సీనియర్ సిటిజన్లకు రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు-senior citizen can get 5 lakh rupees free health insurance only with aadhaar card how to register in online and app ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సీనియర్ సిటిజన్లకు రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు

సీనియర్ సిటిజన్లకు రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు

Anand Sai HT Telugu
Nov 17, 2024 08:00 PM IST

Senior Citizen Health Insurance : ఇటీవల సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇందులో ఎలా రిజిస్ట్రర్ అవ్వాలో తెలుసుకుందాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

70 ఏళ్ల పైబడిన వృద్ధుల కోసం కేంద్రం ఆయుష్మాన్ భారత్ యోజన కింద 5 లక్షల వరకు కవరేజీని ఉచితంగా అందిస్తోంది. కుటుంబానికి అర్హత లేనప్పటికీ.. సీనియర్ సిటిజన్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే ఇందుకోసం పథకంలో నమోదు చేసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కొత్త కార్డు జారీ చేస్తారు. ధనవంతులు, పేదలు.. ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఇటీవల 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరూ దీనిని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఆదాయం ఉన్నవారు, లేనివారు, ఈ బీమాలో భాగస్వాములు అవ్వొచ్చు. సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం ఈ పథకం లక్ష్యం. సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ద్వారా లబ్ధి పొందుతారు.

లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ స్కీమ్ కోసం వెబ్‌సైట్ పోర్టల్, ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్, మెుబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఉంటే సరిపోతుంది. సీనియర్ సిటిజన్‌లు అధికారిక నేషనల్ హెల్త్ అథారిటీ వెబ్‌సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

NHA బెనిఫిషియరీ పోర్టల్‌ని సందర్శించండి.

మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి, క్యాప్చాను ఎంటర్ చేయండి. OTPని కన్ఫామ్ చేయండి.

70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం బ్యానర్‌పై క్లిక్ చేయండి. వివరాలను నమోదు చేయండి.

మీ రాష్ట్రం, జిల్లా, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

ఆధార్ OTPని ఉపయోగించాలి. KYC ధృవీకరణ కోసం ఇటీవలి ఫోటోను అప్‌లోడ్ చేయండి.

ఆమోదం పొందిన తర్వాత, ఆయుష్మాన్ వయ వందన కార్డ్‌ని 15 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి.

మొబైల్ అప్లికేషన్ ద్వారా ఎలా రిజిస్ట్రర్ అవ్వాలి?

మీ మొబైల్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ వెళ్లాలి.

క్యాప్చా, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి, ఆపై ఓటీపీ ఎంటర్ చేయాలి.

ఆధార్ సమాచారం ఇవ్వాలి. ఇటీవలి ఫోటోను అప్‌లోడ్ చేయండి.

లబ్ధిదారు, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయండి, ఆపై ఈకైవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.

రిజిస్ట్రేషన్ తర్వాత కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

Whats_app_banner