AP Kishori Vikasam Scheme : ఏపీలో కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం, క‌లెక్లర్లకు స‌చివాల‌య శాఖ ఆదేశాలు-ap kishori vikasam scheme for empower adolescent girls started secretariat department orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Kishori Vikasam Scheme : ఏపీలో కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం, క‌లెక్లర్లకు స‌చివాల‌య శాఖ ఆదేశాలు

AP Kishori Vikasam Scheme : ఏపీలో కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం, క‌లెక్లర్లకు స‌చివాల‌య శాఖ ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
Nov 17, 2024 10:18 PM IST

AP Kishori Vikasam Scheme : ఆంధ్రప్రదేశ్‌లో మిష‌న్ వాత్సల్య ప‌థ‌కం కింద‌ కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం అయ్యింది. ఈ మేర‌కు అన్ని క‌లెక్లర్లకు రాష్ట్ర స‌చివాల‌యాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ కార్యక్రమం అమ‌లుకు సంబంధించి త‌గిన చ‌ర్యలు చేప‌ట్టాల‌ని పేర్కొంది.

ఏపీలో కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం, క‌లెక్లర్లకు స‌చివాల‌య శాఖ ఆదేశాలు
ఏపీలో కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభం, క‌లెక్లర్లకు స‌చివాల‌య శాఖ ఆదేశాలు

గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం (జీఎస్‌డ‌బ్ల్యూఎస్‌) డిపార్ట్‌మెంట్ మిష‌న్ వాత్సల్య ప‌థ‌కం కింద కిశోరి బాలిక వికాసం ప్రోగ్రాం పునఃప్రారంభించింది. ఈ మేర‌కు జీఎస్‌డ‌బ్ల్యూఎస్ శాఖ డైరెక్టర్‌ ఎం. శివ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా రిసోర్స్ గ్రూప్‌ల ద్వారా మండ‌ల రిసోర్స్ గ్రూపుల‌కు శిక్షణ ఇవ్వాల‌ని, మండ‌ల రిసోర్స్ గ్రూపుల ద్వారా విలేజ్ రిసోర్స్ గ్రూప్‌లు శిక్షణ ఇవ్వాల‌ని సూచించారు. స్కూల్, కాలేజీల‌కు వెళ్లని బాలిక‌ల‌ను గ్రూప్‌గా మ‌హిళా పోలీస్‌, వెల్ఫేర్‌, ఎడ్యుకేష‌న్ అసిస్టెంట్‌లు ఏర్పాటు చేయాలని సూచ‌న‌లు చేశారు.

కిశోరి బాలికా వికాసం కార్యక్రమానికి సంబంధించి న‌వంబ‌ర్ 30లోపు విలేజ్ రిసోర్స్ గ్రూప్‌ల‌కు మండ‌ల రిసోర్స్ గ్రూప్‌లు శిక్షణ పూర్తి చేయాలి. ఇప్పటికే జిల్లా స్థాయి శిక్షణ పూర్తి అయింద‌ని పేర్కొన్నారు. గ్రామ‌, వార్డు, అంగ‌న్‌వాడీ కేంద్రాల‌లో అందుబాటులో ఉన్న బాలిక‌ల‌తో పాఠ‌శాల‌, కాలేజీల‌కు దూరంగా ఉన్న బాలికల గ్రూపుల‌ను ఏర్పాటు చేసే బాధ్యత‌ను మ‌హిళ పోలీస్‌, వెల్ఫేర్‌, ఎడ్యుకేష‌న్ అసిస్టెంట్‌, విలేజ్‌, వార్డు సెక్రటేరియ‌ట్ కార్యద‌ర్శుల‌కు అప్పగించిన‌ట్లు తెలిపారు.

ఆ బాలికల గ్రూప్‌ల‌కు మహిళా పోలీసులు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ బాలిక విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రుతుక్రమ పరిశుభ్రత, బాల్య వివాహాలు, పోక్సో చట్టం, ఆత్మరక్షణ, వృత్తి విద్య, జీవనోపాధి అవకాశాలు మొదలైన పిల్లల సమస్యలపై చర్చిస్తుంది. అందుకోసం ఈ గ్రూప్ ప్రతి 15 రోజుల‌కు ఒకసారి (రెండో, నాలుగో శ‌నివారాల్లో) అంగన్‌వాడీ కేంద్రాల్లో సమావేశం అవ్వాల‌ని సూచించారు. దీనికి సంబంధించి అన్ని గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం జిల్లా ఇన్‌ ఛార్జ్ అధికారులకు, డీఎల్‌డీవోఎస్‌ల‌కు అన్ని జిల్లా క‌లెక్టర్లు త‌గిన సూచ‌న‌లు చేయాల‌ని ఆదేశించారు. మండ‌ల‌, గ్రామ స్థాయి శిక్షణల‌ను పూర్తి చేయ‌డానికి, అలాగే గ్రామ, వార్డు, అంగ‌న్‌వాడీ కేంద్రాల‌లో అందుబాటులో ఉన్న స్కూల్‌, కాలేజీల‌కు దూరంగా ఉన్న బాలిక‌లతో గ్రూప్‌ల‌ను ఏర్పాటు చేయ‌డానికి త‌గిన చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner