Charmme on Liger Failure: లైగర్ డిజాస్టర్‌పై ప్రొడ్యూసర్ ఛార్మీ రియాక్షన్ ఇదీ
Charmme on Liger Failure: లైగర్ డిజాస్టర్‌పై ప్రొడ్యూసర్ ఛార్మీ స్పందించింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు తొలి రోజే నెగటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
Charmme on Liger Failure: ఈ ఏడాది మచ్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ లైగర్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లాంటి క్రేజీ కాంబినేషన్.. భారీ బడ్జెట్.. అదిరిపోయిన ప్రమోషన్లు.. వీటన్నింటినీ చూస్తే లైగర్ రికార్డులు బద్ధలు కొడుతుందా అనిపించింది.
కానీ తొలి రోజు నుంచే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. ఈ నెల 25న రిలీజైన ఈ సినిమా ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. అయినా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా తమ సినిమా రూ.33 కోట్లు వసూలు చేసినట్లే మేకర్స్ ప్రకటించారు. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్లపై నెగటివ్ టాక్ ప్రభావం పడింది. తొలి వీకెండ్ ముగిసే సమయానికి లైగర్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది.
రూ.200 కోట్లతో తెరకెక్కిన మూవీగా నిలిచిన లైగర్ ఫెయిల్యూర్‌పై ప్రొడ్యూసర్లలో ఒకరైన ఛార్మీ కౌర్ స్పందించింది. అయితే నేరుగా లైగర్ ఫెయిల్యూర్‌పై కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితిపై మాట్లాడింది. ఇది ఒక భయానక, తీవ్రంగా నిరుత్సాహపరిచే పరిస్థితి అని ఛార్మీ అనడం విశేషం. ప్రస్తుతం ప్రేక్షకులకు ఓటీటీల్లో సులువుగా మంచి కంటెంట్ దొరుకుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లను థియేటర్లకు తీసుకురావాలంటే ఎంతో ఉత్తేజపరిచే కంటెంట్ ఉంటేనే సాధ్యమని అభిప్రాయపడింది.
"ఇంట్లో కూర్చొనే ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ చూసే అవకాశం ప్రేక్షకులకు ఉంది. టీవీల్లోనే పెద్ద బడ్జెట్ సినిమాలను కుటుంబం మొత్తంతో కలిసి చూసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఎక్సైటింగ్ కంటెంట్ ఉంటే తప్ప థియేటర్లకు రావడం లేదు. కానీ బాలీవుడ్‌లో ఆ పరిస్థితి లేదు. ఆగస్ట్‌లో తెలుగులో బింబిసార, సీతారామం, కార్తికేయ 2 మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. ఇవన్నీ కలిపి రూ.150 నుంచి రూ.170 కోట్లు వసూలు చేశాయి. అలాగని సౌత్‌లో సినిమా పిచ్చోళ్లు ఎక్కువని చెప్పలేం" అని ఫ్రీ ప్రెస్ జర్నల్‌తో ఛార్మీ చెప్పింది.
ఇక తమ మూవీ లైగర్ ఎప్పుడో 2020, జనవరిలోనే ఫస్ట్ షెడ్యూల్ మొదలైనా.. రిలీజ్ మాత్రం 2022లో అయిందని, ఈ ఆలస్యం వెనుక కరోనా ప్రధాన కారణమని ఆమె తెలిపింది. ఈ ఏడాది మొదట్లో పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో తమ బాధ్యతగా లైగర్ రిలీజ్‌ను మరింత ఆలస్యం చేసినట్లు ఛార్మీ వెల్లడించింది.
సంబంధిత కథనం