Guppedantha Manasu Serial: రౌడీలకు దొరికిన వసుధార - రంగా గురించి శైలేంద్ర ఎంక్వైరీ - దేవయాని కన్నింగ్ ప్లాన్
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూలై 22 ఎపిసోడ్‌లో రిషినే రంగాగా పల్లెటూరిలో ఉంటున్నాడని దేవయాని అనుమానపడుతుంది. అతడు రంగానో, రిషినో తెలుసుకునే బాధ్యతను కొడుకు శైలేంద్రకు అప్పగిస్తుంది. రంగా కోసం ఎంక్వైరీ చేస్తూ ఊళ్లో అడుగుపెట్టిన శైలేంద్రకు వసుధార కనిపిస్తుంది.
Guppedantha Manasu Serial: సరోజ పెళ్లిచూపుల నుంచి వసుధారతో కలిసి ఇంటికి బయలుదేరుతాడు రంగా. తనకు టీ తాగాలని ఉందని ఓ చోట ఆటో ఆపిస్తుంది వసుధార. టీస్టాల్‌కు ఇద్దరు వెళతారు. వసుధార కోసం స్పెషల్‌గా టీ ఎలా చేయాలో టీమాస్టర్‌కు వివరిస్తాడు రంగా. నీకు చేయరాదంటే మేడమ్ టీ పెట్టుకుంటారని టీమాస్టర్‌తో రంగా అంటాడు.

రంగా కాదు రిషినే...
రంగా మాటలు చూసి మీరు రిషినే కానీ రంగా అని అబద్ధమాడుతున్నారని వసుధార అంటుంది. నేను టీ ఎలా పెడతానో కేవలం రిషికి మాత్రమే తెలుసు. అదే ప్రాసెస్ మీరు టీమాస్టర్‌తో చెప్పారని వసుధార చెబుతుంది. టీ ఎవరైనా ఇదే ప్రాసెస్‌లో తయారుచేస్తారని, అంత మాత్రానికే నన్ను రిషితో పోల్చడం బాగాలేదని వసుధారకు బదులిస్తాడు రంగా.
మీరు పదే పదే నన్ను రిషి అనడం ఇబ్బందిగా ఉందని, మీ ముందు మాట్లాడాలంటే భయమేస్తుందని రంగా అంటాడు. నిజం ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారా అని వసుధార ఆన్సర్ ఇస్తుంది. దాంతో రంగా సైలెంట్ అవుతాడు.
శైలేంద్ర, దేవయాని కన్ఫ్యూజన్...
సరోజ పెళ్లి చూపుల్లో తాము చూసింది రంగానో, రిషినో తెలియక దేవయాని, శైలేంద్ర కన్ఫ్యూజ్ అవుతారు. రంగాను చూడగానే ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ వచ్చిందని దేవయాని అంటుంది. తాను కూడా భయంతో వణికిపోయానని శైలేంద్ర తల్లితో చెబుతాడు. కానీ వాడు రిషి కాదు రంగా అని తెలిసిన తర్వాతే భయం నుంచి తేరుకున్నానని అంటాడు.
వాడు రంగా అని గ్యారెంటీ ఏంటి అని కొడుకును అడుగుతుంది దేవయాని. నాకు ఏదో డౌట్‌గా ఉందని అంటుంది. వాడు రిషి కాదు రంగానే అని తల్లితో వాదిస్తాడు శైలేంద్ర. రిషి అయితే మనతో పరిచయం లేనట్లుగా ఎందుకు ప్రవర్తిస్తాడని శైలేంద్ర అంటాడు. నాపై ద్వేషం ఉన్నా నీపై మాత్రం రిషికి ప్రేమ ఉందిగా...నీతో మాట్లాడేవాడు కదా అని శైలేంద్ర చెబుతాడు.
దేవయాని ప్లాన్....
శైలేంద్ర ఎంత చెప్పిన దేవయాని కన్వీన్స్ కాలేకపోతుంది. వాడు ఖచ్చితంగా రిషినే అని నా మనసు చెబుతుంది అని అంటుంది. రంగా పోలికలతోఉన్నది రిషినో కాదో ఇదే ఊళ్లో ఉండి తెలుసుకోమని శైలేంద్రకు టాస్క్ ఇస్తుంది. నువ్వు అన్నట్లు నిజంగానే రంగా అయితే వాడి వల్ల మనకు చాలా మేలు జరుగుతుందని కొత్త ప్లాన్ వేస్తుంది దేవయాని. మన కల నెరవేడానికి రంగాను ఓ పావుగా ఉపయోగించుకుందామని అంటుంది. అది ఎలా అన్నది తర్వాత చెబుతానని కొడుకుతో చెబుతుంది.
ధన్‌రాజ్ అనుమానం.
సొంత తెలివితేటలు కాకుండా నేను చెప్పినట్లు చేయమని కొడుకుకు క్లాస్ పీకుతుంది. తనను కారులోనే కూర్చొబెట్టి దేవయాని, శైలేంద్ర చాలా సేపు నుంచి మాట్లాడుకోవడం చూసి ధన్‌రాజ్ అనుమాన పడతాడు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారని సందేహంగా అడుగుతాడు. నీ పెళ్లి గురించేననిఇద్దరు అబద్ధం చెబుతారు. సరోజకు నువ్వంటే ఇష్టం లేదని, ఆమెను బావ నుంచి దూరం చేసి నీకు దగ్గర చేయడానికి తాను కొన్నాళ్లు ఈ ఊరిలోనే ఉండబోతున్నట్లు ధన్‌రాజ్‌తో అంటాడు శైలేంద్ర.ధన్‌రాజ్ సరే అంటాడు.
రిషి గురించి ఎంక్వైరీ...
రంగా గురించి ఎంక్వైరీ చేయడానికి ఊళ్లోకి వస్తాడు శైలేంద్ర. రిషి ఫోటో చూపించి అతడు తెలుసా అని ఓ వ్యక్తిని అడుగుతాడు. సూటు, బూటు వేసుకొని మా రంగాను ఫొటోషాప్‌లో హీరోలా తయారు చేశారని ఆ వ్యక్తి బదులిస్తాడు. నా ఫొటోను కూడా అలా ఎడిట్ చేయమని శైలేంద్రతో అంటాడు. డబ్బులు కూడా ఇస్తానని చెబుతాడు. నానా తంటాలు పడి అతడి నుంచి రంగా అడ్రెస్‌ను కనుక్కుంటాడు శైలేంద్ర.
ఓ వైపు శైలేంద్ర...మరోవైపు రౌడీలు...
రంగాను వెతుక్కుంటూ శైలేంద్ర వస్తాడు. మరోవైపు వసుధారను వెతుక్కుంటూ రౌడీలు కూడా అదే ఊళ్లో తిరుగుతుంటారు. వసుధార చనిపోలేదు అనే నిజం శైలేంద్రకు తెలిసేలోపు ఆమెను ఎలాగైనా అంతం చేయాలని అనుకుంటారు.
తనో ఆటోకు కిరాయి రావడంతో వసుధారను టీస్టాల్ దగ్గరే వదిలిపెట్టి రంగా వెళ్లిపోతాడు. . టీస్టాల్ దగ్గర ఉన్న వసుధారను ఒకేసారి రౌడీలతో పాటు శైలేంద్ర చూస్తాడు. వసుధార బతికే ఉందని తెలియగానే శైలేంద్ర షాకవుతాడు. రౌడీలను చూసి వసుధార పారిపోతుంది. ఆమె వెంట రౌడీలు పడతారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.