Electric Scooters : డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవి- నెంబర్ ప్లేట్ కూడా అక్కర్లేదు!
Electric Scooters : ఇండియాలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ వంటి అవసరం లేదు! వాటిల్లో కొన్ని ఈ-స్కూటర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో ఈవీ సెగ్మెంట్‌కి కనిపిస్తున్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ 2 వీలర్వైపు చూస్తున్నారు. అయితే, కొన్ని ఈవీలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవసరం లేదని మీకు తెలుసా? ఇండియాలో ఉన్న ఆర్టీఓ రూల్స్, సంబంధిత ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
ఈ ఆర్టీఓ రూల్స్ తెలుసుకోండి..
ఏదైనా ఎలక్ట్రిక్ 2 వీలర్‌కి గరిష్ఠ పవర్ 250 వాట్, గరిష్ఠ స్పీడ్ 25 కేఎంపీహెచ్ ఉంటే, దానికి..
- డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు.
- నెంబర్ ప్లేట్ అక్కర్లేదు.
- 16 అంత కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారు నడపొచ్చు.
- ఇన్సూరెన్స్ అవసరం లేదు.
- ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
హెల్మేట్ ఒక్కటి ఉంటే చాలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రయ్ రయ్‌మంటూ వెళ్లి పోవచ్చు!
ఈ తరహా ఈవీలను తయారు చేస్తున్న కంపెనీలు ఇండియాలో చాలానే ఉన్నాయి. ఈ కేటగిరీలోకి వచ్చే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని..
ఒకినావా లైట్- ఇదొక లో- స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 1.25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ 60కి.మీలు. ఫుల్ ఛార్జ్‌కి 4-5 గంటల సమయం పడుతుంది. టాప్ స్పీడ్ 25 కేఎంపీహెచ్. ఇందులో ఎల్ఈడీ లైట్స్, అల్యుమీనియన్ అలాయ్ వీల్స్, పుష్ స్టార్ట్ ఆన్- ఆఫ్, మొబైల్ ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్ వంటివి ఉన్నాయి.
ఆంపేర్ రియో లి ప్లస్- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 1.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ 70 కి.మీలు. బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేసేందుకు 5-6గంటల సమయం పడుతుంది. దీని టాప్ స్పీడ్ 25కేఎంపీహెచ్. ఎల్ఈడీ లైట్స్, యూఎస్బీ ఛార్జ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
హీరో ఎలక్ట్రిక్ ఆట్రియా ఎల్ఎక్స్- ఈ ఈ-స్కూటర్లో 1.54 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. రేంజ్ 85కి.మీలు. టాప్ స్పీడ్ 25కేఎంపీహెచ్. ఫుల్ ఛార్జింగ్‌కి 4,5 గంటల సమయం పడుతుంది. డేటైమ్ రన్నింగ్ లైట్స్, క్రూజ్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ వంటివి కొన్ని ఫీచర్స్.
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్ఎక్స్- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 1.54 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. రేంజ్ 85కి.మీలు. టాప్ స్పీడ్ 25కేఎంపీహెచ్. ఫుల్ ఛార్జింగ్‌కి 4,5 గంటల సమయం పడుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటిల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఉండదు.
యులు విన్- ఇందులో 1 కేబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ 60కి.మీలు. టాప్ స్పీడ్ 24.9 కేఎంపీహెచ్. బ్యాటరీ ఛార్జింగ్‌కి 4 గంటల సమయం పట్టొచ్చు.
పైన చెప్పిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 80వేల రేంజ్ లోపే ఉంటాయి!
సంబంధిత కథనం