Sabarimala : శబరిమల వద్ద చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ.. అంతేకాదు మరెన్నో ఏర్పాట్లు!-special queue for childrens and elderly women opened at sabarimala and other facilities also ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sabarimala : శబరిమల వద్ద చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ.. అంతేకాదు మరెన్నో ఏర్పాట్లు!

Sabarimala : శబరిమల వద్ద చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ.. అంతేకాదు మరెన్నో ఏర్పాట్లు!

Anand Sai HT Telugu
Nov 17, 2024 09:47 PM IST

Kerala News : శబరిమల అయ్యప్ప ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడిన భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(TDB) ఓ నిర్ణయం తీసుకుంది. పిల్లలు, వృద్ధ మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక క్యూను ప్రవేశపెట్టింది.

శబరిమల న్యూస్
శబరిమల న్యూస్

శబరిమల అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు క్యూలో చాలా మంది నిల్చుంటారు. దీంతో పిల్లలు, వృద్ధ మహిళలు, వికలాంగుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రత్యేకంగా క్యూ ప్రవేశపెట్టింది. టీడీబీ అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భక్తుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. ఈ క్యూలో ఉన్న భక్తులు 18 పవిత్ర మెట్లను అధిరోహించిన తర్వాత ఫ్లైఓవర్‌ను దాటుకుని నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు.

18 పవిత్ర మెట్ల వద్ద ఉండే పోలీసు సిబ్బంది డ్యూటీ సమయాన్ని 20 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించడం మంచిదైందని ప్రశాంత్ పేర్కొన్నారు. 'ఒక నిమిషంలో కనీసం 80 మంది భక్తులు 18 మెట్ల గుండా వెళతారు. భక్తులను నియంత్రించే వర్చువల్ క్యూ సిస్టమ్‌తో పంపా నుండి ట్రెక్కింగ్ మార్గంలో రద్దీ ఉండదు.' అని ఆయన వివరించారు.

మరోవైపు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) తీర్థయాత్ర సీజన్ కోసం కార్యకలాపాలను వేగవంతం చేసింది. మొదటి దశలో నీలక్కల్-పంపా చైన్ సర్వీస్ కోసం 383 బస్సులను నడుపుతున్నారు. ఇప్పటికే 192 బస్సులు నిలక్కల్‌లో ఉన్నాయి. రెండో దశతో ఈ సంఖ్య సుమారు 550 బస్సులకు పెరగనుంది.

ప్రతి నిమిషానికి ఒక బస్సు నడుపుతున్నామని, భక్తుల రద్దీని బట్టి సర్వీసులను పెంచుతున్నామని అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే కేఎస్‌ఆర్‌టీసీ ఈ మార్గంలో 1000కు పైగా సర్వీసులను నడిపింది. అదనంగా 200 కంటే ఎక్కువ సుదూర సేవలు పంపాను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో కలిపాయని ప్రశాంత్ తెలిపారు.

శబరిమల సేవలను సమన్వయం చేయడానికి పంపా వద్ద మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. మూడు మెయింటెనెన్స్ వాహనాలు కూడా ఉన్నాయి. మరోవైపు కొట్టాయంలోని ఆలయ పట్టణం ఎరుమేలీ యాత్రికుల రద్దీతో సందడిగా మారింది. శబరిమల యాత్రికుల భద్రత కోసం 500 మంది పోలీసులను మోహరించారు. చెత్త నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి అధికారులు గంటకు 6,000 చెత్తను ప్రాసెస్ చేయగల మొబైల్ సెప్టేజ్ యూనిట్‌ను ప్రవేశపెట్టారు.

శబరిమల యాత్రకు సంబంధించి యాత్రికులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు శబరిమల మార్గంలో కనీవ్ 108 ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ యూనిట్లు ఆరోగ్య శాఖ, కనీవ్ 108 అంబులెన్స్‌లకు అదనంగా ఉంటాయి. అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రులతో పాటు, పంపా నుండి సన్నిధానం, కాననపథ వరకు మొత్తం 19 అత్యవసర వైద్య కేంద్రాలు, ఆక్సిజన్ పార్లర్‌లను కూడా ఏర్పాటు చేశారు.

ఇరుకైన మార్గాల్లో ప్రయాణించే బైక్ ఫీడర్ అంబులెన్స్, కఠినమైన రోడ్లపై ప్రయాణించే 4x4 రెస్క్యూ వ్యాన్, శబరిమల కోసం ఐసీయూ అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. పంపా ఆసుపత్రిలో కనీవ్ 108 అంబులెన్స్ పథకం కింద ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ యూనిట్ పనిచేస్తోంది. ఈ వాహనాల సేవ యాత్రికులకు వైద్య సహాయం కావాలంటే టోల్ ఫ్రీ నంబర్ 108ని సంప్రదించడం ద్వారా అందుబాటులో ఉంటుంది. అలాగే అత్యవసర వైద్య సహాయం కోసం 04735 203232కు కాల్ చేయెుచ్చు.

బైక్ ఫీడర్ అంబులెన్స్‌లో రోగిని తీసుకెళ్లేందుకు పక్క కారు అమర్చబడి ఉంటుంది. రోగులకు చికిత్స చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ద్వారా వాహనం నడుస్తుంది.a

Whats_app_banner