Driving License Movie: డ్రైవింగ్ లైసెన్స్ హీరో డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ - మలయాళం స్టార్‌కు షాకిచ్చిన పోలీసులు
Driving Licence Movie డ్రైవింగ్ లైసెన్స్ హీరో సూరజ్ వెరంజమూడుకు కేరళ పోలీసులతో పాటు మోటర్ వెహికిల్ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేశారు.
Driving Licence Movie: మలయాళంలో డ్రైవింగ్ లైసెన్స్ మూవీ విమర్శకుల ప్రశంసలతో కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు హీరోలుగా నటించిన ఈ మూవీ 2019 ఏడాదిలో మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఓ స్టార్ హీరోకు, మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్‌కు మధ్య ఈగో నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డ్రైవింగ్ లైసెన్స్ మూవీ తెరకెక్కింది.
మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌గా ...
ఇందులో మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌గా సూరజ్ వెంరజమూడు నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. కాగా సూరజ్ వెరంజమూడుకు కేరళ పోలీసులతో పాటు మోటార్ వెహికిల్ డిపార్ట్‌మెంట్ అధికారులు షాకిచ్చారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దుచేశారు. గత ఏడాది జరిగిన యాక్సిడెంట్‌లో సూరజ్ తప్పు ఉందని తేల్చిన అధికారులు అతడికి పనిష్‌మెంట్ విధించారు.
అతి వేగంగా కారును నడిపిన సూరజ్ బైక్‌పై వెళుతోన్న ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌పై దర్యాప్తు జరిపిన పోలీసులు సూరజ్‌దే తప్పు ఉందని తేల్చారు. పోలీసుల సూచనతో సూరజ్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మోటార్ వెహికిల్ డిపార్ట్‌మెంట్ క్యాన్సిల్ చేసింది.
సూరజ్ డైలాగ్స్ పాపులర్...
డ్రైవింగ్ లైసెస్స్‌లో రోడ్ సెఫ్టీ, రూల్స్ గురించి సూరజ్ చెప్పిన డైలాగ్స్ అప్పట్లో పాపులర్ అయ్యాయి. ఆ భద్రతల్ని విస్మరించినందుకు అతడి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ కావడం హాట్‌టాపిక్‌గా మారింది.
బాలీవుడ్ రీమేక్...
డ్రైవింగ్ లైసెన్స్ మూవీ హిందీలో సెల్ఫీ పేరుతో రీమేకైంది. ఈ బాలీవుడ్ రీమేక్‌లో అక్షయ్‌కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటించారు. మలయాళంలో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ హిందీలో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సెల్ఫీ మూవీ 20 కోట్లలోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలు భారీగా నష్టాలను మిగిల్చింది.
తెలుగు రీమేక్...
డ్రైవింగ్ లైసెన్స్ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ సినిమాలో బాలకృష్ణ, రవితేజ హీరోలుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు.
నటుడిగా సూరజ్ వెరంజమూడు మలయాళంలో వందకుపైగా సినిమాలు చేశాడు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా డిఫరెంట్ రోల్స్ చేశాడు. పెరారియాతావర్ అనే మూవీకిగాను బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. మూడు సార్లు బెస్ట్ యాక్టర్‌గా కేరళ స్టేట్ అవార్డులను దక్కించుకున్నది. నటుడిగానే మలయాలంలో నంబర్ వన్ టీవీ హోస్ట్‌గా సూరజ్ కొనసాగుతోన్నాడు. మలయాళంలో ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు సూరజ్.
టాపిక్