Brahmamudi August 22nd Episode: బ్రహ్మముడి- రుద్రాణిని మించిన ధాన్యలక్ష్మీ ప్లాన్- రాజ్ మాస్టర్ స్కెచ్- అప్పుకు అవమానం-brahmamudi serial august 22nd episode indradevi seetharamaya plea rudrani dhanyalaxmi plan brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 22nd Episode: బ్రహ్మముడి- రుద్రాణిని మించిన ధాన్యలక్ష్మీ ప్లాన్- రాజ్ మాస్టర్ స్కెచ్- అప్పుకు అవమానం

Brahmamudi August 22nd Episode: బ్రహ్మముడి- రుద్రాణిని మించిన ధాన్యలక్ష్మీ ప్లాన్- రాజ్ మాస్టర్ స్కెచ్- అప్పుకు అవమానం

Sanjiv Kumar HT Telugu
Aug 22, 2024 07:26 AM IST

Brahmamudi Serial August 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్, అప్పులను వ్రతానికి పిలవడానికి సీతారామయ్య, ఇందిరాదేవి రామబాణం వేస్తారు. మరోవైపు అప్పు సరైనా కోడలు కాదని నిరూపించేందుకు రుద్రాణిని మించిపోయి మరి ప్లాన్ వేస్తుంది ధాన్యలక్ష్మీ. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఇంట్లో వ్రతానికి అప్పు, కల్యాణ్‌ను పిలవాలని అనుకుంటున్నట్లు ఇందిరాదేవి, సీతారామయ్య అంటారు. ఇంకా ఎవరికో ఇష్టం లేనట్టుంది అని కావ్యను చూస్తూ అంటాడు రాజ్. దాంతో రుద్రాణిపై సెటైర్ వేస్తుంది స్వప్న. నేను చెప్పేది కరివేపాకు గురించి కాదు కళావతి గురించి అని రాజ్ అంటాడు.

మీ ఇంకో చెల్లి రావడం మీ చెల్లికి ఇష్టం లేనట్టుంది అని రాజ్ అంటాడు. మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు. తాతయ్య, అమ్మమ్మ ఒక నిర్ణయం తీసుకున్నాకా ఎవరైనా ఆక్షేపిస్తారా. కానీ, వాళ్లు ఇంటికి రావడం నేనే కారణం అని ఏమైనా అంటే అని కావ్య అంటుంటే.. దుమ్ము దులిపేయ్.. కావాలంటే బూజు కర్ర నేను ఇస్తాను అని అపర్ణ అంటుంది. సరే అందరం కలుస్తున్నాం వాళ్ల అమ్మ నాన్నలను కూడా పిలుద్దామని ప్రకాశం అంటాడు.

నువ్వే వెళ్లి పిలువు

వాళ్లంతా ఎందుకుని ధాన్యలక్ష్మీ అంటే.. వాళ్లు ఇద్దరే అని ప్రకాశం అంటాడు. మా వియ్యంకుల్లాగే వస్తారని అపర్ణ అంటే.. మా వాళ్లను వియ్యంకులుగా అస్సలు ఒప్పుకోలేరు అని స్వప్న అంటుంది. వియ్యంకులతో కయ్యాలు పెట్టుకోడానికి సరిపోతుంది అని ప్రకాశం అంటాడు. అయినా వాడు వస్తాడంటారా అని ధాన్యలక్ష్మీ అంటే.. నువ్వే వెళ్లి పిలుపు అని అపర్ణ అంటుంది. అమ్మో నేను వెళ్లి పిలవలేను అని ధాన్యం అంటుంది.

అయితే ఈ వ్రతం జరగనట్లే అని రుద్రాణి అంటుంది. అంతా కలిసి ఉందామంటే జరగదని అంటావేంటీ అని స్వప్న ఫైర్ అవుతుంది. వాళ్లను ఎవరు తీసుకొస్తారు. మరి నువ్ నీ చెల్లి పిలవండి అని రుద్రాణి అంటుంది. ఎందుకు మమ్మల్ని నువ్వు ధాన్యలక్ష్మీ కలిసి దుమ్మెత్తిపోయడానికా.. మీకు ఆ అవకాశం ఇవ్వం అని స్వప్న అంటుంది. ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను చిట్టి వెళ్లి పిలుచుకొస్తాం అని సీతారామయ్య అంటాడు.

మీరు మనవడి కోసం ఒక మెట్టు దిగి పిలవడం నాకు చాలా సంతోషంగా ఉందని ధాన్యలక్ష్మీ అంటుంది. ధాన్యం ఏంటీ మంచితనంలో ముంచి తీసినట్లు మాట్లాడుతుంది అని రుద్రాణి డౌట్ పడుతుంది. కనకంకు కావ్య కాల్ చేస్తుంది. ఉన్న ముగ్గురు కూతుళ్లు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. ఇక్కడ అనాథళ్లా పడి ఉన్నాం. పైగా అప్పు టెన్షన్ ఒకటి అని కనకం అంటుంది. అయితే తర్వాత చేస్తాను. ఇదివరకే ఒక టెన్షన్‌లో ఉన్నావ్. రెండో టెన్షన్ ఎందుకులే అని కావ్య అంటుంది.

అపర్ణ ఆర్డర్

ఏమైందని కనకం కంగారుపడుతుంది. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారు. దాన్ని ముగ్గురు కోడళ్లతో జరిపించాలని అనుకుంటున్నట్లు చెబుతుంది కావ్య. దాంతో కనకం మరింత భయపడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని కంగారుపడుతుంది. అమ్మమ్మ తాతయ్య నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని కూడా పిలవడానికే నేను కాల్ చేశాను అని కావ్య అంటుంది. ఇదే చాలదు అంటే మళ్లీ మేమెందుకే అని కనకం అంటుంటే అపర్ణ ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది.

రేపు లక్ష పనులు ఉన్నా వ్రతానికి వచ్చేయండి. అంతా ఇక్కడ మాట్లాడుకుందాం అని అపర్ణ కాల్ కట్ చేస్తుంది. అప్పును కోడలుగా ఒప్పుకుంటున్నారేమో అని కృష్ణమూర్తి అంటాడు. పెళ్లి రోజు ధాన్యలక్ష్మీ ఎంత గొడవ చేసిందో చూశావ్. అంత సులువుగా ఒప్పుకోదు. అప్పుకు అసలే ఆవేశం ఎక్కువ. ధాన్యలక్ష్మీ ఏమైనా అంటే.. రేపు నాకు టైఫాయిడ్ అన్ని ఫీవర్స్ వచ్చేలా ఉన్నాయి అని కనకం తెగ భయపడిపోతుంది. మరోవైపు నీది ఎంత పెద్ద మనసు. మా అమ్మ అడిగింది అని వాళ్లను ఇంటికి రమ్మన్నావ్ అని ధాన్యలక్ష్మీతో రుద్రాణి అంటుంది.

దాన్ని ఇంటికి రమ్మనేసరికి అప్పును కోడలిగా ఒప్పుకున్నాను అనుకుంటున్నారా. అలా ఎప్పుడు జరగదు. అప్పు రాని వచ్చాక అది కోడలిగా పనికిరాదని ఇంట్లో వాళ్లకు రుజువు చేస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. అమ్మా ఇదా నీ ప్లాన్. ఇంకా ఎక్కడ మారిపోయావో అని కంగారుపడ్డాను అని మనసులో అనుకున్న రుద్రాణి నువ్ అనుకుంటే సరిపోతుందా. ఇక్కడ అందరూ వాళ్లకే సపోర్ట్‌గా ఉన్నారు. నువ్వు నేను ఏం చేస్తామని అంటుంది.

నన్నే మించిపోయావ్ ధాన్యం

అందుకే నువ్వెళ్లి కొంతమంది ముత్తైదువులను తీసుకురా. ఇంట్లో వాళ్ల ముందు అవమానం జరిగితే సర్దుకుపోతారు. అదే బయటవాళ్లందరి ముందు తను కోడలుగా పనికిరాదని నిరూపిస్తే ఆలోచిస్తారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. అమ్మా ధాన్యలక్ష్మీ నీకు ఎన్ని తెలివితేటలు. నువ్ నన్నే మించిపోయావ్ అని రుద్రాణి అంటుంది. పొగడటం ఆపి చెప్పింది చేయు అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. దాంతో నవ్వేసుకుంటుంది రుద్రాణి.

మరోవైపు రాత్రి డాబాపై అప్పు, కల్యాణ్ ఎదురెదురు తిరిగి సరదాగా గడుపుతారు. కల్యాణ్ పక్కకు జరగడంతో కల్యాణ్ ఒళ్లో పడుతుంది అప్పు. దాంతో నన్నే పడేస్తావా అని కల్యాణ్‌తో అప్పు లవ్ ఫైట్ చేస్తుంది. అప్పుడే వచ్చి అదంతా చూసిన ఇందిరాదేవి సీతారామయ్య నవ్వుకుంటారు. ఏంటీ బలబలాలు తేల్చుకుంటున్నారా అని ఇందిరాదేవి అంటుంది. వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు కల్యాణ్, అప్పు. ఉన్నట్టుండి ఇలా వచ్చారేంటీ అని కల్యాణ్ అడుగుతాడు.

మీ ఆత్మగౌరవాన్ని మేము గౌరవిస్తాం. మిమ్మల్ని శాశ్వతంగా తీసుకెళ్లడానికి ఒప్పించేందుకు మేము రాలేదు. రేపు శ్రావణ శుక్రవారం, వ్రతం చేయిస్తున్నాం. మీరు రండి అని ఇందిరాదేవి అంటుంది. దాంతో నవ్వేసిన కల్యాణ్ వ్రతమా.. అప్పుతోనా. తనకు అది సూట్ కాదు. కావ్య వదినతో చేయించండి అని కల్యాణ్ అంటాడు. రానని చెప్పలేక ఇలా అంటున్నావా అని ఇందిరాదేవి అంటుంది. నువ్ వేరు కాపురం పెట్టావ్. పండుగలకు, పబ్బాలకు రాకుంటే ఎలా. దేనికైనా పట్టు విడుపు ఉండాలి కదా అని సీతారామయ్య అంటాడు.

ఎదురుచెబుతావా

మీ అమ్మకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కుటుంబంతోనే బంధాలు తెంచుకుంటావా అని ఇందిరాదేవి అంటుంది. ఏరా మేము ఇంకా వయసై మంచంపై పడిన చూడటానికి కూడా రావా అని సీతారామయ్య అంటుంది. తాతయ్య అవేం మాటలు. అక్కడికి వస్తే నన్ను అన్న పర్వాలేదు. కానీ, అప్పును అంటారు అని కల్యాణ్ అంటాడు. నన్ను అంటారని తాతయ్య, అమ్మమ్మకు ఎదురుచెబుతావా అని అప్పు అంటుంది. చూశావా అప్పు ఒప్పుకున్నట్లే అని ఇందిరాదేవి అంటుంది.

మీ అమ్మే కదారా అంటే పడు. వచ్చి భోజనం చేసి వచ్చేయండి అని ఇందిరాదేవి అంటుంది. మీ ఇద్దరు వచ్చి రామబాణం వేశారు. దానికి తిరుగు ఉంటుందా. ఎవరు పిలిస్తే మేము వస్తామే వాళ్లే వచ్చారు. వస్తాం తాతయ్య. మీ మాటకు గౌరవం వచ్చి మేము వస్తాం అని కల్యాణ్ అంటాడు. రేపు అంతా కలిసి భోజనం చేద్దామని ఇందిరాదేవి చెబుతుంది. ఇందిరాదేవి, సీతారామయ్య ఇద్దరూ వెళ్లిపోతారు. కారు వరకు అని కల్యాణ్ అప్పు వెళ్తారు.

మరోవైపు చమ్కీలా అంగిలేసి పాట పెట్టుకుని సంతోషంగా డ్యాన్స్ చేస్తాడు రాజ్. అది కావ్య చూస్తుంది. దాంతో పాట ఆపి రేపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశావా. అన్నింట్లో నాకు క్లారిటీ ఉండాలి ఒక్కోటి అడుగుతాడు రాజ్. అన్ని చేసినట్లు కావ్య చెబుతుంది. పూజ అయ్యాక మా కాళ్లు మొక్కుతారు కదా అని రాజ్ అంటే.. మీ ఆరోగ్యం కోసం మేము పూజ చేస్తే కేవలం మీకు అదే కనిపించిందా. పురుషాహంకారం అని కావ్య అంటుంది. ఈ కోపం ఇక్కడిది కాదు కదా. కల్యాణ్ రావడం నీకు ఇష్టం లేదు కదా అని రాజ్ అంటాడు.

రాజ్ మాస్టర్ స్కెచ్

నాకెందుకు ఇష్టం లేదు. మా చెల్లి కూడా వస్తుంది కదా అని కావ్య అంటుంది. ఈ నటించడం చిన్నపిల్లల దగ్గర నటించు. అయినా నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా. రేపు పూజ కోసం మాత్రమే కల్యాణ్ వాళ్లు రావట్లేదు. వచ్చేవాళ్లు తిరిగి వెళ్లరు అని రాజ్ చెబుతాడు. దాంతో షాక్ అయిన కావ్య కవిగారు ఎలా ఒప్పుకుంటారు అని కావ్య అడుగుతుంది. అది నీ మట్టిబుర్రకు అర్థం కాదు. ఈ రాజ్ వేసిన మాస్టర్ ప్లాన్ రేపు చూడు. ఇక గుడ్ నైట్ అని రాజ్ పడుకుంటాడు.

రేపు ఈయన వాళ్లను ఇంటికి తీసుకొస్తానను ఇంట్లో పెద్ద సునామీ తెచ్చేలా ఉన్నారు. రేపు ఏం జరుగుతుందో అని కావ్య భయపడుతుంది. మరోవైపు కల్యాణ్ దగ్గరికి వచ్చిన అప్పు ఏమైంది. నిద్రపోకుండా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. రేపు పూజ గురించే టెన్షన్ పడుతున్నాను. తాతయ్య, నానమ్మ ఎంత కంట్రోల్ చేసిన మా అమ్మ, రుద్రాణి అత్తయ్య ఏదో ఒక రూపంలో గొడవ పుట్టిస్తారు. నిన్ను అవమానిస్తారు అని కల్యాణ్ చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

అప్పుకు అవమానం

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో పూజకు అప్పు కల్యాణ్ వస్తారు. హారతి ఇవ్వమని ధాన్యలక్ష్మీకి ఇందిరాదేవి చెబుతుంది. వచ్చేది పూజకని తెలుసుకదా. పబ్బుకో పార్టీకో వచ్చినట్లు ఇలా వచ్చావేంటీ. ఇప్పుడు హారతి పట్టి బొట్టు పెడితే పెట్టించుకుంటుందా అని అప్పును రుద్రాణి అవమానిస్తుంది.