తెలుగు న్యూస్ / ఫోటో /
Pushpa 2 The Rule Trailer: ట్రైలర్‌లో ఈ సీన్స్‌ని గమనించారా? యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా డబుల్
Allu Arjun Pushpa 2 trailer: పుష్ప-2 ట్రైలర్ రిలీజైంది. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు యాక్షన్, రొమాన్స్‌తో అల్లు అర్జున్ నెక్ట్స్ లెవల్‌లో కనిపించారు. రష్మిక మంధాన, శ్రీలీల కూడా ఈ ట్రైలర్‌లో మెరిశారు.
(1 / 9)
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ మూవీ ట్రైలర్ ఆదివారం (నవంబరు 17) రిలీజైంది. పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా.. కాదు.. వైల్డ్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ పవర్‌ఫుల్ డైలాగ్ పేల్చారు.(Screenshot/ YouTube Video)
(2 / 9)
పుష్ప-2 మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది. 2021లో పుష్ప-1 రిలీజ్‌అవగా.. ఈ సీక్వెల్‌లో యాక్షన్‌తో పాటు రష్మికతో అల్లు అర్జున్ రొమాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. (Screenshot/ YouTube Video)
(3 / 9)
పుష్ప-1లో సమంత ఐటెం సాంగ్ చేయగా.. పుష్ప-2లో శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. సాంగ్ ఎంత హాట్‌గా ఉంటుందో ట్రైలర్‌లో ఓ మూడు క్లిప్పింగ్స్ రూపంలో చూపించారు. (Screenshot/ YouTube Video)
(4 / 9)
పుష్ప-1 చివర్లో శ్రీవల్లి (రష్మిక మంధాన)ని పుష్ప పెళ్లి చేసుకుంటాడు. దాంతో సీక్వెల్‌లో ఇద్దరి మధ్య పెళ్లి తర్వాత కొన్ని సరదా సన్నివేశాలు పెట్టినట్లు ట్రైలర్‌లో చూపించారు. (Screenshot/ YouTube Video)
(5 / 9)
పుష్ప-1లో తగ్గేదేలే అని అల్లు అర్జున్ తన చేతితో చెప్తూ కనిపించారు. పుష్ప-2లో శ్రీవల్లి పాదంతో ఆ డైలాగ్‌ను చెప్తున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. (Screenshot/ YouTube Video)
(6 / 9)
ఐటెం సాంగ్ కోసం అందాల్ని ఆరబోసిన శ్రీలీల.. రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు వారం రోజుల పాటు ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. (Screenshot/ YouTube Video)
(7 / 9)
పుష్ప-1లో దేశ వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన పుష్ప.. సీక్వెల్‌లో ఇంటర్నేషనల్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ గ్యాంగ్స్‌తో తలపడుతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. (Screenshot/ YouTube Video)
(8 / 9)
పుష్ప-1లో అల్లు అర్జున్, రష్మిక మంధాన మధ్య రొమాన్స్ సీన్స్ చాలా ఉన్నాయి. సీక్వెల్‌లో అంతకుమించి అనేలా ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇద్దరూ చూపించారు. (Screenshot/ YouTube Video)
ఇతర గ్యాలరీలు