Sitaramam Ott Release date: సీతారామం ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుందంటే...-amazon prime acquires ott rights for dulquer salmaan sitaramam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Amazon Prime Acquires Ott Rights For Dulquer Salmaan Sitaramam

Sitaramam Ott Release date: సీతారామం ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుందంటే...

Nelki Naresh Kumar HT Telugu
Aug 05, 2022 03:41 PM IST

Sitaramam Ott Release date: దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సీతారామం (Sitaramam) సినిమా ఏ ఓటీటీలో ఎప్ప‌డూ రిలీజ్ కానుందంటే...

దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్
దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ (TWITTER)

Sitaramam Ott Release date: దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన సీతారామం సినిమా ఫీల్‌గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తోంది. దేశ‌భ‌క్తికి ప్రేమ‌క‌థ‌ను జోడించి ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను తెర‌కెక్కించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించింది. నాయ‌కానాయిక‌ల ప్రేమ‌కు వార‌ధిగా నిలిచే కీల‌క మైన పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించింది.

కాగా seetharamam ott రైట్స్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద‌క్కించుకున్న‌ది. దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమాల‌కు తెలుగు,త‌మిళం,మ‌ల‌యాళ భాష‌ల్లో ఆద‌ర‌ణ ఉండ‌టంతో భారీ రేట్ కు అమెజాన్ ప్రైమ్ సీతారామం ఓటీటీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న‌ట్లు చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీ (seetharamam ott release date) లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ సీతారామం మూవీ నిర్మించారు. మ‌హాన‌టి త‌ర్వాత వైజంయ‌తీ బ్యాన‌ర్ లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన సినిమా ఇది. హీరో సుమంత్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర‌లో కనిపించారు.

సీతారామం హిట్ టాక్ సంపాదించి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం