ర‌య‌త్నిస్తుంది. కానీ ఆమెను ఆదినారాయ‌ణ కుటుంబ‌స‌భ్యులు అవ‌మానిస్తారు. ఆ త‌ర్వాత నేటి మావారు మాస్టారు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

మావారు మాస్టారు సీరియ‌ల్‌
మావారు మాస్టారు సీరియ‌ల్‌

Maa Vaaru Mastaru July 1st Episode: గణపతి, విద్య ప్రేమను గెలిపించి వారిద్దరినీ పెళ్లి బంధంతో ఒకటి చేయాలని పార్వతి ఆరాటపడుతుంది. ఆదినారాయణ ఇంటికి వెళ్లి మనసులు కలిసిన వారిని పెళ్లితో ఒకటి చేయమని వేడుకుంటుంది. పార్వతిని విద్య కుటుంబం మొత్తం అవమానిస్తారు. కానీ విద్య మాత్రం పార్వతిని చూస్తే తన తల్లిని చూసినట్లే అనిపిస్తుందని ఆదినారాయణతో చెప్పి తనను క్షమించమని కోరుతుంది.

పార్వతిని తన రూమ్​లోకి తీసుకెళ్తుంది. పార్వతి ఒళ్లో పడుకుని పెళ్లంటూ చేసుకుంటే గణపతినే చేసుకోవాలని ఉందంటూ తన మనసులోని మాటను పంచుకుంటుంది విద్య. పార్వతి కూడా అదే నిజం కావాలని కోరుకుంటుంది. వారిద్దరి మధ్య బంధాన్ని కిటికీలో నుంచి చూసి ఆలోచనలో పడతాడు ఆదినారాయణ. పద్మశ్రీ విద్య గురించి చెడుగా చెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోడు.

సీక్రెట్ మీటింగ్‌...

గణపతి, విద్య రహస్యంగా కలుసుకుంటారు. అయితే మాటల్లో పడి విద్య చూపే అభిమానం పొందడానికి నిజంగా మాస్టారునైతే బాగుండు అంటూ నోరు జారతాడు గణపతి. విద్య ఆశ్చర్యపోతుంది.

తన పొరపాటు గమనించిన గణపతి సర్దిచెబుతాడు. ప్రతి మాటలోనూ విద్య గణపతి మాస్టారు అంటూ తన విషయంలో చూపించే ప్రేమ, శ్రద్ధకు ఇబ్బందిగా ఫీలవుతాడు గణపతి. తమ పెళ్లి జరిగితే బాగుండని ఇద్ద‌రు మనసారా కోరుకుంటారు.

సుబ్బు బ్లాక్ బెయిల్‌...

విద్య చెల్లెలు శ్రీనిధి తను ప్రేమించిన అతడిని కలవడం చాటుగా చూస్తాడు సుబ్బు. వాళ్లు మాట్లాడుకున్నదంతా వీడియో తీసి శ్రీనిధిని బెదిరించి డబ్బులుతీసుకుంటాడు.

ఐదు లక్షలు కావాలని డిమాండ్​ చేస్తాడు. ఏం చేయాలో తోచని శ్రీనిధి తండ్రికి తన ప్రేమ విషయం తెలిస్తే గొడవ జరుగుతుందని కంగారుపడుతుంది. సుబ్బు మాత్రం ఏమాత్రం గిల్ట్​ లేకుండా అందరినీ సాధిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఏం చేసైనా ఆదినారాయణను తన కాళ్లపై పడేలా చేయాలని ఆలోచిస్తుంటాడు.

శంకరం మాస్టారు ప్ర‌తిజ్ఞ‌...

శ్రీశైలాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన సరోజ చుట్టుపక్కల వారికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంది. శ్రీశైలం సరోజను ప్రేమించినప్పటికీ శంకరం మాస్టారు చనిపోవడంతో ఆ కుటుంబ బాధ్యతను తీసుకుంటాడు. గణపతికి పెళ్లి చేసేవరకు తాను పెళ్లి చేసుకోనని నిర్ణయించుకుంటాడు.

పెళ్లి కోసం పూజ‌లు...

గణపతి పెళ్లికోసం గుళ్లో అంగ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకుంటుంది పార్వతి. విద్యకు విషయం తెలిసి కంగారు పడుతుంది. పార్వతి గుండె సమస్యతో బాధపడుతుండటంతో అంగ ప్రదిక్షణ చేయడం ఆమె ఆరోగ్యానికి మంచిది కాదని బాధపడుతుంది. కానీ విద్య ఎంత నచ్చజెప్పాలని చూసినా పార్వతి వినదు. త‌న కొడుకు పెళ్లి మాత్ర‌మే ముఖ్య‌మ‌ని అంటుంది. అక్క‌డితో నేటి మావారు మాస్టారు సీరియ‌ల్ ముగిసింది.