Gunde Ninda Gudi Gantalu: పుట్టింట్లోనూ మీనాకు తప్పని కష్టాలు - ఫైనాన్షియర్‌తో బాలు ఛాలెంజ్ - రోహిణి టెన్షన్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 15 ఎపిసోడ్‌లో మీనాను పెళ్లిచేసుకున్న రోజు నుంచే తన జీవితం ముళ్లబాట అయిపోయిందని, మనశ్శాంతి, ఆనందం కరువయ్యాయని బాలు అంటాడు. మీనాను ఆమె తల్లి ముందే అవమానిస్తాడు. భర్త మాటలతో మీనా బాధపడుతుంది.
తనకు ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతం మేరకు దీపావళి పండుగకు మీనాను తీసుకొని ఆమె పుట్టింటికి వస్తాడు బాలు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి మీనాను మాటలతో ఇబ్బందిపెడుతూనే ఉంటాడు బాలు.
అబద్దాల్లో ట్రైనింగ్...
మీనా నోరు తెరిస్తే అబద్దాలు అలవోకగా వస్తున్నాయని, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుందా అని పార్వతితో అంటాడు బాలు. తాను ఏం అబద్దాలు ఆడానో చెప్పమని భర్తను మీనా నిలదీస్తుంది. ఇప్పుడు, అప్పుడు అని కాదు నువ్వు ఎప్పుడూ అబద్దాలే ఆడుతుంటావని బాలు ఫైర్ అవుతాడు.
కారు గురించి మీ ఇంటి ఓనర్‌తో ఎందుకు అబద్ధం చెప్పావని మీనాపై కోప్పడుతాడు బాలు. వాళ్ల ముందు మనం తక్కువ కాకూడదని అలా అన్నానని మీనా అంటుంది.
మూడు ముళ్లు వేసిన రోజు నుంచే...
కారు ఏమైందని మీనాను పార్వతి అడుగుతుంది. నన్ను అడగండి నేను చెబుతానని మీనాపై తనకున్న కోపాన్ని మరోసారి బాలు బయటపెడతాడు. మీనామెడలో మూడుముళ్లు వేసిన రోజు నుంచి నా బతుకు ముళ్లబాట అయిపోయిందని బాలు అంటాడు. నా అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయని చెబుతాడు.
ముందుగా ప్రశాంతత, ఆ తర్వాత ఆనందం పోయాయి. ఆ తర్వాత సొంత కారు..ఇప్పుడు అద్దెకారు కూడా పోయిందని కోపంగా అంటాడు. ఫైనాన్షియర్‌తో గొడవ కారణంగా అద్దె కారు ఎలా పోయిందో పార్వతికి వివరిస్తాడు బాలు.
టాపిక్ డైవర్ట్...
తాను సంతోషంగా లేనని తల్లికి తెలిస్తే బాధపడుతుందని మీనా టాపిక్ డైవర్ట్ చేస్తుంది. తల్లికి పని చెప్పి అక్కడి నుంచి పంపిచేస్తుంది. మీకు ఇంకా నాపై కోపం పోలేదని తెలిస్తే అమ్మవాళ్లు బాధపడతారని, కూతురిని తక్కువ చేసి మాట్లాడితే ఏ తల్లి తట్టుకోలేదని బాలును బతిమిలాడుతుంది మీనా. నిజాలు మాట్లాడితే వినడానికి కష్టంగా ఉందా మీనాపై పంచ్‌లు వేస్తాడు బాలు. పండుగకు మనం ఇంటికి వచ్చామని సంతోషంగా ఉన్న అమ్మను బాధపెట్టొద్దని బాలును బతిమిలాడుతుంది.
బాలు మాటలు విని పార్వతి డౌట్ పడుతుంది. బాలు నిజంగానే నీతో బాగానే ఉంటున్నాడా అంటూ మీనాను అడుగుతుంది. బాలుకు ఎప్పుడు కోపం వస్తుందో...ఎప్పుడు బాగుంటాడో తెలియదని, సర్ధుకుపోవడం తప్ప తాను ఏం చేయలేనని మీనా అంటుంది.
బాలుకు అవమానం...
తన కారు కోసం ఫైనాన్షియర్ దగ్గరకు వస్తాడు బాలు. పైనాన్షియర్ రూమ్ లోపలికి బాలును వెళ్లకుండా అతడి మనుషులు అడ్డుకుంటారు. వారిని తోసేసి రూమ్ లోపలికి వస్తాడు బాలు.
సమయానికి డబ్బులు కట్టకుండా...ఎవడు పడితే వాడు నా కారులో దర్జాగా తిరడం మా వాళ్లకు నచ్చదు...అందుకే నీ కారును తీసుకొచ్చారని బాలుతో అంటాడు ఫైనాన్షియర్. కారు కావాలని అనుకుంటే నాకు ముందే ఓ మాట చెబితే బాగుండేదని ఫైనాన్షియర్‌తో బాలు వాదనకు దిగుతాడు. నా భార్య ముందు నడిరోడ్డులో రుబాబు చేసి నన్ను అవమానించడం బాగాలేదని బాలు ఫైర్ అవుతాడు.
ఫైనాన్షియర్ రివేంజ్...
ఆ రోజు నా ఆఫీస్‌లో నా మనుషుల ముందే నువ్వు నా కాలర్ పట్టుకుంటే నాకు కూడా ఇలాగే కాలిందని బాలుతో అంటాడు ఫైనాన్షియర్. దానికి ఇలా రివేంజ్ తీర్చుకున్నావా అని ఫైనాన్షియర్‌ను నిలదీస్తాడు బాలు.
బ్యాలెన్స్ డబ్బు ఇప్పుడే ఇచ్చేస్తాను...కారు తాళాలు ఇవ్వమని పైనాన్షియర్‌ను అడుగుతాడు బాలు. డబ్బు ఒక్కటే ఇస్తే సరిపోదనినిజంగా నీకు కారు కావాలంటే నా కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పమని ఫైనాన్షియర్ అంటాడు. జీవితాంతం నా దగ్గర తలదించుకునే ఉంటానని, పొరపాటున నోరుజారనని అగ్రిమెంట్ రాసివ్వమని చెబుతాడు.
ఆ కర్మ నాకు పట్టలేదు...
నీలా డబ్బు జబ్బుతో బాధపడేవాడిని బతిమిలాడాల్సిన కర్మ నాకు పట్టలేదని పైనాన్షియర్‌తో ఛాలెంజ్ చేస్తాడు బాలు. కష్టపడేవాడినిక ఏదో ఒక చోట పని దొరుకుతూనే ఉంటుందని అంటాడు. బాలును బయటకు తోసేయమని తన మనుషులతో పైనాన్షియర్ చెబుతాడు. బాలును టచ్ చేయడానికి వాళ్లు రాగానే.నాకు స్టీరింగ్ తిప్పడమే కాదు ఎముకలు విరగొట్టడం వచ్చు అని పైనాన్షియర్‌తో పాటు అతడి మనుషులకు బాలు వార్నింగ్ ఇస్తాడు.
కష్టపడి పనిచేస్తా...
రోహిణికి కాల్ చేస్తాడు వర్ధన్. కానీ ఆమె ఫోన్ కట్ చేస్తుంది. రోహిణి ఇంటి దగ్గర ఆటో దిగగానే అక్కడ వర్ధన్ కనిపిస్తాడు. అతడిని చూసి షాకవుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని అడుగుతుంది. నీకు డబ్బులు ఇచ్చాను కదా అని అంటుంది. బ్యాలెన్స్ ఎవరిస్తారు అంటూ రోహిణి నివర్ధన్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తన బిజినెస్ బాగాలేదని, డబ్బులు ఇవ్వలేనని రోహిణి సమాధానమిస్తుంది. ప్రభావతి రావడంతో ఇంట్లోకి వెళ్లిపోతుంది.
రోహిణికి యాక్సిడెంట్...
రోహిణిని బయటపెట్టడానికి ఆమె తల్లికి ఫోన్ చేస్తాడు వర్ధన్. రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని ఆమె తల్లికి ఫోన్‌చేస్తాడు. అది నిజమని నమ్మిన రోహిణి తల్లి కండారు పడుతుంది. జస్ట్ టీజర్ వదిలానని, ఇంకా ముందుంది ముసళ్ల పండుగ అని వర్ధన్ అనుకుంటాడు.
మనోజ్‌కు క్లాస్...
ఖాళీగా ఇంకా ఎన్నాళ్లు తిరుగుతావని మనోజ్‌కు క్లాస్ ఇస్తుంది ప్రభావతి. నా రేంజ్‌కు తగ్గ జాబ్ దొరకడం లేదని మనోజ్ బిల్డప్‌లు ఇస్తాడు. నీ రేంజ్‌ను పక్కనపెట్ట ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోమని గాలితీసేస్తుంది. ఆ తర్వాత మలేషియా టూర్ గురించి నువ్వే మీ మావయ్యతో మాట్లాడమని మనోజ్‌తో అంటుంది ప్రభావతి.
రోహిణి నంబర్ ఇవ్వకపోతే నువ్వే ఆమె ఫోన్ నుంచి నంబర్ తీసుకొని మాట్లాడమని చెబుతుంది.. చాటు నుంచి మనోజ్, ప్రభావతి మాటల్ని విన్న రోహిణి కంగారు పడుతుంది. మరోవైపు రోహిణి ఆరోగ్యం గురించి వాకబు చేయడానికి ఆమె తల్లి ఫోన్ చేస్తుంది. తానున్న టెన్షన్‌లో తల్లితో మాట్లాడటం కష్టమని నంబర్ బ్లాక్ చేస్తుంది.
కాపురానికి తీసుకొచ్చి తప్పుచేశా...
మీనాను ఆమె తల్లి పార్వతి ముందే దారుణంగా అవమానిస్తాడు బాలు. భర్త మాటలను సహించలేకపోతుంది మీనా. బాలుకు చెప్పకుండా తిరిగి అత్తింటికి వచ్చేస్తుంది. ఆ విషయం తెలిసి బాలు...మీనాపై మరోసారి ఫైర్ అవుతాడు. నిన్ను తిరిగి కాపురానికి తీసుకొచ్చి తప్పుచేశానని అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.