Brahmamudi November 5th Episode: రాజ్ బాస్‌గా అత్తింటికొచ్చిన కావ్య -మారిపోయిన ధాన్యలక్ష్మి - అనామిక కన్నింగ్ ప్లాన్
Brahmamudi November 5th Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 5 ఎపిసోడ్‌లో కోడలిగా కాకుండా కంపెనీ సీఈవోగా దుగ్గిరాల ఇంటికి వస్తుంది కావ్య. భార్యను చూడగానే ఎవరూ నువ్వు అంటూ రాజ్ అడుగుతాడు. మరోవైపు కొడుకు కోసం ఓ మెట్టు దిగిన ధాన్యలక్ష్మి అప్పు, కళ్యాణ్‌ల ఇంటికి వస్తుంది.
Brahmamudi November 5th Episode: కళ్యాణ్‌పై రివేంజ్ తీర్చుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తుంది అనామిక. ఆటోనడుపుకుంటూ బతుకుతోన్న దుగ్గిరాల వారసుడు అంటూ కళ్యాణ్‌కు తెలియకుండా అతడిపై సీక్రెట్ డాక్యుమెంటరీ తీయమని ఓ డైరెక్టర్‌కు డబ్బులు ఇస్తుంది. డాక్యుమెంటరీ ద్వారా దుగ్గిరాల ఫ్యామిలీ పరువు తీయాలని స్కెచ్ వేస్తుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు దుగ్గిరాల ఇంటి వారసుడిని ఇంట్లో నుంచి గెంటేశారని, ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాడని మీడియాలో డాక్యుమెంటరీ వచ్చేలా చేసి ఆ కుటుంబాన్ని నడి రోడ్డు మీదికి లాగుతానని అంటుంది. ఇలాంటి ప్లాన్స్ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉందని అనామికతో సామంత్ అంటాడు.
ముప్పై కోట్లు నష్టం....
నువ్వు నాతో కలిసి మన కంపెనీని నంబర్‌వన్ ప్లేస్‌కు తీసుకెళతానని అన్నావని అనామికతో అంటాడు సామంత్. చెప్పినట్లుగానే పదేళ్లుగా రాని అవార్డు మన కంపెనీకి వచ్చేలా చేశానని అనామిక సమాధానమిస్తుంది.
ఆ తర్వాత ముప్పై కోట్లు పోగొట్టావు. బోనస్‌గా ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ఒకటని సామంత్ చిరాకుపడుతాడు. ఒక సామ్రాజ్యాన్ని మనం లాక్కోవాలంటే యుద్దమే చేయాలని, ఇప్పుడు నేను అదే చేస్తున్నానని సామంత్‌కు ఆన్సర్ ఇస్తుంది అనామిక. ఈ యుద్ధంలో నేను చావకుంటే చాలని సామంత్ అనుకుంటాడు.
కావ్య చేతుల మీదుగా బోనస్...
తమ కంపెనీ వద్దనుకొని వెళ్లిపోయిన క్లయింట్స్ అందరిని తిరిగి వచ్చేలా చేసిన కావ్యపై ఇందిరాదేవి, సీతారామయ్య ప్రశంసలు కురిపిస్తారు. దీపావళి పండుగకు కంపెనీ ఎంప్లాయ్స్ అందరికి కావ్య చేత బోనస్ ఇప్పించాలని సీతారామయ్య అనుకుంటాడు. బోనస్ సాకుతో కావ్యకు తిరిగి దుగ్గిరాల ఇంటికి రప్పించాలని ఇందిరాదేవి ప్రణాళిక రచిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటుచేస్తుంది.
రుద్రాణి టెన్షన్...
అర్థాంతర మీటింగ్ ఎందుకు ఏర్పాటుచేశారో తెలియక రుద్రాణి తెగ టెన్షన్ పడుతుంది. తన కొడుకు రాహుల్ మళ్లీ ఏదో తప్పు చేసుంటాడని భయపడుతుంది.రుద్రాణికి చెమటలు పట్టడంతో...ఏమైనా తప్పు చేశారా ఏంటి? ఎందుకలా చెమటలు పడుతున్నాయని స్వప్న సెటైర్లు వేస్తుంది.
రుద్రాణి ఫిట్టింగ్...
అప్పుడే అక్కడికి సీతారామయ్య, ఇందిరాదేవి వస్తారు. దీపావళి పండుగకు కంపెనీ ఎంప్లాయ్స్‌కు బోనస్ ఇచ్చే కార్యక్రమంలో ఓ చిన్న మార్పు చేయబోతున్నట్లు ప్రకటిస్తాడు. కంపెనీకి ఎన్ని కోట్లు లాభాలు వచ్చాయని బోనస్‌లు ఇస్తున్నారని, అన్ని నష్టాలే కదా అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది.
బోనస్‌లు ఇచ్చి కంపెనీని మరింత నష్టాల్లోకి నెట్టాలని అనుకుంటున్నారా అంటూ గొడవ మొదలుపెడుతుంది. కంపెనీ నష్టాల పాలు కావడానికి రాహుల్ కారణమంటూ స్వప్న రివర్స్ ఎటాక్ మొదలుపెడుతుంది. లాభ నష్టాల చింత నీకు ఎందుకు అంటూ అపర్ణ కూడా రుద్రాణిని నోరుమూయిస్తుంది.
కావ్య చేతుల మీదుగా బోనస్...
కంపెనీ ఎంప్లాయ్స్‌కు బోనస్‌లను ఇంట్లోనే కావ్య చేతుల మీదుగా ఇప్పించబోతున్నట్లు సీతారామయ్య ప్రకటిస్తాడు. మంచి ఆలోచన అని సుభాష్, అపర్ణ అంటాడు. కానీ ఇది దురాలోచన అని, రాజ్ పరువు వర్కర్స్ పోతుందని రుద్రాణి మళ్లీ ఫిట్టింగ్ పెడుతుంది. సీఈవోగా కావ్య అంతగా ఏం వెలగబెట్టలేదని, కావ్య కుటుంబం బోనస్ తీసుకునే స్టేజ్‌లోనే ఉందని, ఇచ్చే స్థాయికి ఎదగలేదని రుద్రాణి అంటుంది.
మా కుటుంబం కనీసం బొమ్మలు చేసుకొనైనా బతుకుతుందని, మీ స్థాయి ఏంటో చెప్పాల్సిన పనిలేదని రుద్రాణి మాటలకు అడ్డుకట్ట వేస్తుంది స్వప్న.
కావ్యకు పెత్తనం ఇవ్వొద్దు...
అనవసరంగా కావ్యకు పెత్తనం ఇవ్వడం తనకు నచ్చలేదని, బోనస్‌లు మావయ్య ఇవ్వడమే మంచిదని తన మనసులో కావ్య పట్ట ఉన్న ద్వేషాన్ని ధాన్యలక్ష్మి బయటపెడుతుంది. సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీకి పదిహేను కోట్ల లాభాన్ని కావ్య తెచ్చిపెట్టిందని, అదే టైమ్‌లో అనామికకు 40 కోట్ల నష్టాన్ని కలిగించిందని కోడలిని వెనకేసుకొని వస్తాడు సుభాష్.
కళ్యాణ్‌ను ఎవరు పట్టించుకోవడం లేదు...
నిన్నగాక మొన్న సీఈవో కాగానే దుగ్గిరాల ఇంటి దానధర్మాలు అన్ని కావ్య చేత చేయిస్తున్నారు...కానీ నా కొడుకు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లి చాలా రోజులు అయినా అతడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎవరూ చేయడం లేదని, కనీసం పండుక్కి అయినా కళ్యాణ్‌ను పిలవాలని ఒక్కరూ అనుకోవడం లేదని ధాన్యలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. కళ్యాణ్‌ను మేమంతా కలిసి ఇంటికి తీసుకొస్తే అవమానించి తిరిగి పంపించింది నువ్వే...కాబట్టి అతడిని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నీదేనని ధాన్యలక్ష్మితో అంటుంది ఇందిరాదేవి.
భర్త వెంట వెళ్లిన ధాన్యలక్ష్మి...
ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పండక్కి నా కొడుకును, కోడలిని ఇంటికి తీసుకురావాలని నేను ఫిక్సయ్యానని కళ్యాణ్ దగ్గరకు వెళ్లడానికి సిద్ధమవుతాడు ప్రకాశం. ఆలస్యం చేస్తే రుద్రాణి ఏదో ఒకటి చేసి చెడగొడుతుందని అంటాడు. భర్త వెంట తాను బయలుదేరుతుంది ధాన్యలక్ష్మి.
కొడుకును ఒక్కడినే కాదు..కోడలిని కూడా పిలవమని ధాన్యలక్ష్మికి సలహా ఇస్తుంది అపర్ణ. కోడలిని పిలిస్తేనే కొడుకు వస్తాడని ప్రకాశం సమాధానమిస్తాడు. నీకు ఇంత మంచి బుద్ది కలలో కూడా రాదుకదా అని ప్రకాశం అనుమానం వ్యక్తం చేస్తాడు.
ఆ మాట రాజ్ చెప్పాలి....
కావ్యను ఇంటికి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను అందరూ కలిసి ఇందిరాదేవి అప్పగిస్తారు. కావ్య దగ్గరకు వస్తుంది ఇందిరాదేవి. మన ఇంటికి రమ్మని కావ్యతో అంటుంది. ఆ మాట రాజ్ చెప్పాలని కావ్య అమ్మమ్మకు ఆన్సర్ ఇస్తుంది. నేను దీపావళికి ఇంటికొస్తే మీ మనవడి కళ్లలోనే టపాసులు పేలుతాయని కావ్య చెబుతుంది. ఆ టపాసులపై నేను నీళ్లు పోస్తానని ఇందిరాదేవి చెబుతుంది.
కోడలిగా కాదు సీఈవోగా...
ఇంటికి నా అంతట నేను వస్తే రాజ్ నన్ను మామూలుగా ఆడుకోవడని కావ్య భయపడుతుంది. నిన్ను ఇంటి కోడలిగా రమ్మనడం లేదని, కంపెనీ సీఈవోగా రమ్మని కావ్యతో అంటుంది ఇందిరాదేవి. ఈ దీపావళికి ఇంటిదగ్గర కంపెనీ ఎంప్లాయ్స్‌కు నీ చేతుల మీదుగా బోనస్‌లు ఇప్పించాలనుకుంటున్నట్లు కావ్యతో చెబుతుంది ఇందిరాదేవి. ఇది మీరు, మా అత్తగారు కలిసి వేసిన ప్లాన్ కాదు కదా అని కావ్య అనుమానం వ్యక్తం చేస్తుంది.
కనకం ఓవరాక్షన్...
ఇది మీ తాతయ్య తీసుకున్న నిర్ణయం. ఆయన మాటనే కాదని అంటావా అని కావ్యపై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. అమ్మమ్మకే కోపాన్ని తెప్పిస్తావా అంటూ కూతురిపై కనకం చిందులు తొక్కుతుంది. ఓవరాక్షన్ తగ్గించుకోమని కనకంతో అంటుంది కావ్య. బోనస్‌లు ఆఫీస్‌లో ఇస్తానని పట్టుపడుతుంది. ఇందిరాదేవి అందుకు ఒప్పుకోదు. తాను అత్తింటికి తిరిగి వచ్చేలా చేయడానికి అపర్ణ వేసిన ప్లాన్ ఇదని కావ్య అనుకుంటుంది. చివరకు దుగ్గిరాల ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.
కళ్యాణ్ ఆనందం...
కళ్యాణ్, అప్పు దగ్గరకు ప్రకాశం, ధాన్యలక్ష్మి వస్తారు. తమ కోసం తల్లి రావడం చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అంటాడు. అప్పు సంబరపడుతుంది. కళ్యాణ్ ఉంటున్న రూమ్ చూసి ధాన్యలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. మన ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు ఇంతకంటే పెద్ద రూమ్ ఇస్తామని, కోట్లకు వారసుడివైన నువ్వు ఇంత పేదరికంలో బతకడం ఏంటి? చూస్తేనే నేను తట్టుకోలేకపోతున్నానని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఈ గదిలో ఎలా ఉండగలుగుతున్నావని ప్రకాషం అంటాడు. కొడుకు అటో నడుపుతున్నాడని తెలిస్తే ధాన్యలక్ష్మి ఏమైపోతుందోనని అప్పు మనసులో అనుకుంటుంది.
పంతం...పట్టుదలతో...
తాతలు తండ్రులు సంపాదించే ఆస్తుల కన్న నేను కష్టపడి సంపాదించుకున్న వంద రూపాయల్లోనే ఎక్కువగా దొరుకుతుందని కళ్యాణ్ అంటాడు. నువ్వే నీ పంతం, పట్టుదల కోసం మమ్మల్ని దూరం చేసుకుంటున్నావని తల్లితో అంటాడు కళ్యాణ్.
టాపిక్ డైవర్ట్ చేసిన ప్రకాశం నిన్ను, అప్పును దీపావళి పండుగకు ఇంటికి పిలవడానికి వచ్చామని అంటాడు. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటికి రమ్మని చెబుతుంది. పెళ్లైనా తర్వాత వచ్చిన మొదటి పండుగ ఇదని అంటాడు. కావ్య కూడా దీపావళికి ఇంటికి వస్తుందని చెబుతాడు. కావ్య వస్తుందని తెలియగానే అప్పు ఆనందపడుతుంది. మమ్మల్ని రమ్మని అమ్మ అనడం లేదని కళ్యాణ్ అంటాడు.
నీ కోసమే ఓ మెట్టు దిగి ఇక్కడి వరకు వచ్చానని ధాన్యలక్ష్మి చెబుతుంది. కొడుకును పిలిచి కోడలిని పిలవడం మర్చిపోయావని తల్లితో కళ్యాణ్ అంటాడు.
ఎవరు నవ్వు...
ఆటోలో దుగ్గిరాల ఇంటికి వస్తుంది కావ్య. ఆమెను చూసి ఎవరు నవ్వు అని రాజ్ అడుగుతాడు. కంపెనీ సీఈవోను దీపావళి వేడుకలకు ఛైర్మన్ అయిన తాతయ్య రమ్మన్నారని కొడుకుకు అపర్ణ బదులిస్తుంది.
మరోవైపు కళ్యాణ్‌పై తీసిన డాక్యుమెంటరీని టీవీలో వచ్చేలా చేస్తుంది అనామిక. ఆ డాక్యుమెంటరీ దుగ్గిరాల మొత్తం ఒకేసారి చూసేలా రుద్రాణిని సహాయం అడుగుతుంది. అనామిక ప్లాన్ వినగానే రుద్రాణి ఆనందపడుతుంది.