Best battery smartphone : ఇదే ది బెస్ట్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​! మచ్​ అవైటెడ్​ పోకో ఎఫ్​7 సిరీస్​ వచ్చేస్తోంది..-poco f7 and poco f7 ultra are best battery smartphones check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Battery Smartphone : ఇదే ది బెస్ట్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​! మచ్​ అవైటెడ్​ పోకో ఎఫ్​7 సిరీస్​ వచ్చేస్తోంది..

Best battery smartphone : ఇదే ది బెస్ట్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​! మచ్​ అవైటెడ్​ పోకో ఎఫ్​7 సిరీస్​ వచ్చేస్తోంది..

Sharath Chitturi HT Telugu
Nov 22, 2024 12:10 PM IST

POCO F7 launch : పోకో ఎఫ్​7, పోకో ఎఫ్​7 అల్ట్రా స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​కి రెడీ అవుతున్నాయి. వీటికి సంబంధించిన పలు కీలక ఫీచర్స్​ వివరాలు బయటకు వచ్చాయి. వాటిని ఇక్కడ చూసేయండి..

ఇదే ది బెస్ట్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​!
ఇదే ది బెస్ట్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​!

సరికొత్త స్మార్ట్​ఫోన్స్​ని అంతర్జాతీయంగా లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది పోకో సంస్థ! వీటి పేర్లు పోకో ఎఫ్​7, పోకో ఎఫ్​7 అల్ట్రా. ఇక ఇప్పుడు, ఈ రెండు గ్యాడ్జెట్స్​.. సర్టిఫికేషన్​ ప్లాట్​ఫామ్​ అయిని ఐఎండీఏలో దర్శనమిచ్చాయి. ఫలితంగా వీటికి సంబంధించిన పలు కీలక విషయాలు బయపడ్డాయి. వాటి గురించి ఇక్కడ చూసేద్దాము..

పోకో ఎఫ్​ సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​..

రాబోయే రెండు స్మార్ట్‌ఫోన్‌లు 24122RKC7G, 2412DPC0AG మోడల్ నంబర్‌లతో ఐఎండీఏ సర్టిఫికేషన్​కి వెళ్లాయి. లేటెస్ట్​ పోకో స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పలు వివరాలను వెల్లడించనప్పటికీ, ఇది 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్, వైఫై, ఎన్​ఎఫ్​సీకి​ మద్దతును నిర్ధారిస్తుంది. ఇది కాకుండా, పోకో ఎఫ్​7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నాయని ఈ లిస్టింగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

పోకో ఎఫ్​7, పోకో ఎఫ్​7 అల్ట్రా మోడల్స్​ గతంలో ఐఎంఈఏ డేటాబేస్‌లో లైవ్​ అయ్యాయి. ఈ ఎఫ్​ సిరీస్​లో వస్తున్న తొలి ‘అల్ట్రా'.. ఈ పోకో ఎఫ్​7 అల్ట్రా. ఇప్పటివరకు మనకు తెలిసిన దాని ఆధారంగా.. ఈ పోకో ఎఫ్​7 అల్ట్రా రెడ్​మీ కే80 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు! కే80 ప్రో స్మార్ట్​ఫోన్​ త్వరలో చైనీస్ మార్కెట్​లో లాంచ్ అవుతుంది. ఇది కొన్ని టాప్ నాచ్ స్పెక్స్, ఫీచర్లను కలిగి ఉంది. రెడ్​మీ కే80 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్​ఓసీ కలిగి ఉంటుందని పుకార్లు ఉన్నాయి. ముందు భాగంలో, ఇది 2కే రిజల్యూషన్, 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌తో 6.67-ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

పోకో ఎఫ్​7 అల్ట్రా భారీ 6,000ఎంఏహెచ్​ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని మునుపటి పుకార్లు ధృవీకరించాయి. ఇది 120వాట్​ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది! ఈ పోకో ఎఫ్​7.. వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే మొదటి మోడల్ కూడా కావచ్చు.

ఇక పోకో F7.. రెడ్​మీ టర్బో 4కి రీబ్రాండెడ్​ వెర్షన్​గా వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ మోడల్‌లో మీడియాటెక్​ డైమెన్సిటీ 8400 ఎస్​ఓసీ, 6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 1.5క రిజల్యూషన్​తో పాటు మరెన్నో ఎగ్జైటింగ్​ ఫీచర్స్​ ఉండున్నాయి.

పోకో ఎఫ్​7 సిరీస్​కి సంబంధించిన చాలా వివరాలు ప్రస్తుతం రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. సంస్థ వాటిని ఇంకా ధ్రువీకరించలేదు. లాంచ్​ డేట్​ని కూడా ప్రకటించలేదు. త్వరలోనే లాంచ్​ డేట్​పై ఒక అప్డేట్​ వస్తుందని అంచనాలు ఉన్నాయి. లాంచ్​ టైమ్​ నాటికి పోకో ఎఫ్​7, పోకో ఎఫ్​7 అల్ట్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి. వాటిని మేము మీకు అప్డేట్​ చేస్తాము.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

Whats_app_banner

సంబంధిత కథనం