Electric scooter : ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి సూపర్ డిమాండ్- టాప్‌లో ఫ్యామిలీ ఈవీ!
Family electric scooter : ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. అక్టోబర్‌లో హయ్యెస్ట్ సేల్స్‌ని నమోదు చేసింది ఈ సంస్థ. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ తిరిగి పుంజుకుంది. మరీ ముఖ్యంగా ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. ఏథర్ ఎనర్జీ రిటైల్ వాల్యూమ్స్ 20,000 మార్కును దాటడంతో అక్టోబర్‌లో అత్యధిక నెలవారీ సేల్స్‌ని నమోదు చేసింది. 2024 సెప్టెంబర్‌లో విక్రయించిన 12,828 యూనిట్లతో పోలిస్తే అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు నెలవారీగా భారీగా పెరిగాయి! అదే సమయంలో, జులైలో 7.9 శాతంగా ఉన్న మార్కెట్ వాటా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 14.3 శాతానికి పెరిగడం విశేషం.
ఏథర్ రిజ్టాకి సూపర్ డిమాండ్..
కొత్త రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ప్రధానంగా ముందుంది. ఇది గత నెలలో ఏథర్ డిస్పాచ్‌లలో 60-70 శాతం వాటాను కలిగి ఉంది. ఏథర్ రిజ్టా బ్రాండ్‌కి చెందిన మొదటి ఫ్యామిలీ స్కూటర్. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా ఎస్1 శ్రేణి వంటి మెయిన్ స్ట్రీమ్ ఆఫర్లతో పోటీపడుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్ వంటి మార్కెట్లలో ఈ మోడల్ బాగా ప్రాచుర్యం పొందింది.
ఏథర్ మాత్రమే కాదు ఇతర ఈవీ ప్లేయర్లు కూడా అక్టోబర్‌లో బలమైన డిమాండ్‌ని నమోదు చేశారు. గత నెలలో ఈ రంగం 70 శాతం వృద్ధిని సాధించింది! అమ్మకాలు 50,000 మార్కును దాటడంతో ఇటీవల సవాళ్లు ఉన్నప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ ఈ రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ అక్టోబర్‌లో దాదాపు 30,000 యూనిట్ల అమ్మకాలతో రెండొవ స్థానంలో ఉంది. ఇది ఇయర్ ఆన్ ఇయర్లో 45 శాతం పెరిగింది. చివరిగా, బజాజ్ చేతక్ సెప్టెంబర్‌లో నెం.2 స్థానానికి చేరుకున్న తరువాత టీవీఎస్ కు రెండొవ స్థానాన్ని కోల్పోయింది. అయితే గత నెలలో 28,000 యూనిట్లకు పైగా విక్రయించి తరువాత తగ్గుదల స్వల్పంగా ఉంది.
ఎథర్ తన ఈ-స్కూటర్లకు ఉన్న డిమాండ్‌ని చూసి, ఐపీఓ ఆశలను మరింత పెచుకుంది. రూ .4,500 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీకి దేశవ్యాప్తంగా 231 ఎక్స్పీరియన్స్ సెంటర్లు, 2,500 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీనికి తమిళనాడులోని హోసూరులో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. మూడొవ ప్లాంట్ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
దేశీయ అమ్మకాలతో పాటు, ఏథర్ ఎనర్జీ అంతర్జాతీయంగా తన ఉనికిని విస్తరిస్తోంది. ఇటీవల శ్రీలంకకు కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపడం ప్రారంభించింది.
సంబంధిత కథనం