Allu Arjun: పుష్ప ఫస్ట్ టైమ్ తలవంచుతున్నాడు.. నన్ను క్షమించండి: అల్లు అర్జున్
Pushpa 2 event: పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి పట్నాలో భారీ ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు తరలివచ్చారు. ఈ ఈవెంట్‌లో ఒక డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్.. కేరింతలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు.
బీహార్ రాజధాని పాట్నా వేదికగా ఆదివారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ కాస్త ఎమోషన్‌గా మాట్లాడారు. పుష్ప: ది రూల్ మూవీ డిసెంబరు 5న రిలీజ్‌కాబోతుండగా.. 2021 తర్వాత మళ్లీ స్క్రీన్‌పై అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. దాంతో పుష్ప-2పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పట్నాలో తన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి హిందీలో అల్లు అర్జున్ మాట్లాడారు.
బీహార్‌కి ఫస్ట్ టైమ్
‘‘నేను ఈ బీహార్‌కి మొదటిసారి వచ్చాను. నా హిందీ అంత బాగుండదు. ఏవైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. సాధారణంగా పుష్ప ఎవరికీ తల వంచడు. కానీ.. మీ ప్రేమ, అభిమానానికి తల వంచుతున్నాను. అభిమానులుగా మీరు చూపిస్తున్న ప్రేమ ఇంత గొప్ప సినిమా తీయడానికి మాకు ప్రేరణ. డిసెంబరు 5న పుష్ప2 రిలీజ్ కాబోతోంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా..? కాదు వైల్డ్ ఫైర్’’ అంటూ డైలాగ్‌తో అల్లు అర్జున్ సభా ప్రాంగణాన్ని కేరింతలతో మార్మోగించారు.
మూడేళ్లు ఎదురుచూపులు
ఇదే ఈవెంట్‌లో హీరోయిన రష్మిక మంధాన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ట్రైలర్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా.. డిసెంబరు 5న మీరు ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడండి అంటూ రిక్వెస్ట్ చేశారు.
ఓవర్సీస్‌లో రికార్డ్
పుష్ప 2 రిలీజ్‌కి ముందే రికార్డుల మోత మోగించేస్తోంది.. ఓవర్సీస్‌లో వేగంగా $872,653 అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన తొలి భారతీయ సినిమాగా పుష్ప2 ఇప్పటికే రికార్డ్ నెలకొల్పింది. అలానే ఓవర్సీస్‌లో టికెట్స్ పరంగాను 30.7K టికెట్స్ బుక్ అయ్యి సరికొత్త ఘనత సాధించింది.
స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించింది. అలానే క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. పుష్ప-1లో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా మొత్తం ఏడు నగరాల్లో పుష్ప ప్రమోషన్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఆదివారం పట్నాలో జరగగా.. ఇక కోల్‌కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో జరగనున్నాయి.