Redmi Note 14 Pro : రెడ్మీ నోట్ 14 ప్రో.. లాంచ్‌కి ముందే ఫీచర్స్ లీక్!
Redmi Note 14 Pro price in India : రెడ్మీ నోట్ 14 ప్రో.. ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్మీ నోట్ 13 సిరీస్ ఇటీవల కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు, రాబోయే రెడ్మీ నోట్ 14 సిరీస్ గురించి లీకులు ఇప్పటికే ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 14, రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మూడు స్మార్ట్‌ఫోన్స్‌లో.. రెడ్మీ నోట్ 14 ప్రోపై మంచి బజ్ నెలకొంది. దీనిపై వస్తున్న లీక్స్‌తో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. రెడ్మీ నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్ మెరుగైన సెన్సార్ తో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుందని పేర్కొంటూ డిజిటల్ చాట్ స్టేషన్ పేరుతో ఉన్న టిప్‌స్టర్ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రెడ్మీ నోట్ 14 ప్రో..
రెడ్మీ నోట్ 13 ప్రోతో పోలిస్తే ఈ రెడ్మీ నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్ టెలిఫోటో కెమెరాతో రావచ్చు. ఇందులో ఓఐఎసతో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి.
రెడ్మీ నోట్ 14 ప్రోలో 1.5కే రిజల్యూషన్‌తో మైక్రో కర్వ్డ్ డిస్ప్లే, నోట్ 13 ప్రో మాదిరిగానే పంచ్ హోల్ కెమెరా కట్ అవుట్ ఉండే అవకాశం ఉంది. గతంలో ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్వోసీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐఎంఈఐ డేటాబేస్‌లో కనిపించింది.
రెడ్మీ నోట్ 14 సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రెడ్మీ ఈ స్మార్ట్‌ఫోన్ గురించి, దాని లాంచ్ గురించి ఎటువంటి వివరాలు పంచుకోలేదు. రాబోయే సిరీస్ గురించి మరింత అవగాహన కోసం రెడ్ మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేద్దాం ..
ఇదీ చూడండి:- Personal Finance : కొత్తగా ఉద్యోగంలో చేరితే.. మీరు డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది
రెడ్మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్స్..
రెడ్మీ నోట్ 13 ప్రోలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 ఇంచ్ 1.5కే అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 67వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే లి-పో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
ఇప్పుడు, రెడ్మీ నోట్ 14 ప్రోతో, స్మార్ట్‌ఫోన్‌కు అవసరమైన అప్‌గ్రేడ్ లను రెడ్మీ ఎలా తీసుకురావాలని ప్లాన్ చేస్తుందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ గ్యాడ్జెట్‌పై మంచి ఆసక్తి ఉంది.
మరో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం