Fantasy Action OTT: ఓటీటీలోకి తెలుగు ఫాంటసీ యాక్షన్ మూవీ - ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే?
Fantasy Action OTT: అల్లు శిరీష్ బడ్డీ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Fantasy Action OTT: అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ మూవీ థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
తమిళ రీమేక్...
తమిళ మూవీ టెడ్డీ రీమేక్‌గా బడ్డీ సినిమా తెరకెక్కింది. శాంట్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో అల్లు శిరీష్‌కు జోడీగా గాయత్రి భరద్వాజ్, ప్రీషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఫాంటసీ మూవీతోనే వీరిద్దరు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ విలన్ పాత్రలో కనిపించాడు. తమిళ అగ్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ తెలుగు సినిమాను ప్రొడ్యూస్ చేయడం గమనార్హం.
రెండేళ్ల గ్యాప్ తర్వాత...
బడ్డీతో రెండేళ్ల గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాక్షన్ కథతో హిట్టు కొట్టాలని అనుకున్న అల్లు శిరీష్ ప్రయత్నం అంతగా ఫలించలేదు. ఈ సినిమా టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్స్‌లో 99గా, మల్టీప్లెక్స్‌లో 125కి తగ్గిస్తూ రిలీజ్ చేశారు. ఆ ప్లాన్ కూడా అంతగా వర్కవుట్ కాలేదు.
నాలుగున్నర కోట్లకు వచ్చింది ఎంతంటే?
దాదాపు నాలుగున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బడ్డీ మూవీ రిలీజైంది. నెగెటివ్ టాక్ కారణంగా థియేటర్లలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు గ్రాస్, కోటి యాభై లక్షల లోపు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు మూడు కోట్ల వరకు నష్టాలను తెచ్చిపెట్టింది. బడ్డీ సినిమా నైజాంలో 55 లక్షలు, ఆంధ్రాలో 50 లక్షల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
ఓవర్‌సీస్‌లో 10 లక్షల లోపే వసూళ్లను రాబట్టి డిసపాయింట్ చేసింది. ఫస్ట్ వీక్‌లోనే థియేటర్లలో కనిపించకుండాపోయింది. కాన్సెప్ట్ బాగున్నా..ఎమోషన్స్, లవ్‌స్టోరీని దర్శకుడు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడంతో సినిమా ఫెయిల్యూర్‌కు కారణమైంది. తమిళ ఒరిజినల్ టెడ్డీ కొవిడ్ కారణంగా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాగా...బడ్డీ మాత్రం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తొలుత సందీప్‌కిషన్‌ను హీరోగా ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల అతడు తప్పుకోవడం అల్లు శిరీష్‌తో బడ్డీ సినిమాను మేకర్స్ తెరకెక్కించారు. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించాడు.
బడ్డీ కథ ఇదే...
ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలెట్. ఎయిర్‌లైన్స్‌లోనే పనిచేసే పల్లవిని (గాయత్రి భరద్వాజ్) ఆదిత్య ప్రేమిస్తాడు. ఆ విషయం చెప్పడానికి ఇబ్బందులు పడుతుంటాడు. పల్లవి కూడా ఆదిత్యను ఇష్టపడుతుంది. అనుకోకుండా పల్లవి కారణంగా ఆదిత్య ఉద్యోగం పోతుంది.
ఆదిత్యకు క్షమాపణ చెప్పడమే కాకుండా తన మనసులోని ప్రేమను అతడికి వ్యక్తం చేయాలని అనుకుంటున్న టైమ్‌లోనే పల్లవి మిస్సవుతుంది.పల్లవి ఏమైంది? పల్లవి మిస్సింగ్‌కు డాక్టర్ అర్జున్‌కుమార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? పల్లవి ఆత్మ ఓ టెడ్డీ బేర్‌లోకి ఎలా వచ్చింది? అనే పాయింట్‌తో టెడ్డీ తెరకెక్కడం గమనార్హం.