Guppedantha Manasu August 17th Episode: మహేంద్రపై మను రివేంజ్ - భోరున ఏడ్చిన శైలేంద్ర - దేవయానికి పనిష్‌మెంట్
Guppedantha Manasu August 17th Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 17 ఎపిసోడ్‌లో ఎండీ సీట్ చేజారిపోవడంతో శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒక్క పని కూడా చేయడం చేతకాదంటూ కొడుకు క్లాస్ ఇస్తుంది దేవయాని. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలంటూ తన చెంపలు తానే వాయించుకుంటుంది.
Guppedantha Manasu August 17th Episode: తన తండ్రి మహేంద్రనే అని నిజం తెలిసి కోపంతో రగిలిపోతాడు మను. ఈ నిజం తెలిసి కూడా మహేంద్ర, వసుధార ఇన్నాళ్లు తనను మభ్య పెట్టారని కోప్పడుతాడు. మహేంద్రపై తనపై చూపించిన తండ్రి ప్రేమ మొత్తం నిజాన్ని దాచిపెట్టడానికి ఆడిన నాటకమని ఆవేశంతో ఊగిపోతాడు. చివరకు కన్నతల్లి కూడా తనను మోసం చేసిందని కోప్పడతాడు. వాళ్లదారిలోనే వెళ్లి అందరిని దెబ్బకొట్టాలని అనుకుంటాడు. తనకు నిజం తెలుసు అన్న సంగతి బయటపెట్టకూడదని, తాను బయటపడకూడదని నిర్ణయించుకుంటాడుమను.
రిషి సీరియస్...
బోర్డ్ మీటింగ్ ముగించుకొని ఇంటికి బయలుదేరుతారు రిషి, వసుధార. రిషి చాలా సీరియల్‌గా ఉంటాడు. వసుధారతో ఏం మాట్లాడడు. పతనమవుతోన్న కాలేజీని నిలబెట్టడానికే మమ్మిల్ని హఠాత్తుగా ఎండీగా ప్రకటించాల్సివచ్చిందని వసుధార సర్ధిచెబుతుంది. తనపై కోపాన్ని వీడమని అంటుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయమని వసుధారకు బదులిస్తాడు రిషి.
సరోజ అడ్డు...
రిషి, వసుధార కారుకు అడ్డగిస్తుంది సరోజ. రిషి కారు దిగగానే ఇప్పుడే ఊరు వెళదామని అతడి చేయి పట్టుకుంటుంది సరోజ. రిషి మాత్రం రానని అంటాడు. తాను ఇక్కడ చేయాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయని సరోజకు బదులిస్తాడు.
ఈ దిక్కుమాలిన ఊళ్లో నీకు ఏం పనులు ఉన్నాయని రిషితో వాదనకు దిగుతుంది సరోజ. అన్ని తర్వాత చెబుతాను కానీ..నిన్ను ఎవరు రమ్మన్నారు హైదరాబాద్‌కు అని సరోజను అడుగుతాడు రిషి. నీకోసం హైదరాబాద్ వచ్చానని సరోజ బదులిస్తుంది. మరి నా కోసం అన్నావు అని ధన్‌రాజ్ అనుమానంగా అడుగుతాడు.
సరోజకు వార్నింగ్...
నానమ్మ నిన్ను చూడాలని కలవరిస్తుందని, ఆమెను చూడాలని నీకు లేదా...నానమ్మ కంటే నీకు వసుధారతో తిరగడం ఎక్కువైందా అని రిషితో కోపంగా అంటుంది వసుధార. నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగుండదని సరోజకు వార్నింగ్ ఇస్తాడు రిషి. దాంతో వసుధారపై ఫైర్ అవుతుంది సరోజ.
అవనసరంగా గొడవ చేయకు...
మాటలతో రిషి వినకపోవడంతో సరోజ ఎమోషనల్ రూట్‌లోకి వెళ్లి అతడి మనసును కరిగించాలని అనుకుంటుంది. ఎంత చెప్పన రిషి మాత్రం సరోజ వెంట వెళ్లడానికి ఇష్టపడడు. మీ నాన్నే నన్ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి డబ్బుల కోసం ఇక్కడికి పంపించాడని ఏదైనా ఉంటే అతడిని అడగమని సరోజతో అంటాడు రిషి. అవసరంగా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పి చెబుతాడు.
మను డ్రామా...
తండ్రి గురించి తనకు తెలుసునని నిజాన్ని తల్లి దగ్గర దాచిపెడుతూ నాకు రసగుల్లా తినాలని ఉందని అంటాడు మను నైట్ డిన్నర్‌లోకి ఆలూ కర్రీ, అప్పడాలు చేయమని అంటాడు. మహేంద్రకు ఇష్టమైన వంటకాల గురించి మను ప్రస్తావించడం చూపి అనుపమ డౌట్ పడుతుంది. మను ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుందని అనుకుంటుంది. ఇదే విషయం మనునే అడుగుతుంది. కానీ అతడు సమాధానం చెప్పడు.
మహేంద్రకు కూడా ఇవే స్వీట్, కర్రీస్ ఇష్టం కదా అని అనుపమతో అంటాడు రిషి. మా ఇష్టాలు, అభిరుచులు కూడాభలే కలిశాయి అని మను అంటాడు. మహేంద్ర నేనేదో తన కొడుకు అన్నట్లు...ఆయన నా కన్న తండ్రి అయినట్లు ఫీలవుతున్నాడని తల్లితో చెబుతాడు మను. ఆయన ఏమన్నా మనకు బంధువా...మనతో రక్త సంబంధం ఉందా అని అంటూ మను మాట్లాడటంతో అనుపమ షాకవుతుంది.
మను అబద్ధం...
శుభవార్త తెలిసినప్పుడు స్వీట్ తినాలని తల్లికి రసగుల్లా తినిపిస్తాడు మను. ఒలింపిక్స్‌లో ఇండియాకు మెడల్ వచ్చినందుకు అని అబద్ధం ఆడుతుంది. మనుకు పొలమారుతుంది. అతడి తలపై తడుతుంది అనుపమ. నాన్నకు పొలమారినప్పుడు ఇలాగే తట్టేవారా అని అనుపమను అడుగుతాడు మను.
మరోవైపు మహేంద్రకు పొలమారుతుంది. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారని మనును మనసులో పెట్టుకొని వసుధార అంటుంది. మరోవైపు మహేంద్ర కూడా తనకు ఇష్టమైన రసగుల్లా తింటుంటాడు.
రిషి తిరిగి రావడం ఆనందంగా ఉందని, అందుకే స్వీట్ తినాలని అనిపించిందని అంటాడు. మిమ్మల్ని సంతోషపెట్టే నిజం కావచ్చు..మీ గతాన్ని పరిచయం చేసే బంధం ఏదైనా టైమ్ వచ్చినప్పుడు అన్నితెలుస్తాయని మహేంద్రతో వసుధార అంటుంది.
శైలేంద్ర ఏడుపు...
ఎండీ సీట్ చేజారిపోవడంతో శైలేంద్ర తలపట్టుకుంటాడు. ఛీ వెధవ ఎంత పనిచేశావు..ఎన్నో ఎళ్ల కల ఒక్క రోజుల చెడగొట్టావు..నా కడుపున చెడబుట్టావు అని కొడుకు దులిపేస్తుంది దేవయాని. ఒక్క పని సరిగ్గా చేయడం చేయడం చేత కాదంటూ క్లాస్ పీకుతుంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలని అంటూ తన చెంపలు తానే వాయించుకుంటుంది.
ధరణి ఆనందం...
అప్పుడే ధరణి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా బతుకుకు అర్థం లేదని , నా కల, లక్ష్యం అన్ని పోయాయని బోరుగా ఏడుస్తాడు. ఎండీ సీట్ తన చేజారిపోయిందని, రిషి చేపట్టాడని భార్యతో అంటాడు శైలేంద్ర. మా మాట వినగానే ధరణి సంతోషపడుతుంది. ఆమె సంతోషం చూసి శైలేంద్ర బాధ మరింత పెరుగుతుంది. ఇదంతా మను వల్లే జరిగిందని అతడిపై కోప్పడుతాడు శైలేంద్ర. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.