Important Player in Team India: టీమిండియాలో అతడే కీలకమైన ఆడగాడని కార్తిక్ వెల్లడి.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్-dinesh karthik says hardik pandya is most important player in odi world cup
Telugu News  /  Sports  /  Dinesh Karthik Says Hardik Pandya Is Most Important Player In Odi World Cup
దినేశ్ కార్తిక్
దినేశ్ కార్తిక్ (PTI)

Important Player in Team India: టీమిండియాలో అతడే కీలకమైన ఆడగాడని కార్తిక్ వెల్లడి.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్

26 March 2023, 14:35 ISTMaragani Govardhan
26 March 2023, 14:35 IST

Important Player in Team India: టీమిండియాలో అత్యంత కీలకమైన ఆటగాడు హార్దిక్ పాండ్యానే అని టీమిండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ తెలిపాడు. అతడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు చెప్పకపోవడం గమనార్హం.

Important Player in Team India: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓడిపోయిన తర్వాత టీమిండియా ఐపీఎల్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం భారత ఆటగాళ్లందరూ తమ తమ ఫ్రాంఛైజీలతో చేరిపోయారు. ఐపీఎల్ 2023 సీజన్ కోసం అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. రెండు నెలల పాటు ఈ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు బిజీగా ఉండనున్నారు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి సారించనుంది భారత్. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రపంచకప్‌ జట్టు గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు. వన్డే ప్రపంచకప్‌ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడెవరో తెలిపాడు. హార్దిక్ పాండ్య జట్టులోనే కాకుండా వరల్డ్ కప్‌లోనూ అత్యంత కీలకమైన ఆటగాడని అన్నాడు.

"నిస్సందేహంగా భారత లైనప్‌లో హార్దిక్ పాండ్య అత్యంత ముఖ్యమైన ఆటగాడు. ఎందుకంటే అతడు రెండు రకాలుగా ఉపయోగపడతాడు. క్లిష్టపరిస్థితుల్లోనూ తన నైపుణ్యంతో ఆకట్టుకుంటాడు. అలాంటి బ్యాటింగ్ ఆల్ రౌండర్‌ను పొందడం చాలా కష్టం. ఇద్దరు, ముగ్గరు ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ వారు స్పిన్ ఆల్ రౌండర్లు. కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లను పొందడం చాలా కష్టం" అని దినేశ్ కార్తిక్ అన్నాడు.

"ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో హార్దిక్ బాగా ఆడాడని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు. అతడు మధ్యలో బాగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్ విషయానికొస్తే వికెట్ల ఎలా తీయాలో అతడు కనుగొన్నాట్లు అనిపిస్తుంది. అతడు బౌలింగ్ చేసే విధానం గమనిస్తే ఎప్పుడూ షార్ట్ బంతుల కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేయడం ఎప్పుడైతే ప్రారంభించాడో బ్యాటర్ తన భారమంతా బ్యాక్ ఫుట్‌పై పెట్టి షార్ట్ బంతుల కోసం చూస్తుంటాడు. ఆ సమయంలో నిదానంగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అదే విధానంలో మిచెల్ మార్ష్‌ను హార్దిక్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్‌ను పుల్ షాట్ కొట్టేలా చేసి పెవిలియన్ చేర్చాడు." అని దినేశ్ కార్తిక్ వివరించాడు.

ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌పై ఫోకస్ పెట్టాడు. మార్చి 31న ఆరంభం కానున్న ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది. గతేడాది గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ ఆరంభ సీజన్‌లో తన టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.