Pushpa 2 Trailer: పుష్ప అంటే ప్లవర్ అనుకొంటివా .. డైలాగ్ మార్చేసిన అల్లు అర్జున్, పుష్ప 2 ట్రైలర్ రిలీజ్
Pushpa 2 trailer release: ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ ఆదివారం రిలీజైంది. భారీ అంచనాల మధ్య డిసెంబరు 5న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత హైప్ పెంచేసింది.
మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ట్రైలర్ ఆదివారం రిలీజైంది. బీహార్ రాజధాని పాట్నాలో ఈరోజు సాయంత్రం నుంచి జరుగుతున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ ముందుగా చెప్పినట్లు ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప: ది రూల్ రిలీజ్‌కానుంది.
ఎవడ్రా వాడు..
‘‘ఎవడ్రా వాడు. డబ్బు అంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు’’ అంటూ జగపతి బాబు డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. అలానే నీలో తెలియని బాధ ఏంటో ఉందంటూ.. పుష్ప చిన్ననాటి చేదు అనుభవాల్ని కూడా మళ్లీ సుకుమార్ సీక్వెల్‌లోనూ కొనసాగించినట్లు తెలుస్తోంది. పుష్ప ‘నామ్ చోటా హై.. లేకిన్ సౌండ్ బడా హై’ అంటూ ఎలివేషన్ సీన్స్ కూడా ఈ ట్రైలర్‌లో కనిపించాయి.
పార్టీ ఉంది పుష్పా!
పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్.. అంటూ తన భర్త గురించి చెప్తున్న శ్రీవల్లి (రష్మిక మంధాన).. పుష్పాని అతని తల్లి తరహాలోనే కంట్రోల్ చేస్తున్నట్లు ట్రైలర్‌లో కనిపించింది. ఇక ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ లెంగ్త్ కూడా ఈసారి పెంచినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది. పుష్ప-1లో పార్టీ లేదా పుష్పా? అంటూ ఫహాద్ ఫాజిల్ చేసిన సందడి.. పుష్ప-2లోనూ కొనసాగనుంది. ట్రైలర్‌లో పార్టీ ఉంది పుష్ప అని ఫహాద్ ఫాజిల్ చెప్పడం కనిపించింది.
ఇంటర్నేషనల్ టార్గెట్
నాకు రావాల్సిన పైసా.. ఏడు కొండల మీదున్నా.. ఏడు సముద్రాల దాటి ఉన్నా వెళ్లి తెచ్చుకుంటా అంటూ పుష్ప పవర్‌ఫుల్ డైలాగ్‌తో మూవీపై అంచనాల్ని సుకుమార్ మరింత పెంచేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకొంటివా.. ఇంటర్నేషనల్ అంటూ.. తన టార్గెట్‌ని చెప్పకనే ఒక్క డైలాగ్‌తో అల్లు అర్జున్ చెప్పకనే చెప్పారు.
పుష్ప 2లో అల్లు అర్జున్‌కి జంటగా రష్మిక మంధాన నటించగా.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఇక ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ఈ సీక్వెల్‌లోనూ కొనసాగగా.. కొత్తగా జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ యాడ్ అయ్యారు.