RRR Movie: ఆర్ఆర్ఆర్ చిత్రంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా ప్రశంసల వర్షం: వీడియో.. స్పందించిన రాజమౌళి-brazil president lula praises rrr movie ss rajamouli responds ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Movie: ఆర్ఆర్ఆర్ చిత్రంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా ప్రశంసల వర్షం: వీడియో.. స్పందించిన రాజమౌళి

RRR Movie: ఆర్ఆర్ఆర్ చిత్రంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా ప్రశంసల వర్షం: వీడియో.. స్పందించిన రాజమౌళి

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 10, 2023 04:40 PM IST

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాపై బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వ ప్రశంసల వర్షం కురిపించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనికి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా స్పందించారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ చిత్రంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా ప్రశంసల వర్షం: వీడియో.. స్పందించిన రాజమౌళి (Photo: Twitter)
RRR Movie: ఆర్ఆర్ఆర్ చిత్రంపై బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా ప్రశంసల వర్షం: వీడియో.. స్పందించిన రాజమౌళి (Photo: Twitter)

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయింది. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్.. చాలా దేశాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించిన తీరు హాలీవుడ్‍ దిగ్గజాలను కూడా ఆకట్టుకుంది. చాలా దేశాలకు చెందిన ప్రేక్షకులను ఆర్ఆర్ఆర్ చిత్రం విపరీతంగా ఆలరించింది. కాగా, బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డసిల్వ తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. జీ20 సదస్సు కోసం ఇండియాకు వచ్చిన ఆయన ఈ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‍గా మారింది. వివరాలివే..

ఆర్ఆర్ఆర్ చిత్రం చూశారా అని తాను అందరినీ అడుగుతున్నానని, తనకు అంతలా ఆ సినిమా నచ్చిందని బ్రెజిల్ అధ్యక్షుడు లులా అన్నారు. మీరు చూసిన ఇండియన్ సినిమా గురించి చెప్పాలని యాంకర్ అడుగగా.. లులా స్పందించారు. ఆర్ఆర్ఆర్ గురించి చెప్పారు. “ఆర్ఆర్ఆర్.. ఇది మూడు గంటల ఫీచర్ ఫిల్మ్. చాలా మంచి సన్నివేశాలు, అందమైన డ్యాన్స్ ఆ సినిమాలో ఉన్నాయి. ఇండియాపై, భారతీయులపై బ్రిటిషర్ల నియంత్రణ గురించి ఆ సినిమా లోతుగా విమర్శించింది. అయితే దాన్ని సరైన రీతిలో అర్థవంతంగా చూపించడంతో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయింది. ఎవరినైనా కలిస్తే నేను ముందుగా.. మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చూశారా అని అడుగుతున్నా. రాజకీయ విషయాలతో పాటు సినిమాలో చూపించిన డ్యాన్స్, జాయ్ చాలా బాగుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు, డైరెక్టర్‌కు అభినందనలు చెబుతున్నా” అని బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బ్రెజిల్ అధ్యక్షుడి ప్రశంసలకు ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి స్పందించారు. “సర్ ధన్యవాదాలు. దయతో కూడిన మీ వ్యాఖ్యలకు చాలా థాంక్యూ. భారతీయ సినిమాను ప్రస్తావించడం, ‘ఆర్ఆర్ఆర్’ను ఎంజాయ్ చేశానని మీరు చెప్పడంతో నా హృదయం ఉప్పొంగుతోంది. మా టీమ్ పరవశించిపోతోంది. మా దేశంలో మీరు అద్భుతంగా సమయం గడపాలని కోరుకుంటున్నా” అని రాజమౌళి ట్వీట్ చేశారు. జీ20 సదస్సు కోసం ఇండియాకు వచ్చారు లులా.

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఏకంగా ఆరు జాతీయ అవార్డులను దక్కించుకుంది.