Best Cars Under 10L : రూ.10 లక్షలలోపు ధరతో 5 బెస్ట్ కార్లు.. కొనేందుకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు!
Best Cars Under 10L : రూ.10 లక్షలలోపు ధరతో మంచి కారు తీసుకోవాలనుకునేవారి కోసం మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బడ్జెట్ ధరలో దొరికే టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం..
మిడిల్ క్లాస్ వాళ్లు కూడా ఎక్కువగా కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రూ.10 లక్షల వరకు బడ్జెట్ పెడుతున్నారు. దీంతో కార్ల కంపెనీలు సైతం కొత్త కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. దీంతో కస్టమర్లు కూడా కారు కొనేందుకు ఇంట్రస్ట్‌తో ఉంటున్నారు. ఇటీవలి కాలంలో పది లక్షల రూపాయలు పెట్టి.. మంచి కారు తీసుకోవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం టాప్ కార్లు ఉన్నాయి. మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తే.. ఏది కొనాలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. బెస్ట్ కార్లు ఏంటో చూడండి..
మారుతి డిజైర్
కొత్త మారుతి డిజైర్ రాకతో.. అందరి దృష్టి దీనిపై పడింది. మారుతి డిజైర్ రూ. 10 లక్షల బడ్జెట్‌లో కొనుగోలు చేయడానికి బెటర్ కారు. కొత్త డిజైన్‌తోపాటుగా విభిన్న ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి కాంపాక్ట్ సెడాన్ కొత్త మూడు సిలిండర్ ఇంజన్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో కూడా వచ్చింది. కొత్త డిజైర్ 1.2-లీటర్ 3-సిలిండర్, జెడ్-సిరీస్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌తో 81 బీహెచ్‌పీ శక్తిని, 112 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా ఆప్షనల్. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ.7.91 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ 10 లక్షలకు పైనే వెళ్లగలిగినప్పటికీ మంచి ఫీచర్లతో వస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్
డాష్-క్యామ్, అలెక్సా హోమ్ 2 కార్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ కీలెస్ ఎంట్రీవంటి ఫీచర్లతో ఉన్న ఎస్‌యూవీలలో ఇది ఒకటి. మీరు 10 లక్షలకు మంచి వేరియంట్‌ని కొనాలని అనుకుంటే ఇది బెటర్. సిటీ డ్రైవింగ్‌కు బాగుంటుంది. ఈ హ్యుందాయ్ చిన్న ఎస్‌యూవీ ప్రస్తుత ధర రూ.7.21 లక్షలుగా ఉంది.
నిస్సాన్ మాగ్నైట్
మాగ్నైట్ భారతదేశంలో అత్యంత చౌకైన ఎస్‌యూవీగా చెప్పవచ్చు. ఇటీవలి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో వాహనం మరింత ప్రీమియంగా మారుతుంది. ఇది 360 డిగ్రీల కెమెరా, రిమోట్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్‌ను పొందే ఫీచర్ లోడ్ చేసిన ఎస్‌యూవీ. మాగ్నైట్ ఆన్-రోడ్ ధర రూ. 7.04 లక్షల నుండి మెుదలు.
సిట్రోన్ సీ3
సిట్రోన్ సీ3 గతంలో కంటె మెరుగ్గా వస్తుంది. ఇది రూ.10 లక్షల లోపు కొనుగోలు చేయగల మంచి కారు. కూల్ సస్పెన్షన్, స్పోర్టీ ఇంజన్, మంచి రైడ్ సౌకర్యంతో ఉంటుంది సిట్రోయెన్. సీ3 మోడల్ ధర రూ.7.42 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టాటా ఆల్ట్రోజ్
రూ. 10 లక్షల బడ్జెట్‌లో మంచి కారు కోసం చూస్తున్నట్లయితే టాటా ఆల్ట్రోజ్ బెస్ట్. క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. సేఫ్టీ మాత్రమే కాదు.. ఫీచర్లు కూడా బాగుంటాయి. ఇంజన్ ఆప్షన్స్ పరంగా ఆల్ట్రోజ్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్ కూడా కలిగి ఉంది. ఈ మోడల్ 7.68 లక్షలకు కూడా దొరుకుతుంది.