ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చినా..-etv win ott movie sopathulu gets over 10 million streaming minutes telangana backdrop movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Etv Win Ott: ఈటీవీ విన్ ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చినా..

ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చినా..

Hari Prasad S HT Telugu
Oct 10, 2024 08:16 PM IST

ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీలోకి నేరుగా వచ్చిన ఓ సినిమా ఇప్పుడు రికార్డులు తిరగరాస్తోంది. ఈ ఓటీటీలో అత్యధిక మంది చూసిన సినిమాల్లో ఒకటిగా దూసుకెళ్తోంది. తాజాగా మరో మైలురాయిని అందుకున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది.

ఈటీవీ విన్ ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చినా..
ఈటీవీ విన్ ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న చిన్న సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చినా..

ETV Win OTT: ప్రముఖ తెలుగు ఓటీటీల్లో ఒకటైన ఈటీవీ విన్ లోకి గత నెల ఓ సినిమా నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సినిమా ఇప్పుడా ఓటీటీలో ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు సోపతులు. మనల్ని మరోసారి మన బాల్యంలోకి తీసుకెళ్తున్న ఈ మూవీని డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

సోపతులు కొత్త రికార్డు

సోపతులు మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి గత నెల 19న వచ్చింది. 20 రోజుల్లోనే ఈ మూవీ 10 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ మినట్స్ మార్క్ అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని సదరు ఓటీటీ గురువారం (అక్టోబర్ 10) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "10 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ మినట్స్ అందించినందుకు థ్యాంక్యూ.

ఇంతకీ మీరు ఈ సోపతులు స్టోరీ చూశారా? ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. ఈ సోపతులు మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఈటీవీ విన్ లోనే అడుగుపెట్టింది.

సోపతులు మూవీ ఏంటి?

ఇది ఇద్దరు బాల్య స్నేహితుల చుట్టూ తిరిగే స్టోరీ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో తెరెక్కిన సినిమా. మహబూబాబాద్ లో ఉండే చింటు, గుడ్డు అనే ఇద్దరు దోస్తుల కథే ఈ సోపతులు. కొవిడ్ కారణంగా ఈ ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇద్దరూ మళ్లీ ఒకరినొకరు కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మరి వాళ్ల ప్రయత్నాలు ఫలించాయా? ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు మళ్లీ కలిశారా? వాళ్ల కలలు నెరవేరాయా అన్నదే ఈ సోపతులు మూవీ స్టోరీ.

కొవిడ్ సమయంలోని పరిస్థితుల ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చాయి. ఈ సోపతులు కూడా అలాంటి సినిమానే. ఆ మహమ్మారి ఆర్థికంగానే కాదు శారీరకంగా, మానసికంగా కూడా మనుషులపై తీవ్ర ప్రభావం చూపింది. అలాంటి వాటినే ఇప్పుడు పలువురు దర్శకులు సినిమాలుగా తీస్తున్నారు. అలా వచ్చిందే ఈ సోపతులు కూడా.

కేవలం గంటన్నర నిడివితోనే ఉన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసినట్లు తాజాగా ఈ మూవీ సాధించిన రికార్డు చూస్తే తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఈ మూవీని మీరు చూసి ఉండకపోతే వెంటనే ఈటీవీ విన్ ఓటీటీలోకి వెళ్లి చూసేయండి. ఈ సోపతులే కాకుండా భలే ఉన్నాడే, ఆర్టీఐ, తత్వ, పైలం పిలగా, కమిటీ కుర్రోళ్లులాంటి మూవీస్ కూడా ఈటీవీ విన్ ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Whats_app_banner