AP Paddy Procurement : వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు, రైతు హాయ్ చెబితే చాలు- వినూత్న పద్ధతికి ఏపీ సర్కార్ శ్రీకారం
AP Paddy Procurement WhatsApp : ధాన్యం కొనుగోలకు ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తుంది. వాట్సాప్ లో Hi అని పెడితే ధాన్యం కొనుగోలో స్లాట్ ను బుక్ చేస్తుంది. ఈ తేదీల్లో రైతుల వద్ద ధాన్యం సులభంగా కొనుగోలు చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు స్లాట్ చాలా సులభంగా బుక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు, రైతు హాయ్ చెబితే చాలు- వినూత్న పద్ధతికి ఏపీ సర్కార్ శ్రీకారం
ధాన్యం కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగిస్తుంది. వాట్సాప్ సేవలను ధాన్యం కొనుగోళ్లలో ఉపయోగిస్తుంది. ఆరుగాలం రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ఎలాంటి శ్రమ అవసరం లేకుండా....సులభమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. 73373 59375 నెంబర్ కు వాట్సాప్ లో Hi పెడితే చాలు...ధాన్యం కొనుగోలు సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైంలో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో వాట్సాప్ లో పౌరసరఫరాల శాఖ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలిపే వీడియోను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు.
వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయం ఎలా?
- రైతులు ముందుగా తమ ఫోన్ లో 73373 59375 ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. అనంతరం 73373 59375 కు వాట్సాప్ లో Hi అని మెసేజ్ పెట్టండి.
- "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు స్వాగతం. ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ చేసుకోండి" అనే మెసేజ్ కనిపిస్తుంది. ఇందులో షెడ్యూల్ పై క్లిక్ చేయండి.
- 'దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి' అనే మెసేజ్ వస్తుంది. రైతు తన ఆధార్ నెంబర్ ను టైప్ చేయాలి. ఆ ఆధార్ నెంబర్ కలిగిన రైతు పేరు, ధాన్యం అమ్మే కొనుగోలు కేంద్రం పేరు స్క్రీన్ పై కనిపిస్తుంది.
- ధాన్యం కొనుగోలు కేంద్రంపై క్లిక్ చేయగానే...ధాన్యం అమ్మే తేదీని ఎంచుకోండి అనే మెసేజ్ కనిపిస్తుంది. మీకు నచ్చిన తేదీపై క్లిక్ చేయండి.
- అనంతరం ధాన్యం అమ్మే సమయాన్ని ఎంచుకోవాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూడు స్లాట్ లు ఉంటాయి.
- ఇందులో ఉదాహరణకు ఉదయం 8 నుంచి 10 గంటల స్లాట్ ఎంచుకుంటే... ఇందులో 8, 9, 10 గంటల స్టాట్ ఏదో ఒక సమయాన్ని నిర్థారించుకోవాలి.
- సమయాన్ని ఎంచుకున్న తర్వాత రైతు ఏ ధాన్యం అమ్ముతున్నాడో తెలిపాలి. Common Sortex , Common Non Sortex ఇలా మీ ప్రాంతానికి సంబంధించిన రకాలు కనిపిస్తాయి.
- రైతు ప్రభుత్వానికి అమ్మదలచిన ధాన్యంను బ్యాగ్స్ లో తెలపాలి. బ్యాగ్ సంఖ్య తెలపగానే రైతు పేరు, ఏ కేంద్రంలో, ఏ తేదీన ఏ స్లాట్ లో ఏ సమయానికి ఎన్ని బ్యాగ్ లో ధాన్యం కొనుగోలు వివరాలు డిస్ ప్లే అవుతాయి. అదేవిధంగా కూపన్ కోడ్ వస్తుంది.
- ఏఐ వాయిస్ ఓవర్ తో రైతులను గైడ్ చేస్తూ వాట్సాప్ లో సులభంగా ధాన్యం కొనుగోలు షెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.
సంబంధిత కథనం