Guppedantha Manasu August 16th Episode: నెరవేరిన వసు కల -శైలేంద్రను ఆటాడుకున్న రిషి -తండ్రి గురించి తెలుసుకున్న మను
Guppedantha Manasu August 16th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 16 ఎపిసోడ్‌లో డీబీఎస్‌టీ కాలేజీ ఎండీగా రిషి బాధ్యతలు చేపడుతాడు. ఆ విషయం తెలిసి శైలేంద్ర షాకవుతాడు. రిషిని ఎలా ఎండీగా ప్రకటిస్తారని గొడవ చేస్తాడు.
Guppedantha Manasu August 16th Episode: రిషిని కాలేజీ ఎండీగా బోర్డ్ మీటింగ్‌లో ప్రకటిస్తుంది వసుధార. తన ఇష్టాలు, అభిప్రాయాలతో పనిలేకుండా ఎండీగా తనను ఎలా ప్రకటిస్తావని వసుధారపై రిషి సీరియస్ అవుతాడు. మరోవైపు శైలేంద్రను మను కిడ్నాప్ చేస్తాడు. బోర్డ్ మీటింగ్‌కు వెళ్లకుండా అడ్డుకుంటాడు. తన తండ్రి ఎవరో చెబితేనే వదిలిపెడతానని శైలేంద్రను బెదిరిస్తాడు మను.
మహేంద్రనే మను తండ్రి అనే నిజం బయటపెడతాడు శైలేంద్ర. కానీ అతడి మాటలను మను నమ్మడు. తప్పించుకోవడానికే ఈ అబద్ధం ఆడుతున్నాడనుకొని గన్ గురిపెడతాడు. తన దగ్గర సాక్ష్యం ఉందని దేవయాని ఫోన్ చేసి వసుధార రాసిన లెటర్‌ను ఫొటో తీసి పంపించమని అడుగుతాడు.
దేవయాని టెన్షన్...
బోర్డ్ మీటింగ్‌లో ఉన్న శైలేంద్రకు లెటర్‌తో ఏం పని పడిందోనని దేవయాని అనుమానపడుతుంది. శైలేంద్ర అసలు బోర్డ్ మీటింగ్‌లో ఉన్నాడా లేదా తెలుసుకునేందుకు భర్తకు ఫోన్ చేస్తుంది. శైలేంద్ర అసలు కాలేజీకి రాలేదని ఫణీంద్ర అనడంతో దేవయాని టెన్షన్ పడుతుంది. తన కొడుకు ఏదో ప్రమాదంలో ఉన్న అనుకొని వెంటనే లెటర్‌ను ఫొటో తీసి శైలేంద్రకు పంపిస్తుంది.
రిషినే ఎండీ...
మరోవైపు వసుధార మాత్రమే కాకుండా ఫణీంద్ర, మహేంద్రతో పాటు మిగిలిన బోర్డ్ మెంబర్స్ కూడా రిషినే ఎండీ కావాలని కోరుకుంటారు. ఈ పరిస్థితుల్లో రిషి మాత్రమే కాలేజీని కాపాడగలడని అనుకుంటాడు. మీరు ఉండగా మరొకరు ఎండీ సీట్‌లో కూర్చుంటే ఆ పదవికి ఉన్న విలువ పోగొట్టినట్లు అవుతుందని రిషితో అంటారు.
కాలేజీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది మీరే అంటూ రిషిపై పొగడ్తలు కురిపిస్తారు. నువ్వు ఎండీ అయితే స్టూడెంట్స్ ఆనందపడతారని మహేంద్ర అంటాడు. ఆ సీట్‌లో నువ్వు కూర్చోవడమే కరెక్ట్ అని చెబుతాడు. అందరూ బతిమిలాడటంతో ఎండీ పదవి చేపట్టడానికి రిషి అంగీకరిస్తాడు.
మను ఆవేశం...
మహేంద్రనే తన తండ్రి అనే నిజాన్ని వసుధార రాసిన లెటర్ ద్వారా తెలుసుకొని మను ఆవేశం పట్టలేకపోతాడు. ఎండీ పదవికి రిజైన్ చేసి వెళ్లేముందు వసుధార రాసిన లెటర్ ఇదని, నీ క్యాబిన్ నుంచి నేనే ఆ లెటర్‌ను దొంగతనం చేశానని మనుతో అంటాడు శైలేంద్ర. మనుకు దేవయాని ఫోన్ చేస్తుంది. శైలేంద్రను నువ్వే కిడ్నాప్ చేవావని నాకు అర్థమైందని అంటుంది. తన కొడుకును వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. మహేంద్రనే నీ తండ్రి అనే విషయం మాకు వసుధార రాసిన లెటర్ చదివిన తర్వాతే అర్థమైందని చెబుతుంది.
మహేంద్రతో తేల్చుకో…
మాకు తెలిసిన విషయం చెప్పామని, నువ్వు తేల్చుకోవాల్సింది మాతో కాదు...మహేంద్రతో...మీ అమ్మతో అంటూ తమపై మనుకు ఉన్న కోపాన్నితెలివిగా వారివైపు డైవర్ట్ చేస్తుంది దేవయాని. మహేంద్ర నిన్ను మోసం చేశాడని కోపం, బాధ ఉంటుందని...కానీ అతడు చేసిన ద్రోహానికి మేము ఏం చేయగలం అంటూ మనును బతిమిలాడుతుంది.
నాకు నిజం తెలిసిపోయిన సంగతి ఎవరికి చెప్పొద్దని, మన ముగ్గురు మధ్యలోనే ఈ రహస్యం ఉండాలని...లేదంటే శైలేంద్రను వదిలిపెట్టనని దేవయానితో మను అంటాడు. తమ అవసరం కోసం మను ఏం చెబితే అదే చేస్తామని శైలేంద్ర, దేవయాని మాటిస్తారు.
ఏండీగానే కలుస్తా…
శైలేంద్ర వెళ్లిపోతుండగా ఈ సారి కూడా నీ ఆశలు ఆవిరేనని మను అంటాడు. కానీ మను మాటల్ని శైలేంద్ర పట్టించుకోడు. ఈ సారి నిన్ను డీబీఎస్‌టీ కాలేజీ ఎండీగానే నిన్ను కలుస్తానంటూ వెళ్లిపోతాడు. ఎండీగా బాధ్యతలను చేపడుతున్నట్లు డాక్యుమెంట్స్‌పై రిషి సంతకాలు పెడతాడు.
శైలేంద్ర ఫైర్...
అప్పుడే శైలేంద్ర బోర్డ్ మీటింగ్ రూమ్ లోపలికి వస్తాడు. కొంచెం ఆలస్యంగా మీటింగ్‌కు వచ్చానని, ఇప్పుడు ఎండీని అనౌన్స్‌చేయమని అంటాడు. రిషిని ఎండీగా వసుధార ప్రకటించిందని కొడుకుకు బదులిస్తాడు ఫణీంద్ర. రిషి ఎండీ అని తెలియగానే శైలేంద్ర షాకవుతాడు. వసుధార ఎండీని ఎలా ప్రకటిస్తుందని, వాడు ఎండీ ఏంటి..అసలు రిషి కాదని చెప్పబోతూ శైలేంద్ర నోరుజారుతాడు.
కొడుకుపై ఫణీంద్ర ఫైర్ అవుతాడు. నోరుజారితే పళ్లు రాలగొడతానని వార్నింగ్ ఇస్తాడు. మళ్లీ మీటింగ్ జరపాల్సిందేనని శైలేంద్ర పట్టుపడతాడు. ఇక నుంచి కాలేజీకి రిషినే ఎండీ...ఇందులో ఎలాంటి మార్పులేదని, ఎక్కువగా మాట్లాడితే బయటకు గెంటేస్తానని కొడుకుకు వార్నింగ్ ఇస్తాడు ఫణీంద్ర. మీటింగ్ పూర్తయిందని ప్రకటిస్తాడు.
రిషి రివర్స్ గేమ్...
ఒరేయ్ రంగా ఎంత పనిచేశావురా అంటూ శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు. నన్నే మోసం చేస్తావా...నీ అంతు చూస్తానంటూ రిషికి వార్నింగ్ ఇవ్వబోతాడు. కానీ రిషినే శైలేంద్రపై రివర్స్ అవుతాడు. శైలేంద్ర కాలర్ పట్టుకొని...ఎక్కడికి వెళ్లారు...నన్ను ఎందుకు ఇరికించారు...ఏదో స్కెచ్ వేసి మీరు మీటింగ్‌కు అటెండ్ కాలేదని శైలేంద్ర కే వార్నింగ్ ఇస్తాడు.
కొంపదీసి నా ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారా? లేదంటే నన్ను ఎండీని చేసి ఏదైన కుట్రలో ఇరికించారని అనుకుంటారా అంటూ శైలేంద్రను నిలదీస్తాడు రిషి. నేను కాలేజీ వరకు మాత్రమే ఆలోచిస్తున్నానని, తాను మాఫియా డాన్ కాదని రిషిని బతిమిలాడుతాడు శైలేంద్ర. నాతో డీల్ చేసే ముందు ఒక్క నెల అన్నారు. ఇప్పుడు కాలేజీ ఎండీని చేశారు..ఇక్కడ ఎన్ని నెలలు ఉండాలి అని శైలేంద్రను అడుగుతాడు రిషి.
వసుధార బెదిరించి…
వసుధార నిన్ను ఎండీగా ప్రకటిస్తే ఎలా ఊరుకున్నావని రిషిని అడుగుతాడు శైలేంద్ర. నాకు ఎండీ పదవి చేపట్టడం ఇష్టం లేదని చెప్పి మీటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చానని, కావాలంటే ఏం జరిగిందో మీ నాన్నను అడిగి తెలుసుకొండి అని శైలేంద్రతో చెబుతాడు రిషి. ఇష్టం లేదని చెప్పిన వినకుండా వసుధార బెదిరించి తనకు ఎండీ పదవి కట్టబెట్టిందని శైలేంద్రను నమ్మిస్తాడు రిషి. తన ప్లాన్ తనకు రివర్స్ చేసి రిషి దెబ్బకొట్టడం శైలేంద్ర జీర్ణించుకోలేకపోతాడు. గ్యాప్ లేకుండా తనను ఉతికి ఆరేయడం ఆపేయమని బతిమిలాడుతాడు. రిషితో వాదించలేక భయపడిపోతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.