Gunde Ninda Gudi Gantalu: దినదిన గండంలా మీనా కాపురం - పూల గంప ట్విస్ట్‌కు బాలు మైండ్‌బ్లాక్ - శీల డార్లింగ్ ఎంట్రీ!
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ప్రోమోలో బాలు చేసిన అవమానం భరించలేక భర్తకు చెప్పకుండా పుట్టింటి నుంచి నుంచి అత్తింటికి వచ్చేస్తుంది మీనా. నన్ను వదిలేసిన ఎలా వస్తావని మీనాపై బాలు ఫైర్ అవుతాడు. నిన్ను కాపురానికి తీసుకురావడమే నేను చేసిన తప్పని అంటాడు.
Gunde Ninda Gudi Gantalu: దీపావళి పండుగను భర్తతో కలిసి పుట్టింట్లో ఆనందంగా జరుపుకోవాలని మీనా కలలు కంటుంది. కానీ మీనాపై ఉన్న ద్వేషంతో అడుగడుగునా సూటిపోటి మాటలతో ఆమె మనసును గాయపరుస్తుంటాడు బాలు. కాపురం బాగుందని తల్లితో తాను ఆడిన అబద్ధం బయటపడొద్దని మీనా చాలా ప్రయత్నిస్తుంది.కానీ అవేవీ ఫలించవు. పార్వతి ముందే మీనాను అవమానిస్తాడు బాలు. తన సొంత కారు అమ్మేయడానికి, అద్దె కారు ఫైనాన్షియర్ తీసుకోవడానికి మీనానే కారణమని అంటాడు.
కాళ్లు పట్టుకుంటే...
అద్దె కారు కోసం ఫైనాన్షియర్ దగ్గరకు వస్తాడు బాలు. కారు కావాలనకుంటే నాకు ముందే ఓ మాట చెబితే బాగుండేదని, నా భార్య ముందు నడిరోడ్డులో అవమానించి కారు లాక్కోవడమేంటని ఫైనాన్షియర్‌తో బాలు గొడవపడతాడు. నా ఆఫీస్‌లో నా మనుషుల ముందే నువ్వు నా కాలర్ పట్టుకున్నదానికి టైమ్ చూసి రివేంజ్ తీర్చుకున్నానని ఫైనాన్షియర్ అంటాడు.
నీకు కారు కావాలంటే నా కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పమని బాలుతో అంటాడు ఫైనాన్షియర్. నీ కాళ్లు పట్టుకునే కర్మ నాకు పట్టలేదని ఫైనాన్షియర్‌కు వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాడు బాలు.
మందేసి బాలు...
ఫైనాన్షియర్‌తో జరిగిన గొడవను మర్చిపోవడానికి ఫుల్‌గా మందేస్తాడు బాలు.ఆ మత్తులో మీనా ఇంటికి బదులుగా మరో ఇంటి తలుపును కొట్టబోతాడు. అది గమనించిన మీనా భర్తను తమ ఇంట్లోకి తీసుకొస్తుంది. తాగిన మత్తులో నాకు అసలు మీ ఇంటికి రావడమే ఇష్టం లేదని మీనా తల్లితో అంటాడు బాలు.
పూలగంప వల్లే తన జీవితం కష్టాల్లో పడిందని అంటాడు. మీనా చేసిన తప్పుల వల్లే కారు అమ్మేయాల్సివచ్చిందని, తండ్రికి గుండెపోటు వచ్చిందని నానా మాటలు అంటాడు. బాలు మాటలతో మీనా ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇరుక్కుపోయిన రోహిణి...
ఓ వైపు వర్ధన్ డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుండటం, మరోవైపు తన తండ్రితో మాట్లాడుతామంటూ ప్రభావతి, మనోజ్ బలవంతం పెట్టడంతో రోహిణి ఇరకాటంలో పడుతుంది. ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సతమతమవుతుంది.
బాలు ఆవేశం...
తాగిన మత్తు మొత్తం దిగిన తర్వాత మీనా గురించి వెతుకుతాడు బాలు. కానీ ఎక్కడ కనిపించదు. మీనా ఎక్కడికి వెళ్లిందని పార్వతిని అడుగుతాడు. మీ ఇంటికి వెళ్లిందని శివ సమాధానమిస్తాడు. తాగింది నేనయితే కిక్కు మీ అక్కకు ఎక్కిందా అంటూ బాలు ఫైర్ అవుతాడు. కోపంలో ఒక మాట అంటే అంత పౌరుషం ఎంటి అని కోప్పడుతాడు. ఆవేశంగా ఇంటికొస్తాడు. మీనా బయటే కనిపించడంతో ఆమెపై ఎగిరిపడతాడు.
దినదిన గండం...
నన్ను మీ ఇంట్లే వదిలేసి నువ్వు ఎలా వస్తావని నిలదీస్తాడు. ఇక్కడ నా బతుకు బంగారంలా ఉందని మా అమ్మకు అబద్ధం చెప్పాను...కానీ దినదిన గండంలా ఉందని అమ్మకు తెలిసిపోయిందని, అందుకే అక్కడ ఉండలేక వచ్చానని మీనా అంటుంది.
అసలు నిన్ను కాపురానికి తీసుకురావడమే నేను చేసిన తప్పు అని మీనాతో వాదనకు దిగుతాడు బాలు. వారి గొడవను బాలు నానమ్మ చూస్తుంది. ఆమెను చూసి బాలు, మీనా షాకవుతారు. ఆ తర్వాత ఏమైందన్నది సోమవారం నాటి గుండెనిండా గుడి గంటలు సీరియల్‌లో చూడాల్సిందే.