Thug Life Movie: క‌మ‌ల్‌కు హ్యాండిచ్చిన దుల్క‌ర్ స‌ల్మాన్ - మ‌ణిర‌త్నం థ‌గ్‌లైఫ్‌లో నాచుర‌ల్ స్టార్ నానికి ఛాన్స్‌!-dulquer salmaan opt out of kamal haasan maniratnam thug life movie nani replace his role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thug Life Movie: క‌మ‌ల్‌కు హ్యాండిచ్చిన దుల్క‌ర్ స‌ల్మాన్ - మ‌ణిర‌త్నం థ‌గ్‌లైఫ్‌లో నాచుర‌ల్ స్టార్ నానికి ఛాన్స్‌!

Thug Life Movie: క‌మ‌ల్‌కు హ్యాండిచ్చిన దుల్క‌ర్ స‌ల్మాన్ - మ‌ణిర‌త్నం థ‌గ్‌లైఫ్‌లో నాచుర‌ల్ స్టార్ నానికి ఛాన్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Mar 05, 2024 08:05 AM IST

Thug Life Movie: క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న థ‌గ్ లైఫ్ సినిమా నుంచి దుల్క‌ర్ స‌ల్మాన్ అర్థాంత‌రంగా వైదొలిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌డి స్థానాన్ని టాలీవుడ్ హీరో నానితో భ‌ర్తీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

థ‌గ్‌లైఫ్ మూవీ
థ‌గ్‌లైఫ్ మూవీ

Thug Life Movie: క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న థ‌గ్‌లైఫ్ సినిమా నుంచి దుల్క‌ర్ స‌ల్మాన్ త‌ప్పుకున్నాడు. సెట్స్‌లో అడుగుపెట్ట‌కుముందే ఈ సినిమాకు గుడ్‌బై చెప్పాడు. థ‌గ్ లైఫ్ నుంచి దుల్క‌ర్ అర్థాంత‌రంగా త‌ప్పుకోవ‌డం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. డేట్స్ స‌ర్ధుబాటుకాకపోవ‌డం వ‌ల్లే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ నుంచి దుల్క‌ర్ స‌ల్మాన్ బ‌య‌ట‌కు రావాల్సివ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. థ‌గ్‌లైఫ్ నుంచి తాను వైదొల‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌ను క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు మ‌ణిర‌త్నంల‌కు దుల్క‌ర్ వివ‌రించిన‌ట్లు తెలిసింది.

తెలుగుతో పాటు మ‌ల‌యాళంలో...

ప్ర‌స్తుతం మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. హీరోగా న‌టిస్తూనే ఇత‌ర భాష‌ల‌కు చెందిన స్టార్ హీరోల సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నారు. తెలుగులో సీతారామం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ల‌క్కీ భాస్క‌ర్ అనే మూవీకి దుల్క‌ర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. అలాగే త‌మిళంలో సూర్య‌, సుధా కొంగ‌ర కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న కొత్త మూవీలో ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. మ‌ల‌యాళంలో రెండు, హిందీలో ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. వీట‌న్నింటి కార‌ణంగా థ‌గ్ లైఫ్‌కు డేట్స్ స‌ర్ధుబాటు చేయ‌డం క‌ష్టంగా మారింద‌ని, అందుకే క‌మ‌ల్‌హాస‌న్ మూవీ నుంచి దుల్క‌ర్ స‌ల్మాన్ త‌ప్పుకున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

నానికి ఛాన్స్‌...

దుల్క‌ర్ స‌ల్మాన్ స్థానంలో థ‌గ్‌లైఫ్‌లో తెలుగు హీరోను తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో మ‌ణిర‌త్నం ఉన్న‌ట్లు స‌మాచారం. నానికి ఈ అవ‌కాశం ద‌క్క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌ణిర‌త్నం త‌న ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ అని నాని చాలా సంద‌ర్భాల్లో తెలిపాడు. అత‌డితో ఒక్క సినిమానైనా చేయాల‌న్న‌ది త‌న క‌ల అని పేర్కొన్నాడు.

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓకే బంగారం మూవీ తెలుగు వెర్ష‌న్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క్యారెక్ట‌ర్‌కు నాని డ‌బ్బింగ్ చెప్పాడు. అప్ప‌టి నుంచే మ‌ణిర‌త్నం, నాని కాంబోలో ఓ మూవీ ఉండ‌టం ఖాయ‌మ‌ని ప్ర‌చారం మొద‌లైంది. గ‌తంలో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన న‌వాబ్ సినిమాలో నాని ఓ హీరోగా క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కానీ ఏమైందో ఏమో ఈ కాంబినేష‌న్ మాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌రోసారి దుల్క‌ర్ రూపంలోనే నాని క‌ల నెర‌వేర‌బోతున్న‌ట్లు స‌మాచారం. థ‌గ్ లైఫ్ నుంచి దుల్క‌ర్ త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానాన్ని నాని రీప్లేస్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

35 ఏళ్ల త‌ర్వాత‌..,.

నాయ‌గ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత దాదాపు 35ఏళ్ల అనంత‌రం క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌ణిర‌త్నం క‌లిసి థ‌గ్ లైఫ్ మూవీ చేస్తున్నారు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు జ‌యంర‌వి, త్రిష‌, జోజు జార్జ్‌, గౌత‌మ్ కార్తిక్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టిస్తోన్న 234వ మూవీ ఇది. ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జ‌న‌వ‌రిలో థ‌గ్‌లైఫ్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. నెక్స్ట్ షెడ్యూల్‌ను సెర్బియాలో మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం.

ఇండియ‌న్ 2 రిలీజ్‌కు రెడీ...

ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ ఐదు సినిమాల్లో న‌టిస్తూ యంగ్ హీరోల‌కు గ‌ట్టిపోటీనిస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఇండియ‌న్ 2 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 1996లో రిలీజైన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఇండియ‌న్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. తెలుగులో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న క‌ల్కి 2898 ఏడీలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

WhatsApp channel