Karthikeya 2 Box Office Collection :100 కోట్ల క్లబ్‌లో కార్తికేయ..తెలుగు సినిమా విజయమని నిఖిల్ ఎమోషనల్-karthikeya 2 movie join in 100 crores collections and celebration in kurnool ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Karthikeya 2 Movie Join In 100 Crores Collections And Celebration In Kurnool

Karthikeya 2 Box Office Collection :100 కోట్ల క్లబ్‌లో కార్తికేయ..తెలుగు సినిమా విజయమని నిఖిల్ ఎమోషనల్

Maragani Govardhan HT Telugu
Aug 27, 2022 06:54 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా వంద కోట్ల క్లబ్‌లో జాయిన్ అయింది. ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. వంద కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా చిత్రబృందం కర్నూలులో విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది.

నిఖిల్ ప్రసంగం
నిఖిల్ ప్రసంగం (Twitter)

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు నిరాజనాలు పడుతున్నారు. ఫలితంగా ఈ చిత్రం కొద్ది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్రబృందం కర్నూలులో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భాజపా నేత టీజీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మాట్లాడిన నిఖిల్ సినిమా విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

"బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు. కార్తికేయ 2 హిందీలో డబ్ అయి ఉత్తరాదిన విడుదలవుతుందంటే నాకు భయమేసింది. నిఖిల్ ఏంటి బాలీవుడ్‌కు వెళ్లడమేంటని నాలాగే మీరూ అనుకున్నారు కదా. కానీ విడుదలయ్యాక పరిస్థితి మారింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 1200 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. ఇది కార్తికేయ 2 విజయం కాదు.. తెలుగు సినిమా విజయం. సినిమా అంటే బాక్సాఫీస్ నెంబర్లు కాదని, ఓ ఎమోషన్. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నాకు రూ.100 కోట్లతో సమానం." అని నిఖిల్ ఎమోషనల్ అయ్యారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 తో తనకు గుర్తుండిపోయే పాత్రగా నిలిచిందని స్పష్టం చేసింది. "2014లో నా స్నేహితురాలు నా ఫొటోలను ఆడిషన్‌కు పంపింది. అనుకోకుండా ఆ సినిమాకి ఎంపికయ్యాను. ఆ చిత్రమే ప్రేమమ్. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. 2017లో శతమానం భవతి సినిమాతో మళ్లీ నన్ను ఆదరించారు. వాటి తర్వాత నా సినిమా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర కార్తికేయ 2 చిత్రంతో దక్కింది. ఇందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా" అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.

చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం పాన్ఇండియా రేంజ్‌లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్