Today rasi phalalu: నవంబర్ 18, నేటి రాశి ఫలాలు- నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు-today november 18th monday rasi phalalu in telugu check zodiac wise horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నవంబర్ 18, నేటి రాశి ఫలాలు- నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు

Today rasi phalalu: నవంబర్ 18, నేటి రాశి ఫలాలు- నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు

Ramya Sri Marka HT Telugu
Nov 18, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.11.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

 తేదీ 18.11.2024 సోమవారం నేటి రాశి ఫలాలు
తేదీ 18.11.2024 సోమవారం నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 18-11-2024

వారం: సోమవారం,

తిథి: కృష్ణపక్ష తృతీయ,

నక్షత్రం: మృగశిర,

మాసం: కార్తీకము,

ఆయనము: దక్షిణాయనం,

సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మేషం:

పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అందరి సహకారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమస్యలను సానుకూలంగా మలచుకుంటారు. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృషభం:

ఉద్యోగులకు బదిలీ అవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా లభిస్తుంది. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాల్లో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పనులను వాయిదా వేయవలసి వస్తుంది. కళా, క్రీడారంగాల్లోనివారి అంచనాలు తప్పుతాయి.

మిథునం:

అనుకోని పనులు చేపట్టవలసి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. అవసరానికి తగిన ఆదాయం లభిస్తుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి.

కర్కాటకం:

కొత్త పరిచయాలు కలసివస్తాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పదోన్నతి అవకాశం. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వ్యాపారులకు కలసివస్తుంది. వాహనయోగం. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం:

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు బదిలీ సూచన. వ్యాపార ఒప్పందాలు కలసివస్తాయి. కుటుంబసభ్యుల మధ్య ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. గౌరవమర్యాదలు పెరుగుతాయి. రాజకీయనాయకులకు అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

కన్య:

కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఇంటిపై ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా కలసివస్తుంది. శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. సహోద్యోగుల మధ్య సహకారం పెరుగుతుంది. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.

తుల:

అవకాశాలు కలసివస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఓర్పుతో ఉండాలి. లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. రావలసిన డబ్బు అందుతుంది. నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్త వహించాలి.

వృశ్చికం

ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆలోచించి అడుగు వేయండి. కుటుంబ సభ్యుల సలహాను పరిగణనలోకి తీసుకోండి. అనుకున్న పనులు పూర్తవుతాయి.

ధనుస్సు:

అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. గౌరవం పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం:

చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు కలుగుతాయి. పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అవసరానికి సొమ్ము చేతికందుతుంది. నిరుద్యోగులకు శుభ సమాచారం అందుతుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు కలసివస్తుంది.

కుంభం:

అనుకున్నట్టుగానే పనులు జరుగుతాయి. శుభసమాచారం అందుకుంటారు. వ్యాపార విస్తరణ చేపడతారు. పెట్టుబడులు పెడతారు. నిర్ణయాలు తీసుకునే ముందు తీవ్రంగా ఆలోచించాలి. వాహనయోగం కలుగుతుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది.

మీనం:

ఏకాగ్రతతో పనులు చేయాలి. అశ్రద్ధ పనికిరాదు. మాటతూలవద్దు. అపార్థాలకు చోటివ్వవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. మౌనం ఉత్తమం. శ్రమాధిక్యం. సహనం వహించండి. కొత్త ప్రయోగాలు చేపట్టవద్దు. రాజకీయనాయకులకు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది.

Whats_app_banner