Goat Life Movie: 2008లో అనౌన్స్‌మెంట్‌- 2024లో రిలీజ్ -16 ఏళ్లు షూటింగ్ - పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ది గోట్ లైఫ్ రికార్డ్‌-prithviraj sukumaran the goat life records longest production time movie in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Goat Life Movie: 2008లో అనౌన్స్‌మెంట్‌- 2024లో రిలీజ్ -16 ఏళ్లు షూటింగ్ - పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ది గోట్ లైఫ్ రికార్డ్‌

Goat Life Movie: 2008లో అనౌన్స్‌మెంట్‌- 2024లో రిలీజ్ -16 ఏళ్లు షూటింగ్ - పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ది గోట్ లైఫ్ రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 09, 2024 09:52 AM IST

Goat Life Movie: స‌లార్ ఫేమ్ ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోట్ లైఫ్ మూవీ ఏప్రిల్ 10న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. కాగా ప‌ద‌హారేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్‌ను జ‌రుపుకుంది. 2008లో షూటింగ్ మొద‌లుకాగా...2024లో రిలీజ్ అవుతోంది.

ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోట్ లైఫ్ మూవీ
ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోట్ లైఫ్ మూవీ

Goat Life Movie: స‌లార్ త‌ర్వాత ది గోట్‌లైఫ్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 10న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో రిలీజ్ కాబోతోంది. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ది గోట్ లైఫ్ మూవీని అవార్డ్ఇవిన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందిస్తోన్నారు. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌తో పాటు హాలీవుడ్ యాక్ట‌ర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

90ల నాటి క‌థ‌...

1990వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను గా ది గోట్ లైఫ్ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా క‌థ మొత్తం ఎడారి బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఈ నేప‌థ్యంలో రూపొందుతోన్న‌ తొలి భారతీయ సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

2008లో షూటింగ్ మొద‌లు...

ది గోట్ టైఫ్ మూవీ దాదాపు 16 ఏళ్ల పాటు షూటింగ్‌ను జ‌రుపుకోవ‌డం గ‌మ‌నార్హం. 2008లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 2009లో ఈ మూవీని అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. కొంత భాగం షూటింగ్ జ‌రిపారు. బ‌డ్జెట్ ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల షూటింగ్ నిలిచిపోయింది. ఐదారేళ్ల పాటు మ‌రో ప్రొడ్యూస‌ర్ కోసం డైరెక్ట‌ర్ బ్లెస్సీ అన్వేషించాడు.

ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీని ప్రొడ్యూస్ చేయ‌డానికి నిర్మాత‌లు ఎవ‌రూ ముందుకు రాలేదు. దాంతో ఈ సినిమా నిర్మాణంలో హీరో పృథ్వీరాజ్‌సుకుమార‌న్‌తో పాటు హాలీవుడ్ యాక్ట‌ర్ జిమ్మీ జీన్ లూయిస్ భాగ‌మ‌య్యారు. వారితో పాటు డైరెక్ట‌ర్ బ్లెస్సీ కూడా ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ సినిమాను తెర‌కెక్కించాల‌ని ఫిక్స‌య్యారు.

ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ తొల‌గిపోవ‌డంతో ది గోట్‌లైఫ్ షూటింగ్‌ను తిరిగి 2018లో మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత కోవిడ్ అవాంత‌రాల కార‌ణంగా మ‌రో రెండేళ్లు ఈ మూవీకి బ్రేక్ వ‌చ్చింది. ఇలా అనేక ఎన్నో అవాంత‌రాల‌ను దాటుకొని ఎట్ట‌కేల‌కు ఈ మూవీ 2024 ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది.

ప‌ద‌హారేళ్లు షూటింగ్‌...

ది గోట్‌లైఫ్ షూటింగ్ దాదాపు ప‌ద‌హారేళ్ల పాటు సాగింది. 2008 లో అనౌన్స్ చేయ‌గా 2024లో రిలీజ్ అవుతోంది. ఇండియ‌న్‌ సినిమా ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక కాలం షూటింగ్‌ను జ‌రుపుకోన్న మూవీగా ది గోట్‌లైఫ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ది గోట్‌లైఫ్‌లో కేఆర్ గోకుల్‌తో పాటు అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ది గోట్ లైఫ్ తెర‌కెక్కుతోంది.

ప్ర‌భాస్ స్నేహితుడిగా..

ది గోట్‌లైఫ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల ప్ర‌భాస్‌తో పాటు ర‌ణ్‌వీర్‌సింగ్‌, దుల్క‌ర్ స‌ల్మాన్ రిలీజ్ చేశారు. స‌లార్ మూవీలో ప్ర‌భాస్ స్నేహితుడిగా కీల‌క పాత్ర‌లో న‌టించారు పృథ్వీరాజ్‌సుకుమార‌న్‌. వ‌ర‌ద‌రాజ మ‌న్నార్‌గా త‌న లుక్‌, యాక్టింగ్‌తో అభిమానుల‌ను మెప్పించాడు.

డిసెంబ‌ర్ 22న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ 700 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. స‌లార్‌కు సీక్వెల్ రాబోతోంది. శౌర్యంగ‌ప‌ర్వం పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తోన్నారు. స‌లార్‌లో పాజిటివ్ రోల్‌లో క‌నిపించిన పృథ్వీరాజ్ సుకుమార‌న్ సీక్వెల్‌లో మాత్రం విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.