Netizens troll on Liger: లైగర్‌పై ఫుల్ ట్రోల్.. పూరితో ఇంకో సినిమా చేయవద్దని విజయ్‌కు సూచన
లైగర్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఇందులో హీరోగా చేసిన విజయ్ దేవరరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమందైతే పూరితో మరో సినిమా చేయవద్దని సూచిస్తున్నారు.
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా సినిమాపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. దీంతో పూరి దర్శకత్వంలో విజయ్ తర్వాత చేయనున్న జనగణమణ(జేజీఎం) చేయవద్దని ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
లైగర్‌కు విడుదలైన తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో క్రాస్ బ్రీడ్ కాస్త భారీ డిజాస్టర్‌గా మారింది. విజయ్ కెరీర్‌లోనే కాకుండా పూరికే అత్యంత దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో విజయ్‌తో పాటు పూరి జగన్నాథ్‌పై కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ రూపంలో విభిన్నంగా స్పందిస్తున్నారు.
కొంతమంది విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్.. పూరి జగన్నాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడితో జనగణమణ అనే సినిమా చేయవద్దని సూచిస్తున్నారు. పూరి దర్శకత్వంలో ఇంక పనిచేయవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తయింది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేయనున్న జేజీఎం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ పాన్ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన నటీ, నటులు, సాంకేతిక నిపుణులు కూడా రెడీ అయ్యారు. ఈ సినిమాను కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లితన శ్రీకర స్టూడియోస్ ద్వారా ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు. ఈ సినిమాను 2023 ఆగస్టు 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
సంబంధిత కథనం