Game Changer OTT Platform: గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. హక్కులను దక్కించుకున్న ప్లాట్‍ఫామ్ ఇదే-game changer ott digital streaming rights bagged by amazon prime video platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Ott Platform: గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. హక్కులను దక్కించుకున్న ప్లాట్‍ఫామ్ ఇదే

Game Changer OTT Platform: గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. హక్కులను దక్కించుకున్న ప్లాట్‍ఫామ్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 19, 2024 08:47 PM IST

Game Changer Movie OTT Platform: గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్ లాక్ అయింది. ఏ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందో రివీల్ అయింది. ఆ వివరాలివే..

Game Changer OTT Platform: గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. హక్కులను దక్కించుకున్న ప్లాట్‍ఫామ్ ఇదే
Game Changer OTT Platform: గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. హక్కులను దక్కించుకున్న ప్లాట్‍ఫామ్ ఇదే

Game Changer OTT: మెగా పవర్ స్టార్ రామ్‍‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ కొట్టిన చరణ్.. ఆ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు తమిళ స్టార్ దర్శకుడు శంకర్. ఈ మూవీ షూటింగ్ తుదిదశ చేరుకుంది. ఈ తరుణంలో గేమ్ చేంజర్ సినిమా ఓటీటీ డీల్‍ను లాక్ చేసుకుంది.

ప్లాట్‍ఫామ్ ఇదే..

గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్ కైవసం చేసుకుంది. నేడు (మార్చి 19) ముంబైలో జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్‍లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. గేమ్ ఛేంజర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టు ఆ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది.

థియేట్రికల్ రన్ తర్వాత..

గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్లలో రిలీజ్ ఎప్పుడు కానుందో ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. షూటింగ్ ఇంకా సాగుతుండటంతో విడుదల తేదీపై మూవీ టీమ్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన తర్వాత.. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇలా.. మూవీ టీమ్‍తో ఓటీటీ డీల్ చేసుకుంది.

షూటింగ్ ఇలా..

గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుందని సమాచారం. ఇటీవలే విశాఖపట్టణంలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. వైజాగ్‍లో రామ్ చరణ్‍కు ఘన స్వాగతం లభించింది. రెండేళ్ల క్రితమై ఈ మూవీ షూటింగ్ మొదలైనా ఆలస్యమవుతూ వస్తోంది. డైరెక్టర్ శంకర్.. ఇండియన్ 2 మూవీ కూడా చేయడంతో ఈ చిత్రానికి పలుమార్లు బ్రేకులు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. మరికాస్త మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉందని టాక్. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‍లో సాగనుంది.

ఫస్ట్ సాంగ్ అప్పుడే..

రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రానుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నిర్మాత దిల్‍రాజు ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ పాటతో పాటు మూవీ రిలీజ్ ఎప్పుడనే విషయాన్ని కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. దీంతో.. రామ్‍చరణ్ పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నారని సమాచారం. రాజకీయాల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఆఫీసర్‌గా ఈ చిత్రంలో ఆయన పాత్ర అదిరిపోతుందని బజ్ నడుస్తోంది. రాజకీయాల చుట్టూ ఈ మూవీ సాగనుంది.

గేమ్ ఛేంజర్ చిత్రంలో చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఎస్‍జే సూర్య, అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్‍తో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీత దర్శకుడిగా ఉన్నారు.