Brahmamudi August 16th Episode: బ్రహ్మముడి- రోడ్డుమీద పడ్డ కల్యాణ్- రుద్రాణిపై రాజ్ ఫైర్- రాజ్ బాధ్యతలు గోవిందా!-brahmamudi serial august 16th episode raj kavya conflict kalyan sells toys dhanyalaxmi fire brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 16th Episode: బ్రహ్మముడి- రోడ్డుమీద పడ్డ కల్యాణ్- రుద్రాణిపై రాజ్ ఫైర్- రాజ్ బాధ్యతలు గోవిందా!

Brahmamudi August 16th Episode: బ్రహ్మముడి- రోడ్డుమీద పడ్డ కల్యాణ్- రుద్రాణిపై రాజ్ ఫైర్- రాజ్ బాధ్యతలు గోవిందా!

Sanjiv Kumar HT Telugu
Aug 16, 2024 09:04 AM IST

Brahmamudi Serial August 16th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 16వ తేది ఎపిసోడ్‌లో రోడ్డుపై కల్యాణ్ బొమ్మలు అమ్ముతుంటాడు. దాన్ని ధాన్యలక్ష్మీకి రుద్రాణి చూపిస్తుంది. అది చూసి కావాలనే ఎక్కిస్తుంది రుద్రాణి. దాంతో ధాన్యలక్ష్మీ కోపంతో రగిలిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 16వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 16వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో నువ్ ఇద్దరిని రమ్మన్నావ్ని చెప్పిన రానన్నాడు. నువ్ కేవలం తన కోసమే రమ్మంటున్నావని అని రాజ్ చెబుతాడు. అది నిజమే కదా అని స్వప్న అంటుంది. ఏది నిజం అని రుద్రాణి అంటుంది. అప్పు రాకుంటే కల్యాణ్ రాడనే కదా ఇద్దరిని రమ్మనడానికి ఒప్పుకున్నారు అని స్వప్న బదులిస్తుంది.

అలా అని నువ్ ఫోన్ చేసి చెప్పావా అని రాహుల్ అడుగుతాడు. అలాంటి చెండాలమైన అలవాట్లు నీకు మీ అమ్మకు ఉంటాయి అని స్వప్న అంటుంది. అసలు వాడికి ఏమైంది అని ప్రకాశం అంటాడు. అనుభవం అయింది. ఇంట్లో అనామిక వల్ల జరిగిందంతా గుణపాఠం అయింది. ఇంకొకరి జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయో తెలిసొచ్చింది. ఈ ధాన్యలక్ష్మీ, రుద్రాణి ఎలా కాల్చుకుతింటారో అర్థమైందని ఇందిరాదేవి అంటుంది.

అది అప్రస్తుతం

అనామిక సంగతి వదిలేయండి. ఆ పిల్ల తన ప్రవర్తనతోనే కాపురం నాశం చేసుకుంది. కానీ, అనామిక చెప్పిందే నిజం అయింది. అప్పును కల్యాణ్ ప్రేమిస్తున్నాడని చెప్పింది. అదేగా జరిగింది. కానీ, తన ప్రవర్తించిన తీరే సరిగా లేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు. అనామిక ప్రవర్తనపై ధాన్యలక్ష్మీకి సానుభూతి ఉన్నట్లుంది. కానీ, అది అప్రస్తుతం అని అపర్ణ అంటుంది. అసలు వాడు ఏ కారణం చెప్పి రానన్నాడో అది చెప్పమని ఇందిరాదేవి అంటుంది.

కోడలిగా ఒప్పుకుని అప్పుని రమ్మందా అని అడిగాడు. పిన్ని నాతో ఆ మాట చెప్పలేదు. నేను వాడికి ఏం చెప్పలేకపోయాను. కేవలం నాకోసమే ఇద్దరం రావడానికి ఒప్పుకుందే తప్పా. ఆమె ఎప్పటికీ అప్పుని కోడలిగా అంగీకరించదని అన్నాడు. ఆ కారణంగానే ఇంట్లోకెళ్లి బయటకు వెళ్లాను. ఇప్పుడు రానంటున్నాను. అప్పును కోడలిగా ఒప్పుకుంటేనే వస్తాను అని అన్నాడని రాజ్ చెబుతాడు. అంటే ఏంటీ ఇప్పుడు అప్పు కాళ్లు పట్టుకుని రామ్మా మహాలక్ష్మీ అంటేనే వస్తారా అని రుద్రాణి అంటుంది.

నెగెటివ్ డిక్షనరీ

ఏంటీ రాజ్ నేనిప్పుడు వెళ్లి అప్పు కాళ్లు పట్టుకోవాలా అని ధాన్యలక్ష్మీ అంటుంది. చెవులు ఏమైనా దొ.. అని అనబోయిన స్వప్న ఆగి.. వినడం మానేశాయా.. రాజ్ ఏం చెప్పాడు. అందులో కాళ్లు పట్టుకోవడం ఎక్కడి నుంచి వచ్చిందని స్వప్న అంటుంది. దానర్థం అదే కదా అని రుద్రాణి అంటుంది. దేనర్థం అది. ఏ పదానికి అర్థం అది. నీ దగ్గర నెగెటివ్ డిక్షనరీ ఉందా అత్త అని స్వప్న అంటుంది.

స్వప్న అన్నదాంట్లో తప్పేముందు. నేను కాళ్లు పట్టుకోవాలని చెప్పానా. అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతావ్ అత్త అని రుద్రాణిపై సీరియస్ అవుతాడు రాజ్. అవే మందర బుద్ధుల. దూరం పెంచడానికి మాట్లాడే మాటలు తప్పా ఎందుకు ఉపయోగపడవు అని అపర్ణ అంటుంది. రాజ్‌ను కాదనై ధైర్యం కల్యాణ్‌కు ఎక్కడ వచ్చింది. పెళ్లయి రెండ్రోజులు కాలేదు. అప్పు తన గ్రిప్‌లో పెట్టుకోవడం వల్లే కదా. ఈ అక్కా చెళ్లెళ్ల కంటే తను రెండు ఆకులు ఎక్కువే చదివింది అని రుద్రాణి అంటుంది.

ఇంకెంత టార్చర్ చూపిస్తారో

నీ కొడుకుని గ్రిప్‌లో పెట్టుకుని నేను కోతిని ఆడించినట్లు ఆడిస్తున్నానా. ఇప్పటికీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాడు. మేము చెప్పు చేతల్లో పెట్టుకున్నట్లు అంటున్నావ్. కల్యాణ్ ఏమైనా చిన్నపిల్లాడా. నీ మాటలు ధాన్యలక్ష్మీ విన్నట్లు వింటాడు అనుకుంటున్నావా. ఏ సంబంధం లేని అప్పు గురించి మాట్లాడితే ఊరుకోను. అది రాకముందే ఇన్ని మాటలు అంటున్నారు. వస్తే ఇంకెంత టార్చర్ చూపిస్తారో. నువ్వే కరెక్ట్ కావ్య. అప్పుకు వీళ్లు తాతలు అని స్వప్న అంటుంది.

ఇందులో అప్పు ఒక్క మాట అనలేదు. అంతా కల్యాణే మాట్లాడాడు. కళావతి వచ్చాక అడుగడుగునా అవమానమే జరిగింది. మా అమ్మ కోడలిగా, నేను భార్యగా ఒప్పుకోలేదు. అలాంటి కష్టం అప్పుకు రావడం తనకిష్టం లేదని రానన్నాడు అని రాజ్ చెబుతాడు. అంటాడు. నా కొడుకు బయట కష్టాలు పడతాడు. బయటి కోడళ్లు మాత్రం ఆస్తిని అనుభవిస్తారు. కనకం బిడ్డలు అనుభవించడానికే ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ఉంది ఛీ.. నా కొడుకును నాకు దూరం చేసినవాళ్లు బాగుపడరు అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.

బొమ్మలు అమ్మిన కల్యాణ్

మరోవైపు కల్యాణ్ రచయితగా ఉద్యోగం చేసేందుకు ట్రై చేస్తుంటాడు. మరోవైపు కల్యాణ్ దగ్గరికి ధాన్యలక్ష్మీ, రుద్రాణి వస్తారు. ఇప్పుడెళ్లి అడిగితే వాళ్లు వస్తారా అని ధాన్యలక్ష్మీ అంటుంది. వస్తాడని కాదు. కల్యాణ్ పడే కష్టం చూసైన సరే నువ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటావని అని రుద్రాణి అంటుంది. ఓ ముసాలయన బొమ్మలు అమ్ముతుండటం చూస్తాడు కల్యాణ్. ఈ వయసులో ఇంతకష్టపడటం అవసరమా అని కల్యాణ్ అడుగుతాడు.

బొమ్మలు అమ్మితే గానీ పూటగడవదు. ఇంట్లో ఆడది నాకోసం చూస్తుంటుంది. నా కొడుకులు, వాళ్ల పిల్లలు కరోనా వల్ల చనిపోయారు. దేవుడికి కనీసం జాలి లేదయ్యా అని ముసలాయన అంటాడు. ఆ బొమ్మలు ఇవ్వండి నేను అమ్మి పెడతాను అని కల్యాణ్ అమ్ముతుంటాడు. రోడ్డు మీద కల్యాణ్ బొమ్మలు అమ్మడం చూస్తుంది రుద్రాణి. అది చూసి ధాన్యలక్ష్మీకి చెబుతుంది. అది చూసి ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. దగ్గరికి వెళ్లాలని ధాన్యలక్ష్మీ వెళితే.. రుద్రాణి ఆపుతుంది.

ఇల్లు తగలబెట్టేస్తుంది

నువ్ మాట్లాడితే వాడు వస్తాడా. కోట్ల వారసుడు అయినా కల్యాణ్ 50కి 100కి బొమ్మలు అమ్ముతుంటే రాజ్ మాత్రం ఆఫీస్‌కు వెళ్తున్నాడు. వెళ్లి రాజ్‌ని నిలదీయ్. కల్యాణ్‌ను పక్కకు తప్పించిన కావ్యను నిలదీయ్. వదినను, అమ్మనాన్నని కడిగేయ్ అని రుద్రాణి చెబుతుంది. దాంతో ధాన్యలక్ష్మీ కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడు సరిగ్గా మంట వెలిగింది. ఇది ఇంటి వరకు వెళ్లేసరికి ఇల్లు మొత్తం తగలబెట్టేస్తుంది అని రుద్రాణి అనుకుంటుంది.

మరోవైపు బొమ్మలు అన్ని అమ్మేసిన కల్యాణ్ ముసలాయనకు డబ్బు ఇస్తాడు. నీకు నేను ఏం చేయలేను. కానీ, నువ్ అనుకుంది జరగలాని పెద్దవాడిగా దీవిస్తున్నాను అని అంటాడు. అది చాలని కల్యాణ్ వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ కోపంగా వస్తే.. రండి మీకోసం చూస్తున్నానే మొదలుపెట్టండి అని రివర్స్‌లో అంటుంది కావ్య. నా వల్లే వాళ్లు రాలేదని అని కావ్య అన్ని మాటలు అంటుంది. వెటకారమా. అతి తెలివి చూపించకు. అన్నింటికి కారణం నువ్వే అని రాజ్ అంటాడు.

నంగనాచి మాటలు

మీరెందుకు ఒప్పించలేకపోయారు. మీ లక్ష్మణుడు మీ మాట ఎందుకు వినలేదు. మీ పిన్ని చెప్పగానే పెదరాయుడు స్టైల్‌లో వెళ్లారు. మరి ఎందుకు రాలేదు అని కావ్య అంటుంది. ఏ నీకు తెలియదా.. నీలా నంగనాచి మాటలు నాకు మాట్లాడటం రాదే. అలాంటివేవే నంగనాచి కబుర్లు చెప్పి బోల్తా కొట్టించి తీసుకురాగలవు. కానీ, నీకు ఇష్టం లేదు. అందుకే రాలేదు. నీలా నాకు మాట్లాడటం రాదు. అందుకే రాలేదు అని రాజ్ అంటాడు.

నావి నంగనాచి మాటలా అని కావ్య అంటుంది. వాడు నీవల్లే ఇలా తయారు అయ్యాడని రాజ్ ఫైర్ అవుతాడు. నేను మాత్రం వాళ్లకు హెల్ప్ చేస్తాను. ఏదో ఒక రోజు వాడిని పైస్థాయికి వెళ్లేలా చేస్తాను అని రాజ్ అంటాడు. ఇప్పుడు మాత్రం అన్నగా మీరు ఓడిపోయారు. అది మాత్రం ఒప్పుకోవట్లేదు. మీకు ఇగో అని కావ్య అంటుంది. చూస్తుండు ఏదో ఒకరోజు గొప్పగా వాడిని తయారు చేసి ఇంటికి తీసుకొస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు.

తన బుక్ చూసిన కల్యాణ్

ఏవండి మీ ఆలోచనే కరెక్ట్. కానీ, మళ్లీ మీరు హెల్ప్ చేస్తే తను ఎదిగేది ఏముంది. తన సొంత కష్టంతోనే తను ఎదగాలనే కదా నా తాపత్రయం అని కావ్య అనుకుంటుంది. మరోవైపు కల్యాణ్ రోడ్డుమీద బుక్స్ అమ్మడం చూస్తాడు. అక్కడ తన బుక్ ఉండటం చూసి సంతోషిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ ఆఫీస్‍‌‌కు వెళ్తుంటే ధాన్యలక్ష్మీ అడ్డుకుంటుంది. వాడు అక్కడ అన్ని కష్టాలు పడుతుంటే రాజ్ మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఈ ఆస్తిని ముక్కలు చేయండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. కల్యాణ్ ఇంటికి వచ్చేవరకు రాజ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు అని సీతారామయ్య అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.